బొగ్గు మంత్రిత్వ శాఖ
తమిళనాడు వరద బాధిత ప్రజల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.4.30 కోట్లు అందించిన ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్
Posted On:
26 DEC 2023 3:29PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.4.30 కోట్ల విరాళం ఇచ్చింది. ఎన్‌ఎల్‌సీ ఇండియా ఉద్యోగులు ఇచ్చిన ఒక రోజు జీతం రూ.2.30 కోట్లు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. ఇటీవల, మిచాంగ్ తుపాను, వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సాయం చేయడానికి ఈ సాయాన్ని ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అందించింది. తుపాను వల్ల చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. దక్షిణ జిల్లాలైన ట్యుటికోరిన్, తిరునెల్వేలిలోనూ భారీ వర్షాలు పడ్డాయి, అక్కడి ప్రజలకు సాయం కోసం కూడా ఆ విరాళాన్ని ఉపయోగిస్తారు.
ఈ రోజు తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ. ఎం.కె.స్టాలిన్‌ను కలిసిన ఎన్‌ఎల్‌సీ ఇండియా ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రసన్న కుమార్ మోటుపల్లి, రూ.4.30 కోట్ల చెక్కును అందించారు.
ఎన్‌ఎల్‌సీ ఇండియా, ఇంజినీర్లు & సాంకేతిక నిపుణులతో పాటు 18 భారీ 25 హెచ్‌పీ నీటి పంపులను కూడా డిసెంబర్ 5-15 తేదీల్లో అందించింది. ఈ నీటి పంపుల ద్వారా కీలక ప్రదేశాల్లో నివాస స్థలాల నుంచి 51,20,000 క్యూబిక్ అడుగుల నీటిని తొలగించారు.
ఈ నెల 17 నుంచి, వరద ప్రభావిత ట్యుటికోరిన్ జిల్లాలో పన్నెండు 25 హెచ్‌పీ పంపులను ఎన్‌ఎల్‌సీ ఇండియా ఉపయోగిస్తోంది. దీంతోపాటు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం ట్యుటికోరిన్ ఎన్‌ఎల్‌సీఐఎల్ విద్యుత్ ప్లాంటులోని ఆర్‌వో ప్లాంటు నుంచి తాగునీటిని అందిస్తోంది.
***
(Release ID: 1990504)
Visitor Counter : 80