భారత పోటీ ప్రోత్సాహక సంఘం
రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్‌లో నియంత్రణ/వాటాలు కొనుగోలు చేయడానికి ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఐఐహెచ్‌ఎల్ బీఎఫ్‌ఎస్‌ఐ (ఇండియా) లిమిటెడ్, ఏసియా ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ సంస్థలకు సీసీఐ అనుమతి
Posted On:
27 DEC 2023 7:41PM by PIB Hyderabad
రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్‌లో నియంత్రణ/వాటాలు కొనుగోలు చేయడానికి ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఐఐహెచ్‌ఎల్ బీఎఫ్‌ఎస్‌ఐ (ఇండియా) లిమిటెడ్, ఏసియా ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ సంస్థలకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత కొనుగోలు ద్వారా, రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్‌లో (ఆర్‌సీఎల్ లేదా లక్ష్యిత సంస్థ) పైన చెప్పిన మూడు సంస్థలకు నియంత్రణ దక్కుతుంది. ఐఐహెచ్‌ఎల్, ఐఐహెచ్‌ఎల్ బీఎఫ్‌ఎస్‌ఐ, ఏసియా సంస్థలు కొనుగోలుదార్లుగా ఉంటాయి. లక్ష్యిత సంస్థ, ప్రస్తుతం, దివాలా స్మృతి (ఐబీసీ) కింద ప్రారంభించిన దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది.
ఐఐహెచ్‌ఎల్ రిపబ్లిక్ ఆఫ్ మారిషస్‌లో ఏర్పాటైన సంస్థ, మారిషస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ దీనిని నియంత్రిస్తుంది. గ్లోబల్ బిజినెస్ లైసెన్స్ (విభాగం 1) ఉన్న సంస్థ ఇది. ఐఐహెచ్‌ఎల్ ప్రధాన వ్యాపారం పెట్టుబడులు పెట్టడం. వివిధ రంగాల్లో ఉన్న వివిధ కంపెనీల్లో దీని పెట్టుబడులు ఉన్నాయి. ఐఐహెచ్‌ఎల్ ఎలాంటి ఉత్పత్తుల తయారీ, సరఫరా, విక్రయం వంటివి చేయదు, ఏ సేవలను అందించదు.
ఆర్‌సీఎల్ బ్యాంకింగ్‌యేతర ఆర్థిక రంగంలో కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా (సీఐసీ) నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 45-ఐఏ కింద ఇది డిపాజిట్లు స్వీకరించదు. ఆర్‌సీఎల్ కూడా ప్రధానంగా పెట్టుబడుల కంపెనీ. దీని అనుబంధ సంస్థలు, ఇతర గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఆర్‌సీఎల్ అనుబంధ సంస్థలు ఆర్థిక సేవల రంగంలో వివిధ వ్యాపారాలు చేస్తున్నాయి.
సీసీఐ నుంచి వివరణాత్మక ఆదేశం రావలసి ఉంది.
***
(Release ID: 1991204)
Visitor Counter : 107