సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పౌర కేంద్రీకృత పాలన నిర్ణయాత్మక ప్రక్రియలో పౌరుల పాత్రను పెంచే విధంగా పరిణామం చెందుతుందని తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
2014లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పారదర్శకత, జవాబుదారీతనం మరియు పౌర-కేంద్రీకృత పాలనా నమూనా ముఖ్య లక్షణం: డాక్టర్ జితేంద్ర సింగ్
“పౌరులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవలను అందించడానికి ప్రభుత్వం సాంకేతికతను గరిష్టంగా ఉపయోగిస్తోంది. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌లు దాని కోసం సిద్ధంగా ఉండటానికి మాకు సహాయపడతాయి ”: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
22 DEC 2023 5:18PM by PIB Hyderabad
సిటిజన్-సెంట్రిక్ గవర్నెన్స్ అనేది నిర్ణయాత్మక ప్రక్రియలో పౌరుల పాత్రను పెంచుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు చెప్పారు.
2014లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పారదర్శకత, జవాబుదారీతనం మరియు పౌర-కేంద్రీకృత పాలనా నమూనా ముఖ్య లక్షణం అని ఆయన వివరించారు.
"పాత పాలన యుగం ఎప్పుడో ముగిసింది. పౌరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలను అందించడానికి ప్రభుత్వం సాంకేతికతను గరిష్టంగా ఉపయోగిస్తోంది. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌లు అందుకు సిద్ధంగా ఉండేందుకు వీలు కల్పిస్తాయి' అని ఆయన అన్నారు.
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); పీఎంవో, సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపిఏ) నిర్వహించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేషనల్ కన్వెన్షన్ III (స్మారక ఉపన్యాసాల సిరీస్)లో జీ20 పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ'పై ప్రసంగించారు.
జనవరిలో వ్యాక్సిన్ విజయగాథతో భారతదేశం ఈ ఏడాదిని ప్రారంభించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఏడాది ఇంకా ఒకవారం మాత్రమే మిగిలి ఉందని..ప్రధానమంత్రి మోదీ చేపట్టిన పౌర-కేంద్రీకృత పాలన నమూనాను ఈ ఏడాది చూసిందని చెప్పారు.
"చంద్రునిపై ఇంకా ఎవరూ అడుగుపెట్టని సౌత్ పోలార్ ప్రాంతంలో చంద్రయాన్-3ను ల్యాండింగ్ చేసి అంతరిక్ష శక్తిగా భారతదేశ ప్రతిష్ట బాగా స్థిరపడింది" అని కేంద్రమంత్రి తెలిపారు.
దేశాల సఖ్యతలో భారతదేశం అగ్రగామి దేశాలలో ఆవిర్భవించినందున ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉందని పేర్కొన్న డాక్టర్ జితేంద్ర సింగ్..ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యున్నత నాయకుడిగా ఎదిగారని ఆ విషయాన్ని అనేక అభిప్రాయ సేకరణలు పునరుద్ఘాటించాయని అన్నారు.
"ఈ సంవత్సరంలో అత్యంత ప్రాతిష్టాత్మకమైన జీ20 సమ్మిట్ మరియు అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం, అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ప్రధాన ఎజెండాను ఏర్పాటు చేయడం సంతోషదాయకంగా ఉంది" అని ఆయన అన్నారు.
ఇంతకుముందు ప్రపంచం భారతదేశాన్ని సీరియస్‌గా తీసుకోలేదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అయితే ఇప్పుడు ప్రపంచం జీ20లో ప్రధాని మోదీ మరియు భారతదేశం నిర్ణయించిన ఎజెండా వైపు మొగ్గు చూపిందని వివరించారు.
“సంవత్సరంలో భారతదేశంలోని 65 నగరాల్లో జీ20కి సంబంధించిన 200 సమావేశాలు జరిగాయి. వాతావరణ మార్పులపై నాయకత్వ పాత్రను స్వీకరించిన ప్రధాని మోదీ మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి)పై ఉద్ఘాటించారు. 2070 నాటికి నికర జీరో లక్ష్యానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నందున, భారతదేశం తన అస్థిరమైన ఉద్గార లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉంది. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల నుంచి అవినీతి నిరోధకం వరకు ఏడాది పొడవునా భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశాలు చాలా విజయవంతమయ్యాయి.
ఐఐపీఏ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, క్వాంటం టెక్నాలజీని ఉపయోగిస్తున్న ప్రపంచంలోని 5 లేదా 6 దేశాలలో భారతదేశం నేడు అగ్రగామిగా ఉందన్నారు.
"మన సిపిజిఆర్‌ఏఎంఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్,డిబిటి మరియు స్వమిత్ర ప్రోగ్రామ్‌లు సాంకేతికతతో నడిచే ప్రజల కేంద్రీకృత సంస్కరణలుగా ప్రపంచవ్యాప్తంగా ఉదహరించబడ్డాయి" అని ఆయన అన్నారు, "ఈ రోజు ప్రపంచం భారతదేశం నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంది." అని చెప్పారు.
ఈ సందర్భంగా నమామి గంగే కార్యక్రమంపై వాల్ క్యాలెండర్, డెస్క్ క్యాలెండర్‌ను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారు.
***
(Release ID: 1989821)
Visitor Counter : 102