మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మత్స్య,పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పరషోత్తం రూపాల అధ్యక్షతన ఈరోజు విశాఖపట్నంలో జరిగిన జాతీయ మత్స్య అభివృద్ధి మండలి 10వ పాలకమండలి సమావేశం

Posted On: 26 DEC 2023 6:16PM by PIB Hyderabad

కేంద్ర మత్స్య,పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పరషోత్తం  రూపాల అధ్యక్షతన జాతీయ మత్స్య అభివృద్ధి మండలి 10వ పాలకమండలి సమావేశం ఈరోజు విశాఖపట్నంలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు,  కర్ణాటక మత్స్య, ఓడరేవుల శాఖ  మంత్రి శ్రీ మంకల్ ఎస్ వైద్య, మత్స్య శాఖ కార్యదర్శి  డాక్టర్ అభిలాక్ష్ లిఖి, సంయుక్త కార్యదర్శి  శ్రీమతి నీతూ క్మారీ ప్రసాద్,  ఎన్‌ఎఫ్‌డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా.ఎల్.నరసింహ మూర్తి, త్రిపుర, ఉత్తరాఖండ్, పంజాబ్‌ల మత్స్యశాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎన్‌ఎఫ్‌డిబి అమలు చేస్తున్న కార్యక్రమాలు, కృషి పట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.పరిమిత సిబ్బంది కలిగిన ఎన్‌ఎఫ్‌డిబి మత్స్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, విధానాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేస్తూ మత్స్య రంగం సమగ్ర అభివృద్ధికి కృషి చేసి విజయం సాధించిందన్నారు. మత్స్యకార జనాభాలో ఎక్కువ శాతం ఉన్న సంప్రదాయ మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించాలని ఎన్‌ఎఫ్‌డిబికి  ఆయన సూచించారు. సంబంధిత వర్గాలతో చర్చలు రూపొందించి ఎన్‌ఎఫ్‌డిబి రూపొందించే ప్రతిపాదనలను పరిశీలించి అనుమతి మంజూరు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ మంత్రి సూచించిన విధంగా   మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్రాల వారీగా మార్గదర్శకాలు రూపొందించి సమస్య పరిష్కారానికి కృషి జరగాలని శ్రీ రూపాల అన్నారు. 

ఎగుమతి మార్కెట్‌లో అధిక డిమాండ్‌ను కలిగి ఉన్న చేపల ఉత్పత్తి రొయ్యల సాగు మాదిరిగానే సాగాలని   కేంద్ర మంత్రి అన్నారు.మత్స్య రంగం అభివృద్ధికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించి, డీప్ సీ ఫిషింగ్, బోట్లు, సాంప్రదాయ ప్రాసెసింగ్ యూనిట్లు, విత్తన అవసరాలు మొదలైన వాటి కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే అవకాశాలను అన్వేషించడానికి విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.  ఎన్‌ఎఫ్‌డిబి   సాంకేతిక సహకారంతో  మత్స్య రంగం అభివృద్ధికి అవసరమైన  మౌలిక సదుపాయాలను ఆయా రాష్ట్రాలు వేగంగా అమలు చేయాలని ఆయన అన్నారు. . హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు అమలు చేయాలని ఆయన సూచించారు. దేశంలో సం చేపల మార్కెట్‌నుఅభివృద్ధి చేయడానికి  ఎన్‌ఎఫ్‌డిబి నుంచి    సాంకేతిక సహకారం పొందాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. 

పీఎంఎంఎస్‌వై పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 151.81 కోట్ల రూపాయల ఖర్చుతో పోర్ట్ ట్రస్ట్ అమలు చేస్తున్న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులను మంత్రి అధికారులతో  సమీక్షించారు. వివిధ మత్స్యకార సంఘాల ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు.విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌ అభివృద్ధికి అమలు చేయాల్సిన కార్యక్రమాలను గుర్తించి అధికారులకు తెలపాలని ఆయన సూచించారు. నిర్ణీత తేదీ అంటే అక్టోబర్ 2025 లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఫిషింగ్ హార్బర్‌లు  తక్కువగా ఉన్నాయని, ఫిషింగ్ హార్బర్‌లను సంగ్రహించడం పూర్తిగా చేపల వలలు/ పడవలు/ మోటారు వంటి ప్రత్యేక భాగాలతో కూడిన క్రాఫ్ట్‌కు యూనిట్ ధరలో విభజన అవసరం ఉందని  ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి తెలిపారు బోట్లకు ప్లాటినమ్ రోప్‌ కోసం  ప్రత్యేక పథకం అమలు చేయలని , పడవలకు భీమా సౌకర్యం కల్పించాలని మంత్రి కోరారు. పీఎంఎంఎస్‌వై కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు మత్స్యకారులకు ఎక్కువ  జీవనోపాధి అవకాశాలు అందిస్తున్నామన్నారు. మత్స్యకారులకు సింగిల్ నీడ్ బేస్డ్ కాంపోనెంట్‌గా క్రాఫ్ట్, గేర్ పథకాన్ని అమలు చేయడానికి,  డీప్ సీ ఫిషింగ్ ఓడల యూనిట్ ధరను 40 నుంచి 50 లక్షల వరకు పెంచాలని,చేపల  ఓడలకు బీమా కల్పించడానికి చర్యలు అమలు చేయాలనీ శ్రీ అప్పలరాజు కోరారు. 

క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు అమలు చేసి మత్స్యకారుల అభివృద్ధికి ఎన్‌ఎఫ్‌డిబి అమలు చేస్తున్న కార్యక్రమాల  పట్ల డాక్టర్  అభిలాక్ష్ లిఖి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేయడానికి అర్హులను గుర్తించడానికి డిజిటల్ సేవలు ఉపయోగించాలని ఆయన సూచించారు. 

2022-23 లో ఎన్‌ఎఫ్‌డిబి అమలు చేసిన కార్యక్రమాల వివరాలను ఎన్‌ఎఫ్‌డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా.ఎల్.నరసింహ మూర్తి వివరించారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అందిన ప్రాజెక్టుల వివరాలు, ఎఫ్ ఎఫ్ పిఓ ల ఏర్పాటు, వ్యవస్థాపక అభివృద్ధి, శిక్షణ, సామర్థ్య నిర్మాణం, మత్స్య సహకార సంఘాల ఏర్పాటు లాంటి కార్యక్రమాలను  లక్ష్యాల మేరకు అమలు చేశామని ఆయన తెలిపారు. 

ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు నామినేట్ చేసిన  13 మంది సభ్యులు కూడా హాజరయ్యారు.  మత్స్యకారులు ఎదుర్కొంటున్న వారి సమస్యలు , రంగం ముఖ్యంగా మత్స్యకారుల సంఘం అభివృద్ధికి అవసరమైన విషయాలను వివరించారు.  

సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై మత్స్యశాఖ కార్యదర్శి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. బ్రూడ్ బ్యాంక్, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్, హార్బర్ , ల్యాండింగ్ సెంటర్ వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, మత్స్యకారులకు జాప్యం లేకుండా ప్రభుత్వ రుణాలు మంజూరు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.  ఎన్‌ఎఫ్‌డిబి, మత్స్య సంఘాల సహకారంతో మంత్రిత్వ శాఖ  1,74,403కి పైగా కేసీసీ కార్డులు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో   సాగర్ పరిక్రమ: ఫేజ్ 'X'  కోసం రూట్ మ్యాప్‌ను ఖరారు చేయాలని ఆయన సూచించారు.  పీఎంఎంఎస్‌వై పథకం పూర్తి ప్రయోజనాలు లబ్ధిదారులకు అందేలా చూసేందుకు,  ధృవీకరణ పత్రాల పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. 

 

***


(Release ID: 1990633) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Hindi , Tamil