ఆయుష్
azadi ka amrit mahotsav

ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌ విస్తరణకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మరియు ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ


ఫోక్‌ మెడిసన్‌కు జాతీయ కేంద్రంగా ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌ అభివృద్ధి చేయబడుతుంది: శ్రీ సర్బానంద సోనోవాల్

ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌లో ఈశాన్య ప్రాంత వైద్య నైపుణ్యం నిరంతర కృషితో వినియోగించబడుతుంది: శ్రీ పెమా ఖండూ

ఆయుర్వేదం మరియు సాంప్రదాయ ఔషధ పరిశోధన & అభివృద్ధి కోసం ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌లో రూ. 53 కోట్ల కొత్త పెట్టుబడి

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఏర్పాటు కానున్న సోవ రిగ్ప కేంద్రం: శ్రీ సోనోవాల్

Posted On: 26 DEC 2023 3:26PM by PIB Hyderabad

 

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మరియు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ అరుణాచల్‌లోని పాసిఘాట్‌లోని ఈశాన్య ఆయుర్వేద మరియు జానపద వైద్య పరిశోధన సంస్థ (ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌)లో సామర్థ్య విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన చేశారు. మొత్తం ₹53 కోట్ల పెట్టుబడితో ఇన్‌స్టిట్యూట్‌లో అదనపు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయబడతాయి.

 

image.png


ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ పసంగ్ దోర్జీ; అరుణాచల్‌ ప్రదేశ్‌  ఆరోగ్య & కుటుంబ సంక్షేమం, స్త్రీ & శిశు అభివృద్ధి మరియు గిరిజన వ్యవహారాల మంత్రి అలో లిబాంగ్; అరుణాచల్ తూర్పు ఎంపీ (లోక్ సభ) తాపిర్ గావ్; 38 పాసిఘాట్ తూర్పు ఎమ్మెల్యే, కాలింగ్ మోయోంగ్; పాసిఘాట్ వెస్ట్ ఎమ్మెల్యే నిన్నోగ్ ఎరింగ్; అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్, గుంఝుమ్ హైదర్; అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ టోమో రిబా ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

 

image.png

image.png


ఈ సందర్భంగా కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు ఆయుష్‌శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ “సాంప్రదాయ వైద్యం వేలాది సంవత్సరాలుగా మానవాళికి వారసత్వ వైద్యాన్ని అందిస్తోంది. ఇది తరతరాలుగా మన జీవితాలను సుసంపన్నం చేయడంతో పాటు మన వారసత్వంగా మిగిలిపోయింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  దూరదృష్టితో కూడిన నాయకత్వంలో మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు సుసంపన్నమైన జీవితానుభవాన్ని ప్రజలకు అందించడానికి సాంప్రదాయ ఔషధంతో పాటు స్థానిక వైద్యానికి పునరుజ్జీవనం కల్పించడానికి అద్భుత ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నానికి అనుబంధంగా మోదీ ప్రభుత్వం ఆయుర్వేద మరియు సాంప్రదాయ ఔషధాల పరిశోధన మరియు ఆయుర్వేదంలో దాని పరిశోధన మరియు అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఉత్ప్రేరకంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించే నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్‌ మెడిసన్‌ రీసెర్చ్‌  (ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌)లో అదనపు మౌలిక సదుపాయాలను నిర్మించడానికి పెట్టుబడి పెట్టింది. అలాగే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే సోవ రిగ్పాపై  కేంద్రం ఏర్పాటు కానుంద‌ని మీ అందరితో పంచుకోవ‌డం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.

 

 

image.png


ఈ సంస్థ ఈశాన్య ప్రాంతపు సాంప్రదాయ ఔషధాలను శాస్త్రీయంగా డాక్యుమెంట్ చేయడం, రికార్డు చేయడం, పరిశోధన చేయడం వంటి వాటిపై కూడా కృషి చేస్తోంది. ఇన్‌స్టిట్యూట్‌లోని సామర్థ్య విస్తరణలో అకడమిక్ భవనం, బాలురు మరియు బాలికల విద్యార్థుల కోసం హాస్టల్‌లు, స్టాఫ్ క్వార్టర్‌లు అలాగే డైరెక్టర్‌ల బంగ్లా ఉన్నాయి. హాస్టళ్లలో ఇన్‌స్టిట్యూట్‌లోని 70 మంది బాలురు మరియు 70 మంది బాలికలు ఉంటారు. ఆయుర్వేదంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ (బిఏఎంఎస్) అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో నాణ్యతను అందించడం కోసం ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌లో ఆయుర్వేద కళాశాలను ప్రారంభించేందుకు అదనపు మౌలిక సదుపాయాలను నిర్ణీత సమయంలో అభివృద్ధి చేయడానికి ఈ పెట్టుబడి ఉపయోగపడుతుంది. పాసిఘాట్‌లోని కొత్త ఆయుర్వేద కళాశాల విద్య, పరిశోధన మరియు విస్తరణ సేవల ద్వారా ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తుంది మరియు అభివృద్ధి చేస్తుంది. భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేసే ఏజెన్సీగా ఉంది.

 

 

image.png


ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ మాట్లాడుతూ “సాంప్రదాయ వైద్యం గొప్పతనాన్ని ఉపయోగించుకునే దిశగా అరుణాచల్ ప్రదేశ్ - నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ (ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌) సంస్థ కృషి చేయడం చాలా సంతోషంగా ఉంది.  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో ఈ ఇన్‌స్టిట్యూట్ సామర్థ్యం విస్తరించబడుతోంది. ఇది ఈశాన్య ప్రాంతం నుండి సాంప్రదాయ వైద్యానికి సహాయపడటమే కాకుండా రోగుల సంరక్షణలో విస్తృత అప్లికేషన్ కోసం శాస్త్రీయ పద్ధతిలో మన సాంప్రదాయ ఔషధాలను డాక్యుమెంట్ చేయడానికి ఒక అవకాశం. భారతదేశ సాంప్రదాయ ఔషధ  పునరుజ్జీవనానికి ప్రధాని మోదీ ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది వివిధ వ్యాధులకు చికిత్స చేయడంలో మరియు మెరుగైన జీవితాన్ని అందించడంలో దాని ప్రభావాన్ని నిరూపించింది. ఫార్మాస్యూటికల్, ఆయుర్వేద & సుగంధ రంగాలకు గొప్ప వాణిజ్య సంభావ్యత కలిగిన ఈ ప్రాంతంలోని సుసంపన్నమైన ఔషధ మొక్కలు రాష్ట్రం మరియు ఈశాన్య ప్రాంతాలకు వాణిజ్య మార్గాలను అన్‌లాక్ చేస్తాయని చెప్పారు.

ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌ పాత్ర గురించి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ “ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి,  ప్రకృతి వైద్యం మరియు సోవా రిగ్పా వంటి సాంప్రదాయ ఔషధాలను పునరుజ్జీవింపజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆత్మనిర్భర్తగా మారే దిశగా దేశం ప్రయాణిస్తున్నందున ఆయుష్ మంత్రిత్వ శాఖ వైద్య శాస్త్రంలోని ఔషధ మరియు రోగుల సంరక్షణ రంగాలలో విస్తృత వినియోగం కోసం శాస్త్రీయ ధృవీకరణతో మన సుసంపన్నమైన సాంప్రదాయ ఔషధ వ్యవస్థను ప్రారంభించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. తద్వారా మన సాంప్రదాయ వైద్యుల సంఘానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా జానపద ఔషధం యొక్క పరిధిని కూడా విస్తరించింది. ఇది వారి జీవితాలను నయం చేయడానికి మరియు సుసంపన్నం చేయడానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలను చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌ భారతదేశంలోని ప్రముఖ సంస్థ. ఇది ఈ ప్రాంత సాంప్రదాయ వైద్యాన్ని పునరుద్ధరించడానికి అంకితభావంతో పని చేస్తోంది. మన సుసంపన్నమైన ఆయుర్వేద వారసత్వం స్థానిక సుసంపన్నమైన సాంప్రదాయ ఔషధ పద్ధతుల నుండి కూడా వృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతో ఇన్‌స్టిట్యూట్  రోగుల సంరక్షణ పరిష్కారాలతో మరింత పునరుజ్జీవింపజేయడానికి ఆయుర్వేదాన్ని చేర్చింది. తన ప్రయత్నాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సంస్థను సాంప్రదాయ  ఔషధానికి జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నాము" అని తెలిపారు.

నార్త్ ఈస్ట్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద & ఫోక్ మెడిసిన్ (ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌) పాసిఘాట్ ఈశాన్య ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి స్థాపించబడింది. ఇది స్థానిక ఆరోగ్య సంప్రదాయాలు (ఎల్‌హెచ్‌టిలు) మరియు ఎథ్నో మెడిసినల్ ప్రాక్టీసెస్ (ఈఎంపిలు)కు సంబంధించిన అంశాలకు అపెక్స్ రీసెర్చ్ సెంటర్‌గా పనిచేస్తోంది. మానవ జీవితాలను సుసంపన్నం చేయడానికి సాంప్రదాయ వైద్యం సామర్థ్యాన్ని శాస్త్రీయంగా నిరూపించడానికి మరియు ధృవీకరించడానికి ఈ సంస్థ సాంప్రదాయ వైద్యులు, ఆయుర్వేద పరిశోధకులు మరియు శాస్త్రీయ సమాజానికి ఒక వేదికగా కూడా పని చేస్తోంది.

భవిష్యత్తులో ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌ను బలోపేతం చేయడానికి ఎన్‌ఈఐఏఎఫ్‌ఎంఆర్‌ సమీపంలో (ప్రాంతీయ రా డ్రగ్ రిపోజిటరీ (ఆర్‌ఆర్‌డిఆర్‌) & మ్యూజియం, అధునాతన అనలిటికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఫెసిలిటీ (ఎస్‌ఏఐఎఫ్‌), స్టేట్ ఆఫ్ ఆర్ట్ పంచకర్మ ట్రీట్‌మెంట్ & రీసెర్చ్ సెంటర్, పారామెడికల్ టీచింగ్ సెంటర్ మొదలైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
 

***


(Release ID: 1990631) Visitor Counter : 116


Read this release in: English , Urdu , Hindi , Assamese