కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

రూ. 14.20 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించిన టీసీఐఎల్


-2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డివిడెండ్ చెల్లింపు

Posted On: 26 DEC 2023 1:16PM by PIB Hyderabad

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రూ. 14.20 కోట్ల రూపాయల డివిడెండ్‌ను చెల్లించింది. టీసీఐఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ కుమార్, ఈ మేరకు డివిడెండ్ చెక్కును టెలికాం శాఖ కార్యదర్శి శ్రీ నీరజ్ మిట్టల్‌కు అందించారు. సంస్థ  ప్రారంభం నుండి స్థిరంగా లాభాలను ఆర్జించే సంస్థగా ముందుకు సాగుతోంది. సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు చూస్తే ప్రభుత్వానికి రూ.294.19 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. డివిడెండ్ ప్రభుత్వం ఈక్విటీలో రూ. 0.3 కోట్ల తొలి పెట్టుబడిపై ఉంటుంది. 2015-16లో రూ.16 కోట్లను అదనంగా పెట్టుబడి మూలధనం అందించారు. 31 మార్చి 2023 నాటికి కంపెనీ గ్రూప్ మరియు స్టాండ్‌లోన్ నికర విలువ వరుసగా రూ. 1,712.00 కోట్లు మరియు రూ. 618.56 కోట్లుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో టీసీఐఎల్ గత సంవత్సరం కంటే 25 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది, మొత్తం స్వతంత్ర ఆదాయం మరియు పన్ను తర్వాత లాభం వరుసగా రూ. 2,001.7 కోట్లు మరియు రూ. 35.50 కోట్లు. ఆగస్టు 1978లో స్థాపించబడిన ఈ సంస్థ  కమ్యూనికేషన్ల శాఖలోని యొక్క టెలికమ్యూనికేషన్స్ విభాగం కింద పని చేసే మినీ రత్న కేటగిరీ - I హోదా కలిగిన కంపెనీ. సంస్థలో భారత ప్రభుత్వం తన వాటా మూలధనంలో 100 శాతం కలిగి ఉంది. ఇది భారతదేశం మరియు విదేశాలలో టెలికమ్యూనికేషన్స్, ఐటీ మరియు పౌర నిర్మాణం యొక్క అన్ని రంగాలలో ప్రాజెక్ట్‌లను చేపట్టే ఒక ప్రధాన ఇంజనీరింగ్ మరియు కన్సల్టెన్సీ కంపెనీ. టీసీఐఎల్  ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ప్రాజెక్ట్‌లను అమలు చేసింది. కంపెనీ యొక్క ప్రవాస కార్యకలాపాలు కువైట్సౌదీ అరేబియాఒమన్మారిషస్నేపాల్ మొదలైన దేశాలలో ఉంది. దీనికి తోడు ఆఫ్రికా మొత్తం ఈ-విద్యా భారతి & ఆరోగ్య భారతి నెట్వర్క్ ప్రాజెక్ట్లు 15 కంటే ఎక్కువ ఆఫ్రికన్ దేశాలలో నిర్వహించబడుతోంది. మరికొన్ని ఆఫ్రికన్ దేశాలలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందిపోస్ట్ శాఖరక్షణ కోసం ఎన్ఎఫ్ఎస్నేవీ నెట్వర్క్ఏపీఎస్ఎఫ్ఎల్ కోసం భారత్నెట్ ప్రాజెక్ట్తెలంగాణ ఫైబర్బీబీఎన్ఎల్ వీశాట్ఇండియన్ కోస్ట్ గార్డ్ఎంహెచ్ఏరాష్ట్ర పోలీసుల సీసీటీవీ నిఘా ప్రాజెక్టుల కోసం భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన గ్రామీణ ఐసీటీ ప్రాజెక్ట్లను కూడా కంపెనీ అమలు చేస్తోంది.  స్మార్ట్ సిటీలురైల్వేలు-ఎడ్యుకేషన్ మరియు -హెల్త్ ప్రాజెక్ట్లు మొదలైనవి కంపెనీ ప్రాజెక్టులలో భాగంగా ఉన్నాయి.

****



(Release ID: 1990758) Visitor Counter : 44


Read this release in: Tamil , English , Urdu , Hindi