నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘కోస్టల్ షిప్పింగ్ పాలసీ’కి సంబంధించి ఎంఓపిఎస్‌డబ్ల్యూ కోసం జరిగిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ సర్బానంద సోనోవాల్


జాతీయ జలమార్గాలలో కార్గో హ్యాండ్లింగ్ 2013-14లో 6.83 ఎంఎంటీ ఉండగా 2022-23లో అది 1700% కంటే ఎక్కువ పెరిగి 126.15 మిలియన్ మెట్రిక్ టన్నులకు (ఎంఎంటీ) పెరిగింది: శ్రీ సర్బానంద సోనోవాల్, కేంద్ర ఎంఓపిఎస్‌డబ్ల్యూ మంత్రి

ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ 2047 నాటికి కోస్టల్ షిప్పింగ్ ద్వారా మొత్తం 1300 ఎంటిపిఏ కార్గో తరలింపు సామర్థ్యాన్ని ఊహిస్తోంది.

సాగరమాల కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ ప్రాజెక్ట్‌ల సంయుక్త ప్రాజెక్ట్ వ్యయం సుమారు. రూ.11,000 కోట్లు. వీటిలో కోస్టల్ బెర్త్‌లు, రోరో/రోపాక్స్ జెట్టీలు మరియు కోస్టల్ మరియు క్రూయిజ్ టూరిజం కోసం దాదాపు రూ. 3,450 కోట్లు.

Posted On: 22 DEC 2023 6:42PM by PIB Hyderabad

ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుల పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగింది.  కేంద్ర ఎంఓపిఎస్‌డబ్ల్యూ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్  'కోస్టల్ షిప్పింగ్ పాలసీ'పై జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ఎంఓపిఎస్‌డబ్ల్యూ సహాయమంత్రి శ్రీ శ్రీపాద్ Y నాయక్‌తో పాటు లోక్‌సభ సభ్యులు శ్రీ అరవింద్ గణపత్ సావంత్, శ్రీ హిబీ ఈడెన్, శ్రీ లాలూభాయ్ బాబుభాయ్ పటేల్ రాజ్యసభ సభ్యులు శ్రీ జికె వాసన్ హాజరయ్యారు.

 

image.png


సమావేశంలో కేంద్రమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ "జాతీయ జలమార్గాలలో కార్గో హ్యాండ్లింగ్ 2013-14లో 6.83  ఎంఎంటీ ఉండగా 2022-23లో అది 1700% కంటే ఎక్కువ పెరిగి 126.15 మిలియన్ మెట్రిక్ టన్నులకు (ఎంఎంటీ) పెరిగింది. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ 2047 నాటికి కోస్టల్ షిప్పింగ్ ద్వారా మొత్తం 1300 ఎంటిపిఏ కార్గో తరలింపు సామర్థ్యాన్ని గుర్తించింది" అని తెలిపారు.

 

image.png


కోస్టల్ షిప్పింగ్‌ను ప్రోత్సహించడం కోసం ' ఎంఓపిఎస్‌డబ్ల్యూ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్, ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ కింద ఎఫిషియెంట్ లాజిస్టిక్స్ (ఎస్‌పిఈఎల్) కోసం సెక్టోరల్ ప్లాన్‌లు మొదలైనవాటిని ప్రవేశపెట్టిందని ఆయన వెల్లడించారు.

‘ కోస్టల్ కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు తీరం వెంబడి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడం కోసం ప్రభుత్వం సాగరమాల కార్యక్రమం కింద వివిధ ప్రాజెక్టులను చేపట్టింది. అందులో భాగంగా ఐదు డెడికేటెడ్ కోస్టల్ బెర్త్‌లు అభివృద్ధి చేయబడ్డాయి, దీని నిర్వహణ సామర్థ్యం 6.34 ఎంటిపిఏ. అంతే  కాకుండా రోరో/రోపాక్స్‌ జెట్టీలు, ప్యాసింజర్ జెట్టీలు మొదలైన 10 ప్రాజెక్ట్‌లు రూ. 527 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి’ అని శ్రీ సోనోవాల్ అన్నారు.

అమృత్ కాల్ విజన్ కింద నిర్దేశించబడిన లక్ష్యాలు 2047 నాటికి కోస్టల్ షిప్పింగ్ ద్వారా మొత్తం 1300 ఎంటిపిఏ కార్గో తరలింపు సామర్థ్యాన్ని గుర్తించాయి.

కోష్టల్‌ షిప్పింగ్: కార్గో రవాణా

➢ 2014-15 సంవత్సరంలో భారత ఓడరేవులు సంవత్సరానికి 74.97 మిలియన్ టన్నుల (ఎంటిపిఏ) తీరప్రాంత కార్గోను నిర్వహించాయి - 2022-23లో అది 151 ఎంటిపిఏకి (104% పెరిగింది) పెరిగింది.
➢ జాతీయ జలమార్గాలు 2022-23లో 126.15 ఎంఎంటీ  కార్గోను నిర్వహించగా, 2013-14లో 6.83 ఎంఎంటికి (1700% పెరిగింది) చేరింది.
➢ కమోడిటీ వైజ్ షేర్- పిఓఎల్ ఉత్పత్తులు (32.3%), థర్మల్ బొగ్గు (30.6%), ఐరన్ ఓర్ (11%), ఇనుప గుళికలు (7.6%), సిమెంట్/క్లింకర్ (1.5%) మరియు ఇతరవస్తువులు (17.1%).

తీరప్రాంత నౌకలను సులభతరం చేయడానికి ఎంఓపిఎస్‌డబ్ల్యూ ప్రాధాన్యతా బెర్తింగ్ విధానాన్ని మరియు ఓడరేవుల వద్ద తీరప్రాంత కార్గోను వేగంగా తరలించడానికి గ్రీన్ ఛానల్ క్లియరెన్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. తీరప్రాంత కార్గో నౌకలకు ఓడ మరియు కార్గో సంబంధిత ఛార్జీలపై ప్రధాన నౌకాశ్రయాలు 40% తగ్గింపును అందిస్తాయి. అవకాశాన్ని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం భారతీయ ఫ్లాగ్ వెస్సెల్స్‌లో ఉపయోగించే బంకర్ ఇంధనాలపై జీఎస్టీని 18% నుండి 5%కి తగ్గించింది.

సముదాయ కేంద్రాల అభివృద్ధి, సిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రత్యేక గిడ్డంగుల సౌకర్యాలు మరియు ఎండ్-టు-ఎండ్ లాజిస్టిక్స్ సరఫరా గొలుసును మెరుగుపరచడం కూడా తీరప్రాంత సిప్పింగ్‌ను మరింత ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలు.

జాతీయ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్‌ఎల్‌పి) కింద కోస్టల్ షిప్పింగ్ మరియు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ వంటి స్థిరమైన రవాణా మార్గాలను ప్రోత్సహించడం కోసం లైన్ మంత్రిత్వ శాఖలు (ఆహారం, ఎరువులు, ఉక్కు, బొగ్గు, సిమెంట్, పి&ఎన్‌జి మొదలైనవి) సమర్ధవంతమైన లాజిస్టిక్స్ (ఎస్‌పిఈఎల్) కోసం సెక్టోరల్ ప్లాన్‌లను సిద్ధం చేస్తున్నాయి. కోస్టల్ షిప్పింగ్ ద్వారా బొగ్గు మరియు ఎరువులు వంటి కనీస కార్గో-పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లను (పిఎస్‌యు) కూడా కేటాయించడం కూడా లాంఛనప్రాయమైంది.

***


(Release ID: 1989823) Visitor Counter : 102


Read this release in: English , Urdu , Hindi