జల శక్తి మంత్రిత్వ శాఖ
వివిధ ఘన వ్యర్ధాల నిర్వహణ ఆస్తుల సృష్టితో ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా మారిన 5 లక్షలకు పైగా గ్రామాలు
Posted On:
21 DEC 2023 3:00PM by PIB Hyderabad
ఓడిఎఫ్‌ను స్థిరంగా ఉంచడంపై దృష్టిపెట్టి ప్రతి గ్రామాన్నీ 2024-25 నాటికి ఓడిఎఫ్ నుంచి ఓడిఫ్ ప్లస్ గా పరివర్తన చేసేందుకు అన్ని గ్రామాలలోనూ ఘన, ద్రవ వ్యర్ధ నిర్వహణ (ఎస్ఎల్ డబ్ల్యుఎం) ఏర్పాటు చేసేందుకు, ఎస్‌బిఎం(జి) ఫేజ్-2ను 2020-21 నుంచి అమలు చేస్తున్నారు. ఎస్‌బిఎం(జి) ఫేజ్-2 కింద దిగువన పేర్కొన్న కమ్యూనిటీ స్థాయి ఎస్ఎల్ డబ్ల్యుఎం కార్యకలాపాలకు నిధులు అందిస్తున్నారు -
బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా లేదా పచ్చి ఎరువు (కంపోస్టింగ్) ద్వారా బయోడిగ్రేడబుల్ వ్యర్ధాల నిర్వహణ.
బయోడిగ్రేడబుల్ కాని (ప్లాస్టిక్) వంటి వాటిని వేరు చేసి/ నిల్వ చేసే కేంద్ర నిర్మాణం.
బ్లాక్/ జిల్లా స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ యూనిట్ల ఏర్పాటు.
శౌచాలయాలు, అంట్లు తోమడం, దుస్తుల ఉతకడం వంటి వాటి ద్వారా వచ్చే అపరిశుభ్ర నీటిని ఇంకుడు గుంటలు/ నీటిని నిదానంగా పీల్చేందుకు అనువుగా మూతతో నిర్మించే లీచ్ పిట్స్/ మ్యాజిక్ పిట్స్‌ను ఎక్కడ సాధ్యమైతే అక్కడ లేదా వ్యర్ధ స్థిరీకరణ చెరువులు, ఇతర అపరిశుభ్ర నీటి నిర్వహణ సాంకేతికతలు, నిర్మించిన చిత్తడి నేలలు, ఎక్కడ అవసరం అయితే అక్కడ & సాధ్యమైన చోట అపరిశుభ్ర నీటి నిర్వహణ.
సమీప పట్టణ/ గ్రామీణ ప్రాంతాలలో మల అడుసు శుద్ధి కేంద్ర (ఎఫ్ఎస్‌టిపి) / మల శుద్ధి కేంద్రాలు (ఎస్‌టిపి)లలో శుద్ధితో లేదా కందకాలు/ లేదా ఎఫ్ఎస్‌టిపి ఏర్పాటుద్వారా అవసరమైన చోట మల అడుసు నిర్వహణ సౌకర్యాల (ఎఫ్ఎస్ఎం) ఏర్పాటు.
దేశంలో బహిరంగ మల విసర్జన రహిత (ఒడిఎఫ్) ప్లస్ గ్రామాల సంఖ్య రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అనెక్చర్-1లో జతచేయడం జరిగింది.ఎస్‌బిఎం (జి) ఫేజ్-2 కింద సృష్టించిన వివిధ ఎస్ఎల్‌డబ్ల్యుఎం ఆస్తుల వివరాలను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అనెక్చర్-2లో జత చేయడం జరిగింది.
ఎస్‌బిఎం (జి) కింద రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అన్ని ఉపకరణాల కోసం ఏకీకృత పద్ధతిలో నిధులు విడుదల చేస్తారు. ఎస్‌బిఎం (జి) ఫేజ్-2 కింద నిధుల కేటాయింపు, విడుదలకు సంబంధించి రాష్ట్రాలు/ యుటిల వారీగా వివరాలు అనెక్చర్-3లో ఇవ్వడం జరిగింది.
ఈ సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభకు గురువారం ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో వెల్లడించారు.
***
(Release ID: 1989443)