పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బయో-డీజిల్ వినియోగం

Posted On: 21 DEC 2023 5:20PM by PIB Hyderabad

దేశంలో బయో డీజిల్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలోను, వర్తమాన సంవత్సరంలోను తీసుకున్న చర్యలు ఇలా ఉన్నాయి.  

·       ప్రభుత్వం 2019 ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేసిన గెజిట్  నోటిఫికేషన్ ద్వారా ‘‘రవాణా రంగ అవసరాలకు వీలుగా హైస్పీడ్  డీజిల్  లో మిశ్రమం చేయడానికి బయో-డీజిల్ విక్రయ మార్గదర్శకాలు-2019’’  నోటిఫై చేసింది. ఆ తర్వాత జారీ చేసిన సవరణ ఉత్తర్వు, 2019 కింద అన్ని శ్రేణులకు చెందిన వినియోగదారులకు విక్రయించే హై స్పీడ్ డీజిల్ లో బ్యూరో ఆఫ్ ఇండియన్  స్టాండర్డ్స్ నిర్దేశిత ప్రమాణాలకు లోబడి మిశ్రమం చేయడానికి బయో-డీజిల్  ప్రత్యక్ష విక్రయానికి అనుమతించింది.

·       ప్రభుత్వం జాతీయ బయో ఇంధనాల విధానం-2018ని 2022 జూన్  లో సవరించింది. ఈ సవరణ ప్రకారం 2030 నాటికి డీజిల్  లో మిశ్రమం చేయాల్సిన బయోడీజిల్  ప్రమాణాన్ని 5%గా ప్రకటించింది. దానితో పాటు అదే సమయానికి బయోడీజిల్  ప్రత్యక్ష అమ్మకానికి కూడా అనుమతించింది.

·       డీజిల్  లో మిశ్రమం చేసేందుకు ఒఎంసిలకు విక్రయించే బయో డీజిల్పై జిఎస్  టి రేటును 2021 అక్టోబరు నుంచి 12% శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

·       బయో-డీజిల్  సేకరణకు ప్రభుత్వ రంగ ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) గిట్టుబాటు ధరలు అందిస్తాయి.

·       బయో ఇంధనాలను ప్రోత్సహించడానికి ప్రతీ సంవత్సరం ఆగస్టు 10వ తేదీని ప్రపంచ బయో ఇంధన దినోత్సవంగా పాటించాలి.

భారత పెట్రోలియం, సహజ వాయుశాఖ సహాయమంత్రి శ్రీ రామేశ్వర్  తెలి లోక్  సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో  ఈ వివరాలు అందించారు. 


(Release ID: 1989567) Visitor Counter : 87


Read this release in: English , Urdu , Hindi