పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
వన్యప్రాణుల ఆరోగ్యం , వన్ హెల్త్ భాగస్వామ్యం పై రెండవ జాతీయ వాటాదారుల వర్క్ షాప్ ను విజయవంతంగా నిర్వహించిన సెంట్రల్ జూ అథారిటీ
Posted On:
23 DEC 2023 7:19PM by PIB Hyderabad
సెంట్రల్ జూ అథారిటీ 2023 డిసెంబర్ 22న న్యూఢిల్లీలో 2వ జాతీయ స్థాయి భాగస్వాముల వర్క్ షాప్ ను విజయవంతంగా నిర్వహించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎం ఒ ఇ ఎఫ్ అండ్ సి సి) సహాయ మంత్రి శ్రీ అశ్విని చౌబే అధ్యక్షతన జరిగిన ఈ వర్క్ షాప్ లో ఎం ఒ ఇ ఎఫ్ అండ్ సి సి కార్యదర్శి శ్రీమతి లీనా నందన్, ఎం ఒ ఎఫ్ ఎ హెచ్ డి కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ్, డిజిఎఫ్ అండ్ ఎస్ ఎస్ ఎంఓఇఎఫ్ అండ్ సిసి శ్రీ సిపి గోయల్, ఎడిజి వైల్డ్ లైఫ్ శ్రీ బివాస్ రంజన్ పాల్గొన్నారు. నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్ ఆర్ సి-డబ్ల్యూ) అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, వన్ హెల్త్ కార్యక్రమాల కోసం సహకారాన్ని పెంపొందించడం ఈ వర్క్ షాప్ లక్ష్యం.
ఈ కార్యక్రమంలో మానవ ఆరోగ్యం, పశు ఆరోగ్యం, వన్యప్రాణి పరిశోధన సంస్థలు, నేషనల్ పార్క్ నిర్వాహకులు, జూ డైరెక్టర్లు మొదలైన వివిధ సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. సీసీఎంబీ, ఐ సి ఎ ఆర్- ఎన్ ఐ వి ఇ డి ఐ , డబ్ల్యూఐఐ, ఎన్ టి సి ఎ , ఐవీఆర్ఐ వంటి సంస్థలు కూడా ప్రాతినిధ్యం వహించాయి.
నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ అభివృద్ధికి సంబంధించి లోతైన చర్చలకు, సంప్రదింపుల విధానానికి ఈ వర్క్ షాప్ వేదికగా ఉపయోగపడింది. సిజెడ్ఎ సభ్య కార్యదర్శి శ్రీ సంజయ్ శుక్లా , సిజెడ్ఎ డిజిఎఫ్ శ్రీమతి ఆకాంక్ష మహాజన్ సాదర స్వాగతం పలికారు, వన్యప్రాణుల ఆరోగ్య నిర్వహణ కీలకమైన అంశాలపై భాగస్వామ్య చర్చలకు వేదికను ఏర్పాటు చేశారు.
శ్రీ అశ్విని కుమార్ చౌబే "గొప్ప వన్యప్రాణులు జీవవైవిధ్యానికి సంబంధించి భారతదేశ ప్రత్యేక స్థానం గురించి, ఏనుగుల శ్రేణిలో మన దేశం మొదటి స్థానం గురించి, ఆసియా సింహానికి మన దేశం ప్రత్యేక ఆవాసం గురించి” వివరించారు. వీటన్నింటి దృష్ట్యా వన్యప్రాణుల ఆరోగ్యం- వ్యాధుల వ నిర్వహణ పట్ల సమగ్ర దృక్పథం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ (పిఎం- ఎస్టిఐఏసీ) ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమాలను చురుకుగా ప్రోత్సహించడం ద్వారా వన్ హెల్త్ మిషన్ కు ప్రదర్శించిన మద్దతును మంత్రిత్వ శాఖ ఎల్లప్పుడూ సమర్థిస్తుందని ఆయన పేర్కొన్నారు. మనుషులు, పశువులు, వన్యప్రాణులపై సమగ్ర నిఘా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. కోవిడ్-19 మహమ్మారితో పోలికలను చూపుతూ, సమగ్ర, సమీకృత వ్యూహం ద్వారా అత్యవసర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధాని మోదీని ఆయన ప్రశంసించారు. ప్రజారోగ్యం, వన్యప్రాణుల సంరక్షణ రెండింటిలోనూ సంక్షోభాల ప్రభావాన్ని తగ్గించడంలో ఐక్య విధానం సామర్థ్యాన్ని ఈ ఉదాహరణ గుర్తు చేసింది.
ఎన్ ఆర్ సి-డబ్ల్యు అభివృద్ధి, వన్యప్రాణి రంగంలో వ్యాధి నిఘా అవసరాలు, మానవ, పశుసంవర్థక కార్యక్రమాలతో అనుసంధానం, వన్యప్రాణి రంగానికి ఆర్ అండ్ డి అవసరాలు, సమర్థవంతమైన సామర్థ్య పెంపు ఫ్రేమ్ వర్క్ ఆవశ్యకత వంటి అంశాలపై సెషన్ లలో చర్చించారు.
భారతదేశం లోనూ, ప్రపంచం లోనూ సమగ్ర, నియంత్రిత ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ కోసం వన్ హెల్త్ కాన్సెప్ట్ ప్రాముఖ్యతను వాటాదారులు అంగీకరించారు.
ఎన్ ఆర్ సి-డబ్ల్యు అభివృద్ధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా భాగస్వాముల మధ్య సుసంపన్నమైన చర్చలు , సహకార వ్యూహాలతో వర్క్ షాప్ ముగిసింది. ఎన్ఆర్ సి-డబ్ల్యూ సమర్థవంతమైన స్థాపనకు కీలకమైన సృజనాత్మక ఫ్రేమ్వర్క్లు, సాంకేతిక జోక్యాలు, వనరుల సమీకరణపై వాటాదారులు చర్చించారు.
సమర్థవంతమైన వన్యప్రాణుల ఆరోగ్య నిర్వహణ కోసం మానవులు, పశువులు, వన్యప్రాణులను ఏకీకృతం చేసే సమగ్ర విధానంపై వర్క్ షాప్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎన్ ఆర్ సి-డబ్ల్యు అభివృద్ధి, వన్యప్రాణి రంగంలో వ్యాధి నిఘా అవసరాలు, మానవ, పశుసంవర్థక కార్యక్రమాలతో అనుసంధానం, వన్యప్రాణి రంగానికి పరిశోధన- అభివృద్ధి అవసరాలు ఇంకా సామర్థ్యాన్ని పెంపొందించే ఫ్రేమ్ వర్క్ ఆవశ్యకత వంటి వివిధ అంశాల పై భాగస్వామ్య సంస్థలకు చెందిన వివిధ నిపుణులతో సెషన్ లను నిర్వహించారు. భారతదేశ, ప్రపంచంl సమగ్ర , నియంత్రిత ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ కోసం ఒకే ఆరోగ్యం ప్రాముఖ్యతను,.భావనను భాగస్వాములందరూ అంగీకరించారు.
నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్ ఆర్ సి-డబ్ల్యు) అభివృద్ధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా భాగస్వాముల మధ్య ఆలోచనలు,సహకార వ్యూహాల సుసంపన్నమైన మార్పిడిపై వర్క్ షాప్ ముగింపు చర్చలు కేంద్రీకృతమయ్యాయి. వన్యప్రాణుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, వన్ హెల్త్ చొరవల పరిధి అంతటా నిపుణుల నుండి అంతర్దృష్టులను ఏకీకృతం చేస్తూ, విభిన్న కోణాల్లో సంభాషణలు విస్తరించాయి. భాగస్వాములు, వారి నిబద్ధతలో ఐక్యంగా, ఎన్ఆర్సి-డబ్ల్యు సమర్థవంతమైన స్థాపనకు కీలకమైన సృజనాత్మక ఫ్రేమ్వర్క్లు, సాంకేతిక జోక్యాలు ,వనరుల సమీకరణపై చర్చించారు. భారతదేశం, దానికి మించి వన్యప్రాణుల ఆరోగ్యం వన్ హెల్త్ సూత్రాలకు మార్గదర్శకంగా ఎన్ఆర్సి-డబ్ల్యు పాత్రను నిర్ధారించడానికి ఇంటర్ డిసిప్లినరీ సహకారం, విజ్ఞాన భాగస్వామ్యం, సమిష్టి నైపుణ్యాన్ని ఉపయోగించడం ఆవశ్యకతను ఇదినొక్కి చెప్పింది.
జీవవైవిధ్యం,ప్రజారోగ్య ప్రయోజనం కోసం ఈ క్లిష్టమైన చొరవను ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వాములను, వారి సంఘటిత ప్రయత్నాలను కొనసాగించడానికి ప్రేరేపించే భాగస్వామ్య దార్శనికతతో వర్క్ షాప్ ముగింపు ప్రతిధ్వనించింది.
ప్రతిపాదిత నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ కోసం చర్చించిన ప్రధాన అంశాలపై వర్క్ షాప్ అంతర్దృష్టులను అందించింది, వీటిలో..
- ఉద్భవిస్తున్న అంటు వ్యాధుల కోణంలోవ్యాధి/జాతుల ఆధారిత పరిశోధన
- నేషనల్ వైల్డ్ లైఫ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్
- అత్యవసర పరిస్థితుల్లో వన్యప్రాణుల వ్యాధుల నివారణ, నిర్వహణ
- నైపుణ్య ఆధారిత శిక్షణ,. వన్యప్రాణి నిపుణుల నిరంతర సామర్థ్య పెంపు
- కమాండ్ కంట్రోల్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ (అనలిటిక్స్)
- వన్యప్రాణి ఆరోగ్య విధానాన్ని రూపొందించడం
అంతేకాకుండా, ఈ వర్క్ షాప్ పశువుల వ్యాధుల నిఘా వ్యవస్థ. పై అవలోకనాన్ని కూడా అందించింది, ఇది ఆయా రంగాల మధ్య బలమైన సహకారం, సమాచార మార్పిడికి మార్గం సుగమం చేసింది.
***
(Release ID: 1990157)
Visitor Counter : 156