రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఎన్‌డిఎ ప్ర‌తిష్ఠాత్మ‌క 75 సంవ‌త్స‌రాల ప‌నితీరుకు గుర్తుగా జాతీయు యుద్ధ స్మార‌కం నుంచి జెఎస్‌డ‌బ్ల్యు-ఎన్‌డిఎ కార్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించిన సిఐఎస్‌సి లెఫ్ట‌నెంట్ జ‌న‌ర‌ల్ జెపి మాథ్యూ

Posted On: 24 DEC 2023 2:37PM by PIB Hyderabad

 చైర్మ‌న్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ (సిఐఎస్‌సి) ఏకీకృత ర‌క్ష‌ణ సిబ్బంది అధిప‌తి లెఫ్ట‌నెంట్ జ‌న‌ర‌ల్ జెపి మాథ్యూ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మార‌క చిహ్నం నుంచి ఢిల్లీ నుంచి గ్వాలియ‌ర్ ద‌శ జెఎస్‌డ‌బ్ల్యు-ఎన్‌డిఎ కార్ ర్యాలీకి డిసెంబ‌ర్ 24, 2023న జెండా ఊపి ప్రారంభించారు. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీని ప్రారంభించి 75ఏళ్ళు అయిన సంద‌ర్భంగా జ‌రుగుతున్న వేడుక‌ల్లో భాగంగా ఈ ర్యాలీని ప్రారంభించారు.
మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఇనాయ‌త్ హ‌బీబుల్లా ఆధ్వ‌ర్యంలో ప్రారంభించిన ఆప‌రేష‌న్ బద్లీ మూలాలు గ‌ల ఈ ఆప‌రేష‌న్‌కు హృద‌య‌పూర్వ‌క నివాళిగా ప్రారంభించిన ఈ ర్యాలీని ప్రారంభించారు. డెహ్రాడూన్ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌యాణంలో భాగంగా, ర్యాలీ గ్వాలియ‌ర్‌, ఎంహెచ్ఒడ‌బ్ల్యు, నాసిక్‌, ముంబై వంటి ప్ర‌ముఖ సాయుధ ద‌ళాల కేంద్రాల ద్వారా ప్ర‌యాణించి, ఆరు రోజుల్లో 1800 కిమీల సాహ‌స యాత్ర పూణెలోని నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీ వ‌ద్ద ముగియ‌నుంది. 
కార్య‌క్ర‌మంలో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ మార్ష‌ల్ అమ‌ర్ ప్రీత్ సింగ్‌, వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ వైస్ అడ్మిర‌ల్ సంజ‌య్ జె సింగ్‌, ప‌ద‌వి నిర్వ‌హిస్తున్న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్ట‌నెంట్ జ‌న‌ర‌ల్ త‌రుణ్ కుమార్ ఐచ్‌, ఎన్‌డిఎ క‌మాండెంట్ వైస్ అడ్మిర‌ల్ అజ‌య్ కొచ్చార్‌, త్రివిధ ద‌ళాల‌కు చెందిన ఇత‌ర సీనియ‌ర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
ర్యాలీకి ముంబై నుంచి వాహ‌నాల పునఃస్థాప‌న‌ను సుల‌భ‌త‌రం చేయ‌డంలో మ‌హీంద్రా ఆటో మ‌ద్ద‌తు విశిష్ట‌మైన‌ది. అంతేకాక‌, హెచ్‌క్యూ ఐడిఎస్, ఐఎన్ ఎస్ ఇండియా త‌మ కీల‌క‌మైన పాల‌నాసంబంధ‌, లాజిస్టిక‌ల్ మ‌ద్ద‌తు కోసం గుర్తింపును పొందాయి. 
ర్యాలీ ఈ స‌వాళ్ళ‌తో కూడిన ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌డం ద్వారా ఎన్‌డిఎ వార‌స‌త్వాన్ని నిర్వ‌చించే ప‌రాక్ర‌మం, శౌర్యం, త్యాగాల‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సీనియ‌ర్ అధికారుల‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్క్ష‌త‌లు తెల‌ప‌డం ద్వారా కార్య‌క్ర‌మం ముగిసింది. మ‌హీంద్ర ఆటో, నిర్వ‌హ‌కులు, భాగ‌స్వాములు, స‌హ‌క‌రించిన వారంద‌రూ, శ్రేష్ఠ‌త‌, స‌మ‌గ్ర‌త‌, దేశ నిర్మాణానికి నిరంత‌ర అంకిత‌భావం కోసం ఇచ్చిన పిలుపును ప్ర‌తిధ్వ‌నించారు. 

 

 

***
 


(Release ID: 1990237) Visitor Counter : 103