మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
'కాశీ తమిళ సంగమం' రెండో దశలో భాగంగా కాశీ చేరుకున్న తమిళ ప్రతినిధుల ఐదో బృందం
Posted On:
25 DEC 2023 6:12PM by PIB Hyderabad
'కాశీ తమిళ సంగమం' రెండో దశలో, రైతులు & చేతివృత్తి కళాకారులతో కూడిన ఐదో బృందం (నర్మద) ఈ రోజు కాశీకి చేరుకుంది. వీరికి కాశీ రైల్వే స్టేషన్‌లో ఘనస్వాగతం లభించింది. ప్రయాగ్‌రాజ్, అయోధ్యను కూడా రైతులు & చేతివృత్తి కళాకారుల బృందం సందర్శిస్తుంది. కాశీ విశ్వనాథ్ ధామ్, కాలభైరవ ఆలయం, సారనాథ్, హనుమాన్ ఘాట్, గంగా హారతి, ఇతర ప్రదేశాలను కూడా సందర్శిస్తుంది.
కాశీ తమిళ సంగమం రెండో దశ ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. గత సంవత్సరం, కాశీ తమిళ సంగమం మొదటి దశ 2022 16 నవంబర్ నుంచి డిసెంబర్ 16 వరకు జరిగింది. వివిధ వయస్సులకు చెందిన దాదాపు 1400 మంది (ఒక్కో బృందంలో 200 చొప్పున 7 బృందాలు) తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి కాశీకి వస్తారని భావిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులు, ఆధ్యాత్మికవేత్తలు, రైతులు, కళాకారులతో కూడిన ఐదు బృందాలు ఇప్పటి వరకు వారణాసికి చేరుకున్నాయి.


***
(Release ID: 1990503)
Visitor Counter : 98