పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెట్రోలియం మరియు సహజ వాయువు ఉత్పత్తి అమరిక

Posted On: 21 DEC 2023 5:22PM by PIB Hyderabad

పెట్రోలియం, సహజ వాయువుల దేశీయ అన్వేషణ మరియు ఉత్పత్తిని పెంచడానికి మరియు ఆత్మనిర్భర్ భారత్‌కు అనుగుణంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ విధానపరమైన  కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో, హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ మరియు లైసెన్సింగ్ పాలసీ (హెల్ప్), డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ (డీఎస్ఎఫ్) పాలసీ, ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్పీ), ఎన్‌హాన్స్‌డ్ ఆయిల్ రికవరీలను ప్రోత్సహించే మరియు ప్రోత్సహించే విధానం (ఈఓఆర్), అన్వేషణ కోసం పాలసీ ఫ్రేమ్‌వర్క్ వంటి సంస్కరణలు ఉన్నాయి. బొగ్గు గనుల లీజు కింద ఉన్న ప్రాంతాల నుండి కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) అన్వేషణ మరియు సీబీఎం మైనింగ్ లీజు ముందస్తుగా వాటిని నగదీకరణ చేయడం మొదలైనవి ఇందులో భాగంగా ఉన్నాయి. అన్వేషణలో ఉన్న నికర భౌగోళిక ప్రాంతాన్ని 2.5 లక్షల చదరపు కిలోమీటర్ల (ఎస్.కె.ఎం) నుండి 5 లక్షల ఎస్.కె.ఎం.కి పెంచడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇంకా, ప్రభుత్వం హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ మరియు డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేకమైన ఎకనామిక్ జోన్ (ఈఈజెడ్) 'నో-గో' ప్రాంతంలో 99% తెరిచింది. మొత్తం 2,07,691 చ. కి.మీ. ఒ.ఎ.ఎల్.పి కింద (బిడ్ రౌండ్ VII వరకు) మరియు 16,508 చదరపు  కి.మీ. డీఎస్ఎఫ్ కింద (బిడ్ రౌండ్ III వరకు) ఇప్పటివరకు కేటాయించబడింది. ఇంకా, ఇంధన సామర్థ్యాన్ని మరియు పరిరక్షణ చర్యలను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అవలంబించింది. దిగుమతి చేసుకున్న ముడి చమురు నిలువలపై దేశం యొక్క చమురు ఆధారపడటాన్ని తగ్గించడానికి.. డిమాండ్ ప్రత్యామ్నాయం, జీవ ఇంధనాలు / ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ఈవీ ఛార్జింగ్ సౌకర్యాలు మరియు రిఫైనరీ ప్రక్రియ మెరుగుదలలను ప్రోత్సహించడంపై కూడా ఇది దృష్టి సారించింది. పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(Release ID: 1989444) Visitor Counter : 89


Read this release in: English , Urdu , Hindi