గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
డి ఎ వై - ఎన్ ఆర్ ఎల్ ఎం స్వయం సహాయ బృందాల కోసం రిలయన్స్ రిటైల్ కు చెందిన జియోమార్ట్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈ భాగస్వామ్యం స్వయం సహాయక సంఘాలు తమ మార్కెట్ ను , పదిమందికీ ప్రతిభను చాటుకోవడానికి దోహదం చేస్తుంది: ఇంకా భారతదేశం అంతటా జియోమార్ట్ వినియోగదారులకు వారి తయారీ ఉత్పత్తులను అందిస్తాయి: శ్రీ చరణ్ జిత్ సింగ్
సుస్థిర ప్రాతిపదికన స్వయం సహాయక సంఘాల ఆదాయాన్ని పెంచడానికి ఈ మిషన్ పనిచేస్తోంది: ఈ చర్య ఆ దిశగా మన చొరవలకు తోడ్పడుతుంది: శ్రీ సింగ్
Posted On:
22 DEC 2023 1:15PM by PIB Hyderabad
దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ (డి ఎ వై-ఎన్ఆర్ఎల్ఎం) స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జి) ఉత్పత్తులను విస్తరించడంలో సహాయపడటానికి, గ్రామీణ ఎస్ హెచ్ జి చేతి వృత్తుల వారికి సాధికారత కల్పించడానికి రిలయన్స్ రిటైల్ కు చెందిన జియోమార్ట్ తో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్ డి ) అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కు చెందిన గ్రామీణ జీవనోపాధి మిషన్ అదనపు కార్యదర్శి శ్రీ చరణ్ జిత్ సింగ్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ఎస్‌హెచ్‌జిలను జియోమార్ట్‌లో ఇ-కామర్స్ ఫోల్డ్‌లో విక్రయదారులుగా చేర్చేందుకు వీలు కల్పిస్తుందని, ఈ చొరవ వల్ల ఎంఓఆర్ డి సదుపాయం మరింత పెరుగుతుందని అన్నారు. సరస్ సేకరణ పెద్ద ఎత్తున వినియోగదారులకు అందుబాటులో ఉంటుం దని చెప్పారు. ఈ భాగస్వామ్యంతో, స్వయం సహాయక బృందాల ఉత్పత్తులకు మార్కెట్ ను విజిబిలిటీని విస్తృతం చేస్తాయని, భారతదేశం అంతటా జియోమార్ట్ వినియోగదారులకు వారి ఉత్పత్తులను అందిస్తాయని తెలిపారు. ఎం ఒ ఆర్ డి - జియోమార్ట్ మధ్య భాగస్వామ్యంలో భాగంగా, ఒకసారి చేరిక తరువాత, డి ఎ వై-ఎన్ఆర్ఎల్ఎం తో సంబంధం ఉన్న స్వయం సహాయక సంఘాల అమ్మకందారులందరూ ఆన్ లైన్ లో తమ వ్యాపారాలను పెంచుకోవడంలో ప్రయోజనాలు, మార్గదర్శకత్వాన్ని పొందుతారు.
డి ఎ వై-ఎన్ఆర్ఎల్ఎం , జియోమార్ట్ మధ్య ఈ భాగస్వామ్యం స్వయం సహాయక సంఘాల మహిళ (దీదీ) ల ఆదాయాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలకు తోడ్పడుతుందని శ్రీ సింగ్ అన్నారు. సుస్థిర ప్రాతిపదికన స్వయం సహాయక సంఘాల ఆదాయాన్ని పెంచడానికి ఈ మిషన్ కృషి చేస్తోందని, ఈ చర్య ఆ దిశగా తమ చొరవలకు తోడ్పడుతుందని చెప్పారు.
స్వయం సహాయక సంఘాల జీవనోపాధి అవకాశాలను పెంచడానికి మద్దతు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని, జియోమార్ట్ తో భాగస్వామ్యం ఈ దిశలో సహాయపడుతుందని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి స్వాతి శర్మ అన్నారు.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కు చెందిన గ్రామీణ జీవనోపాధి సంచాలకులు శ్రీ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ ఈ అవగాహన ఒప్పందం ముఖ్య లక్ష్యాల గురించి ఒక అవలోకనాన్ని ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల బలాన్ని నేడు దేశం గుర్తించిందని, అటువంటి భాగస్వామ్యం సరస్ వంటి వివిధ మార్కెటింగ్ చొరవలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ పబ్లిక్ పాలసీ అండ్ రెగ్యులేటరీ ప్రెసిడెంట్, చీఫ్ డాక్టర్ రవిప్రకాష్ గాంధీ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఫలవంతమైన సంఘాలకు ఎం ఒ ఆర్ డి భాగస్వామ్యం మొదటి అడుగు అని, ప్రభుత్వ 'మేకిన్ ఇండియా' చొరవను తాము బలంగా విశ్వసిస్తున్నామని, స్వీకరిస్తున్నా మని, ఇంకా ఈ భాగస్వామ్యం తమ నిబద్ధతను మరింత బలోపేతం చేయడానికి దోహద పడుతుందని అన్నారు. “దేశంలో డిజిటల్ రిటైల్ ఎకోసిస్టమ్ ను మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము ఈ భాగస్వామ్యం ద్వారా వృద్ధిని సాధికారం చేయాలనుకుంటున్నాము. మిలియన్ల స్వయం సహాయక సంఘాల డిజిటలైజేషన్ ను కూడా సులభతరం చేయాలనుకుంటున్నాము. ఈ చొరవ జీవితాలను మార్చడంలో, భారతదేశంలోని స్థానిక చేతివృత్తులు , చిన్న వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అన్నారు.
మార్కెట్లో తమ ఖాతాను నావిగేట్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి జియోమార్ట్ వారికి సహాయపడుతుందని, ఇంకా విక్రేతలు పోర్టల్ లో అమ్మకాల అనుభవాన్ని పరిచయం చేసుకోవడానికి వీలుగా ఎం ఒ ఆర్ డి ద్వారా నిర్వహించే శిక్షణలు , వర్క్ షాప్ లలో జియోమార్ట్ సంయుక్తంగా పాల్గొంటుందని తెలిపారు. స్థిరమైన వృద్ధి , వ్యాపార స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, మార్కెట్లో అమ్మకందారులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడంలో సహాయపడటానికి జియోమార్ట్ ప్రారంభ అనంతర శిక్షణ, మద్దతును అందిస్తుంది. ప్లాట్ఫామ్ పై వివిధ రకాల మార్కెటింగ్ ప్రమోషన్లలో కూడా పాల్గొంటుంది.
ఈ భాగస్వామ్యం సాంప్రదాయ వస్త్రాల నుండి ప్యాంట్రీ, గృహ అలంకరణ, సౌందర్య ఉత్పత్తుల వరకు చేనేత , హస్తకళల ఉత్పత్తుల శ్రేణిని అందించే ఎం ఒ ఆర్ డి సారాస్ కలెక్షన్ బ్రాండ్ కింద స్వయం సహాయక బృందాలను జియోమార్ట్ లోకి తీసుకువస్తుంది.
నేపథ్యం
దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి ఎ వై - ఎన్ ఆర్ ఎల్ ఎం) గురించి:
డి ఎ వై - ఎన్ ఆర్ ఎల్ ఎం అనేది భారత ప్రభుత్వ ఒక ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఇది గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం. ఈ మిషన్ నాలుగు ప్రధాన భాగాలలో- (ఎ) గ్రామీణ పేదల స్వయం నిర్వహణ, ఆర్థికంగా సుస్థిరమైన కమ్యూనిటీ సంస్థల సామాజిక సమీకరణ, ప్రోత్సహించడం బలోపేతం చేయడం; బి) గ్రామీణ పేదల ఆర్థిక సమ్మిళితం; (సి) సుస్థిర జీవనోపాధి; (డి) సామాజిక సమ్మిళితం, సామాజిక అభివృద్ధి , సమ్మేళనం - లో పెట్టుబడి పెట్టడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్ విఎల్) గురించి:
ఆర్ ఆర్ వి ఎల్, దాని అనుబంధ సంస్థల ద్వారా, కిరాణా, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, ఫార్మా వినియోగ ఉత్పత్తులలో 18,040 స్టోర్లు , డిజిటల్ కామర్స్ ప్లాట్ ఫాం ల ఇంటిగ్రేటెడ్ ఓమ్ని-ఛానల్ నెట్వర్క్ ను నిర్వహిస్తుంది. న్యూ కామర్స్ చొరవ ద్వారామూడు మిలియన్లకు పైగా వ్యాపారులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
దాని అనుబంధ సంస్థ ఎఫ్ఎంసిజి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, మిలియన్ల మంది భారతీయుల రోజువారీ అవసరాలను తీర్చే బహుముఖ బ్రాండ్ పోర్ట్ పోలియో కింద విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్ ఆర్ వి ఎల్ రూ.260,364 కోట్ల కన్సాలిడేటెడ్ టర్నోవర్ (31.7 బిలియన్ డాలర్లు) ను , రూ.9,181 కోట్లు (1.1 బిలియన్ డాలర్లు) నికర లాభాన్ని నమోదు చేసింది.
జియోమార్ట్ గురించి
జియోమార్ట్ అనేది రిలయన్స్ రిటైల్ ఇ-టెయిల్ విభాగం. ఇది 2020 లో ప్రారంభమైంది. జియోమార్ట్ వ్యవస్థాపకులను శక్తివంతం చేయడానికి, భారతదేశంలోని ఎస్ఎంబి కమ్యూనిటీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది దాని సౌకర్యవంతమైన సేవలు, వైవిధ్యమైన ఉత్పత్తుల ఎంపిక, ఉపయోగించడానికి సులభమైన ఇంటర్ఫేస్, శీఘ్ర డెలివరీ , సాటిలేని ఒప్పందాలతో అమ్మకందారులు- కొనుగోలుదారుల మధ్య అద్భుతమైన అనుభవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. 20+ కేటగిరీల్లో రెండు మిలియన్+ ఉత్పత్తులు, బలమైన సప్లయర్ బేస్ తో స్వదేశీ ఇ-మార్కెట్ ప్లేస్ భారతదేశంలో డిజిటల్ కామర్స్ విభాగాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది.
****
(Release ID: 1989768)
Visitor Counter : 129