ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్యాంకుల , కస్టమర్ సేవల అనుభవాన్ని మరింత పెంచేందుకు నిర్దేశించిన వర్క్షాప్కు అధ్యక్షత వహించిన డి.ఎఫ్.ఎస్ సెక్రటరీ డాక్రట్ వివేక్ జోషి.


ఎన్.ఎ.ఆర్.సి.ఎల్ చే అకౌంట్ల సేకరణ, ఐబిసి ప్రొవిజన్ల కింద ఖాతాల పరిష్కారానికి సంబంధించి మరో రెండు సమావేశాలకు అధ్యక్షత వహించిన
డాక్టర్ జోషి.

Posted On: 22 DEC 2023 8:49PM by PIB Hyderabad

డిపార్టమెంట్ ఆఫ్ పైనాన్షియల్ సర్వీసెస్(డిఎఫ్ఎస్) కార్యదర్శి డాక్టర్ వివేక్ జోషి, బ్యాంకుల కస్టమర్ల సేవలకు సంబంధించి నిర్వహించిన
వర్క్షాప్కు అధ్యక్షత వహించారు.ఈ వర్క్షాప్కు ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా వివిధ బ్యాంకుల ఎం.డిలు, ఇడిలు హాజరయ్యారు. ఈ వర్క్ షాప్ సందర్బంగా, కొన్ని బ్యాంకులు, తమ బ్యాంకులలో కస్టమర్ల సంతృప్త స్థాయిని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు వివరించాయి.
అలాగే కస్టమర్ల నుంచి వివిధ మార్గాలలో వారి అభిప్రాయాలు తీసుకుంటూ,వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు
చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థలలో కస్టమర్ల అనుభవాలను వాస్తవంగా తెలుసుకునేందుకు మూడు అంశాలనూ సవివరమైన
కస్టమర్ సర్వే నిర్వహించడం జరిగింది.
అవి
––కస్టమర్ల అభిప్రాయాలు వినడం ( పది డిజిటల్ ప్లాట్ఫారం ఎక్స్, ఫేస్బుక్, తదితర ప్లాట్ఫారం ల ద్వారా) కస్టమర్ల అనుభవాన్ని సేకరించడం.
‌‌–– కస్టమర్ల ఇంటర్వూలు, సర్వేలు
––బ్యాంకులు సమర్పించిన సమాచారా విశ్లేషణ.( వివిధ బ్రాంచిలలో , కాల్ సెంటర్లలో,కస్టమర్లు వేచి ఉంటున్న సమయం,
స్వీయ సేవలు అందించే యంత్రాల అందుబాటు వంటివి)

వర్క్షాప్ సందర్భంగా , వ్యవస్థాగత కస్టమర్ సర్వీసు కొలమానం వంటి వాటిని ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ వ్యవస్థల ద్వారా మరింత ముందుకు తీసకుపోవచ్చని నిర్ణయించారు.
(అవి ప్రాసెస్ ల విషయంలో సమర్ధత. చానల్ మిక్స్, ఫిర్యాదుల నిర్వహణ, తదితరాలు) అలాగే కస్టమర్ కేంద్రిత ఆలోచనా విధానాన్ని
మొత్తం సంస్థలో  నెలకొల్పడం. కస్టమర్ సేవల పెంపునకు సాంకేతికత అభివృద్ధి (ప్రాడక్ట్, కస్టమర్ ప్రాసెస్లలో సాంకేతికతను చొప్పించడం)
సర్వీసులు అందించడంలో  ప్రమాణాల నిర్ధారణ వంటి వాటిని నొక్కి చెప్పడం జరిగింది.

మధ్యాహ్నం నుంచి జరిగిన సెషనల్లో , ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ డాక్టర్ వివకే జోషి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, నేషనల్ అసెట్ రీ కన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్.ఎ.ఆర్.సి.ఎల్) ప్రగతిని సమీక్షించారు.
ఈ సమావేశానికి  ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్లు, ఇడిలు, ఎస్.బి.ఐ ఛైర్మన్, ఎం.డి, సి.ఇ.ఒ, బ్యాంకుల ఇడిలు,  ఎన్.ఎ.ఆర్.సి.ఎల్ ఛైర్మన్, ఇండియా డెట్ రెసల్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఐడిఆర్సిఎల్) తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశం సందర్బంగా , ఎన్.ఎ.ఆర్.సి.ఎల్, బ్యాంకులు, తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాయి.  
రుణదాతలు ఎన్.ఎ.ఆర్.సిఎల్ కు సమర్ధంగా రుణం కేటాయింపునకు సంబంధించి సమర్ధమైన వ్యవస్థలు, ప్రాసెస్లు ఏర్పాటు చేసుకోవాలి.  అక్విజిషన్ ప్రక్రియను వీలైనంత తగ్గించేందుకు సంప్రదింపులు
జరపడం గురించి చర్చించడం జరిగింది. ఇంటర్ –సె క్రెడిటర్ల కు సంబంధించిన అంశాలు,వివిధ సెక్యూరిటీ వ్యవస్థలు, అదనపు కొల్లేటరళ్లు, ప్రత్యేక భద్రతలు, వంటి వాటిని దీర్ఘకాలిక దృష్టితో చర్చించడం జరిగింది.
ఐబిసి ప్రోవిజన్ల కింద ఖాతాల పరిష్కార స్థాయిపై మరో సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ గోవిల్,ఐబిబిఐ ఛైర్మన్ శ్రీ రవి మిత్తల్, ఆర్థిక సేవలకు సంబంధించి
సీనియర్ అధికారుల, ఎస్.బి.ఐ ఛైర్మన్, ఎం.డి, సి.ఇ.ఒ, వివిధ ప్రభుత్వ  రంగ బ్యాంకుల ఛైర్మన్లు, సిఇఒలు ఇడిలు హాజరయ్యారు.

ఈ సమావేశం సందర్భంగా బ్యాంకులు పెద్ద ఖాతాల విషయంలో దాఖలైన దివాలా పిటిషన్ల స్థితిపై కూడా చర్చించారు. ఐబిసి ప్రాసెస్ల సమర్ధతను పెంచేందుకు, బ్యాంకులు దాఖలు చేసే దరఖాస్తులను సులభతరం చేసేందుకు,
మరింత అనుభవం కలిగిన కౌన్సిళ్ల ఏర్పాటు , అత్యధిక విలువ కలిగిన కేసులను బ్యాంకుల యాజమాన్యాలు క్రమంతప్పకుండా పర్యవేక్షించడం వంటి అంశాలను చర్చించారు. నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్.ఇ.ఎస్.ఎల్)
సమర్పించే రికార్డులు, డిఫాల్ట్ ఉన్నట్టు ధృవీకరించడానికి ప్రాతిపదికగా సరిపోయేలా ఉండాలన్నారు. బ్యాంకుల న్యాయ నిపుణుల బృందాల మధ్య, ఎన్.ఇ.ఎస్.ఎల్, ఇన్ సాల్వెన్సి, ఇన్ సాల్వెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా,
వంటి వాటితో సమర్ధ, కాలపరిమితితో కూడిన పరిష్కారానికి తగిన సమన్వయం ఉండాలని నిర్ణయించారు. బ్యాంకుల ఎం.డిలు ఆయా కేసులను స్వయంగా పర్యవేక్షించాలని, ప్రత్యేకించి ఉన్నతస్థాయి 20 కేసులను వారు స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించడం జరిగింది.

 

***


(Release ID: 1990241) Visitor Counter : 86


Read this release in: English , Urdu , Hindi