సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మహిళా సాధికారత, దివ్యాంగుల విజయాలకు అద్దం పట్టే విధంగా సాగిన నేషనల్ రీహాబిలిటేషన్ ఎగ్జామినేషన్ బోర్డు స్నాతకోత్సవం
Posted On:
22 DEC 2023 6:23PM by PIB Hyderabad
వికలాంగుల సాధికారత విభాగం కింద రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు అనుబంధంగా ఉన్న నేషనల్ రిహాబిలిటేషన్ ఎగ్జామినేషన్ బోర్డు స్నాతకోత్సవం న్యూ ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగింది.
సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీమతి ప్రతిమ భూమిక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికలాంగుల సాధికారత విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.స్నాతకోత్సవంలో ప్రసంగించిన మంత్రి అభివృద్ధి సాధనలో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని అన్నారు.పతకాలు పొందిన 18 మందిలో 17 మంది బాలికలు ఉండడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉండాలని,సాధికారత సాధించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆశలకు అనుగుణంగా నేషనల్ రీహాబిలిటేషన్ ఎగ్జామినేషన్ బోర్డు స్నాతకోత్సవం ఉందన్నారు.
ప్రతి రంగంలో మహిళలు రాణించి అభివృద్ధి సాధించాలన్న జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి లింగ సమానత్వం అవసరమని శ్రీమతి ప్రతిమా భౌమిక్ స్పష్టం చేశారు. సమ్మిళిత సాధికారత కలిగిన భారతదేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావడానికి సమిష్టి కృషి అవసరమన్నారు.
వికలాంగుల కుటుంబాల కోసం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI) ఒక ఉచిత కోర్సు ప్రారంభిస్తుందని శ్రీ రాజేష్ అగర్వాల్ తెలిపారు. వైకల్యాలున్న వ్యక్తులు, వారి కుటుంబాలకు జీవన సౌలభ్యం అందించడానికి కోర్సు ద్వారా కృషి జరుగుతుందన్నారు. వికలాంగ పిల్లల సమగ్ర అభివృద్ధిలో కుటుంబాలు, ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన అన్నారు. ఉన్నత విద్యలో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రధాన విశ్వవిద్యాలయాలు కలిసి కార్యక్రమాలు అమలు చేయాలనీ ఆయన సూచించారు.
స్నాతకోత్సవంలో విద్యార్థులందరికీ లైసెన్సులు, మార్కుషీట్‌లుపతకాలు ప్రదానం చేశారు. నంబర్‌లను అందించడానికి, అవార్డు గ్రహీతల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి నేషనల్ రీహాబిలిటేషన్ ఎగ్జామినేషన్ బోర్డ్ కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
***
(Release ID: 1990095)
Visitor Counter : 69