పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో గ్రామీణ పర్యాటకానికి ప్రోత్సాహం

నాడు పోస్టు చేయడమైనది: 21 DEC 2023 3:07PM by PIB Hyderabad

గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ క్రింది ప్రయత్నాలను చేపట్టింది:-

 

i. ఆత్మనిర్భర్ భారత్ వైపుగా భారతదేశంలో గ్రామీణ పర్యాటక అభివృద్ధి కోసం జాతీయ వ్యూహం మరియు మార్గనిర్దేశనం ను రూపొందించారు.

 

ii. రూరల్ టూరిజం విలేజ్ పోర్టల్ 16 ఫిబ్రవరి 2023న ప్రారంభించబడింది. వెబ్‌సైట్‌లో భారతదేశంలోని గ్రామీణ పర్యాటక గమ్యస్థానాలు, భారతదేశంలోని గ్రామీణ గృహ వసతి, గ్రామీణ పర్యాటకం కోసం ప్రభుత్వం మరియు పరిశ్రమల కార్యక్రమాలు మొదలైన వాటి గురించి సమాచారం ఉంది.

 

iii. సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఫర్ రూరల్ టూరిజం ( ఐ ఐ టీ టీ ఎం) భాగస్వామ్యంతో పర్యాటక మంత్రిత్వ శాఖ ఉత్తమ పర్యాటక గ్రామం పోటీని నిర్వహించింది. ఈ పోటీ లో భారతదేశంలోని 35 ఉత్తమ పర్యాటక గ్రామాలు ఎంపికయ్యాయి.

 

iv. స్వదేశ్ దర్శన్ పథకం కింద పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం గ్రామీణ సర్క్యూట్‌ను నేపథ్య సర్క్యూట్‌లలో ఒకటిగా గుర్తించారు.

 

సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఫర్ రూరల్ టూరిజం ( ఐ ఐ టీ టీ ఎం) భాగస్వామ్యంతో పర్యాటక మంత్రిత్వ శాఖ ఉత్తమ గ్రామీణ పర్యాటకం పోటీ 2024 మరియు ఉత్తమ గ్రామీణ గృహ వసతి పోటీ 2024ని ప్రారంభించింది.

 

పోటీ అంశాలు:

 

i. గ్రామీణ పర్యాటకం మరియు గ్రామీణ గృహ వసతి అభివృద్ధి, ప్రగతి మరియు వృద్ధిని ప్రోత్సహించడానికి.

 

ii. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు.

 

iii. గ్రామీణ పర్యాటక గ్రామాలు మరియు గ్రామీణ గృహ వసతిల సామర్థ్యాన్ని పెంచడం.

 

iv. గ్రామీణ పర్యాటక గ్రామాలు మరియు గ్రామీణ గృహ వసతిల గుర్తింపు.

 

గ్రామీణ పర్యాటక గ్రామాలు మరియు గ్రామీణ గృహ వసతిల నిర్వహణ లో బాధ్యతాయుతమైన మరియు సుస్థిరమైన పద్ధతులకు సంబంధించి ఉత్తమ అభ్యాసాలను గుర్తించడం మరియు ఇతర గ్రామాలు మరియు గ్రామీణ గృహ వసతిలలో వాటి నమూనాలను రూపొందించడం పై ఈ పోటీ దృష్టి పెడుతుంది. ఈ పోటీ గ్రామాలు మరియు గృహ వసతిలకు జాతీయ స్థాయి వేదికను అందించడంలో జాతీయ స్థాయిలో వారిని ప్రోత్సాహించడం లో సహాయపడుతుంది.

 

ఈ పోటీ గ్రామ స్థాయిలో బహుళస్థాయి పాలనను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక పరిపాలనల మధ్య సమన్వయాన్ని కూడా తెస్తుంది.

 

ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, సహాయ మంత్రి శ్రీ జి. కిషన్‌రెడ్డి ఈరోజు రాజ్యసభలో తెలిపారు.

 

*****


(రిలీజ్ ఐడి: 1989276) సందర్శకుల సూచీ సంఖ్య : : 97
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी