సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

రాష్ట్ర ప్రభుత్వ అధికార్ల కోసం ఐగాట్‌ వేదికలో 6 సమర్థ్ కార్యక్రమాలను ప్రారంభించిన కర్మయోగి భారత్, నీతి ఆయోగ్

Posted On: 27 DEC 2023 4:39PM by PIB Hyderabad

రాష్ట్ర ప్రభుత్వ అధికార్ల కోసం ఐగాట్‌ వేదికలో 6 సమర్థ్ శిక్షణ కార్యక్రమాలను నీతి ఆయోగ్‌తో కలిసి కర్మయోగి భారత్ ప్రారంభించింది. ఆ కార్యక్రమాలు 1) సమర్థ్ బ్లాక్‌లు 2) సమర్థ్ జిల్లా 3) సమర్థ్ రాజ్య 4) సమర్థ్ రాజ్య సచివ 5) సమర్థ్ పాలసీ 6) సమర్థ్‌ ప్రొక్యూర్‌మెంట్‌. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ అధికార్లు తమ నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంచుకుంటారు, పరిపాలనలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా సన్నద్ధమవుతారు.

సమర్థ్ బ్లాక్‌లు: ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండే అధికార్లు, స్థానిక యంత్రాంగం కోసం దీనిని రూపొందించారు. సమర్థ్ బ్లాక్‌ల్లో 14 కోర్సులు ఉన్నాయి. సమర్థవంతమైన స్థానిక పరిపాలన కోసం నైపుణ్యాలు పెంచడంపై ఇది దృష్టి పెడుతుంది.

సమర్థ్  జిల్లా: జిల్లా స్థాయి అధికార్లు ఈ కార్యక్రమం లక్ష్యం, దీనిలో 14 కోర్సులు ఉన్నాయి. జిల్లా స్థాయి సవాళ్లను పరిష్కరించడానికి, సమర్థవంతమైన సేవలను అందించడానికి అవసరమైన జ్ఞానం, సాధనాలతో అధికార్లు సన్నద్ధం అవుతారు.

సమర్థ్  రాజ్య: రాష్ట్ర స్థాయి అధికార్లు ఈ కార్యక్రమం లక్ష్యం, దీనిలో 14 కోర్సులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి అధికారులకు అవసరమైన అధునాతన నైపుణ్యాలను అందించేందుకు ఈ కోర్సులు ఉపయోగపడతాయి.

సమర్థ రాజ్య సచివ: సీనియర్ అధికార్లు, రాష్ట్ర స్థాయి కార్యదర్శుల కోసం 14 కోర్సులతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సంక్లిష్ట విధానాల అమలు, నూతన మార్పులు ఆహ్వానించడానికి అవసరమైన నైపుణ్యాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది, వారికి సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది.

సమర్థ్ పాలసీ: సమర్థ పాలసీలో 5 కోర్సులు ఉన్నాయి. విధానాల రూపకల్పన, నిర్మాణం, అభిప్రాయాలు, సమాచార విశ్లేషణ, మూల్యాంకనానికి సంబంధించిన చిక్కులకు ఇది పరిష్కారాలు చూపుతుంది, నైపుణ్యాలను పెంచుతుంది.

సమర్థ్  ప్రొక్యూర్‌మెంట్‌: సేకరణ ప్రక్రియల్లో పాల్గొనే అధికార్ల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు, దీనిలో 9 కోర్సులు ఉన్నాయి. సేకరణల మార్గదర్శకాలు, నియమాలు, వ్యూహాలు, పరిశీలనల అంశాల్లో ఇది ప్రత్యేక శిక్షణ అందిస్తుంది.

ప్రభుత్వ అధికార్ల సామర్థ్యాన్ని పెంచడానికి రూపొందించిన సమగ్ర ఆన్‌లైన్ అభ్యాస వేదిక ఐగాట్‌ కర్మయోగి (https://igotkarmayogi.gov.in/). ఆన్‌లైన్ అభ్యాసం, సామర్థ్య నిర్వహణ, కెరీర్ నిర్వహణ, చర్చలు, కార్యక్రమాలు, నెట్‌వర్కింగ్ కోసం ఆరు శిక్షణ విభాగాలను ఈ పోర్టల్ సమ్మిళితం చేస్తుంది. ప్రస్తుతం, 28 లక్షల మంది ప్రభుత్వ అధికార్లు ఐగాట్‌ వేదికలోని 840 పైగా కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారు.

 

***



(Release ID: 1991063) Visitor Counter : 75


Read this release in: English , Urdu , Hindi , Punjabi