సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
జమ్ములో కాంపోజిట్ రీజినల్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం
Posted On:
27 DEC 2023 12:03PM by PIB Hyderabad
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము&కాశ్మీర్‌లోని సంబా జిల్లా విజయపూర్ తెహసిల్‌లోని చక్ జ్వాలాసింగ్ గ్రామంలో 28 డిసెంబర్ 2023న ఉదయం 10.30 గంటలకు కాంపోజిట్ రీజినల్ సెంటర్ (సిఆర్‌సి)ని జమ్ము&కాశ్మీర్ యుటి లెఫ్టనెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ శంకుస్థాపన చేయనున్నారు.
యుటి జమ్ము&కాశ్మీర్‌లోని జమ్ము ఎఐఐఎంఎస్ సమీపంలోని సంబా వద్ద 38 కనాళ్లు, 18 మర్లాల భూమితో కూడిన విశాలమైన ఆవరణలో, వికలాంగులకు అడ్డంకులు లేని వాతావరణంతో కూడిన బహుళ అంతస్తుల భవనంలో ఎన్‌బిసిసి నిర్మించనున్న కొత్త భవనంలో సిఆర్‌సి- జమ్ము ఉంటుంది. ఈ నిర్మాణానికి అంచనా వ్యయాన్ని 29 కోట్లుగా నిర్ణయించి, నిర్మాణ పనిని ప్రారంభించి, ఒక ఏడాది లోపల దానిని పూర్తి చేసేందుకు ఎన్‌బిసిసితో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత, మధ్యాహ్నం 12.15 గంటలకు గౌరవ అతిథులు జమ్ములోని గాంధీ నగర్‌లో 11ఎ/ డిలో సిఆర్‌సి- జమ్ము తాత్కాలిక ఆవరణను ప్రారంభిస్తారు.
భౌతిక లోపాలు, వైకల్యాలు కలిగిన వ్యక్తుల వృద్ధికి, సాధికారతకు, కలుపుకుపోయేందుకు సిఆర్‌సి- జమ్ము అనేది ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. కేవలం పునరావాస రంగానికి మానవ వనరులను అభివృద్ధి చేయడంతో పాటు, ఇది వివిధ వైకల్యాలున్న వ్యక్తులు మన సమాజంలో ప్రయోజకతను కలిగి ఉండటమే కాక, అభివృద్ధి చెందే అవకాశాన్ని కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధికి శిక్షణను అందిస్తుంది. అదనంగా, వివిధ వర్గాలకు చెందిన పిడబ్ల్యుడిలు సమాజంలో స్వతంత్రంగా జీవించేలా తోడ్పడేందుకు పునరావాస సేవలను సిఆర్‌సి- జమ్ము బట్వాడా చేస్తుంది.
భారత ఎంఎస్‌జె&ఇ, వికలాంగుల సాధికారత విభాగం కింద పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజెబిలిటీస్ (పిడియుఎన్ఐపిపిడి), న్యూఢిల్లీ సిఆర్‌సి- జమ్ము పరిపాలనా నియంత్రణను కలిగి ఉంటుంది.

***
(Release ID: 1990946)
Visitor Counter : 90