అణుశక్తి విభాగం
దేశంలో 2031-32 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 7480 మెగావాట్ల నుంచి 22480 మెగావాట్లకు పెంచేందుకు చర్యలు... కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
2023లో భారత అంతరిక్ష స్టార్టప్‌లలో పెట్టుబడి $124.7 మిలియన్లకు పెరిగింది: డాక్టర్ జితేంద్ర సింగ్
అంతరిక్ష రంగంలో ఎఫ్‌డిఐని ప్రోత్సహించేందుకు డిపిఐఐటితో సంప్రదించి అంతరిక్ష రంగంలో అమలు చేయాల్సిన ఎఫ్‌డిఐ పాలసీ మార్గదర్శకాలను సమీక్షిస్తున్న అంతరిక్ష మంత్రిత్వ శాఖ: డాక్టర్ జితేంద్ర సింగ్
2033 నాటికి భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ సుమారు 8.4 బిలియన్ డాలర్ల నుంచి 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
20 DEC 2023 7:23PM by PIB Hyderabad
దేశంలో 2031-32 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 7480 మెగావాట్ల నుంచి 22480 మెగావాట్లకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు అమలు చేస్తున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి ( స్వతంత్ర బాధ్యత), పీఎంఓ సహాయ మంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశక్తి, అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తెలిపారు. తన మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ ప్రశ్నలకు వేర్వేరుగా లిఖితపూర్వకంగా లోక్‌సభలో ఈరోజు డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. . దేశంలో అణు విద్యుత్ ప్లాంట్ల 2013-14 లో 35334 మిలియన్ యూనిట్లు ( పూర్తి సామర్థ్యం )వార్షిక విద్యుత్ ఉత్పత్తి 2022-23 నాటికి 46982 మిలియన్ యూనిట్లకు ( పూర్తి సామర్థ్యం ) పెరిగిందని మంత్రి వివరించారు. 2013-14 లో 4780 మెగావాట్ల గా ఉన్న స్థాపిత అణు విద్యుత్ సామర్థ్యం 2022-23 నాటికి 7480 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు.
ప్రస్తుత సంవత్సరం 2023-24 లో (నవంబర్ 2023 వరకు) అణు విద్యుత్ ప్లాంట్ల నుంచి 32017 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. ఈ ఏడాది సంవత్సరానికి 52340 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం 23 అణువిద్యుత్ రియాక్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత పదేళ్లలో (2013-14 నుంచి 2022-23 వరకు) అణు విద్యుత్ ప్లాంట్ల నుంచి 411 బియూ ల విద్యుత్ ఉత్పత్తి అయ్యిందన్నారు. దీనివల్ల 352 మిలియన్ టన్నుల వరకు CO2 విడుదల తగ్గిందని మంత్రి వివరించారు.
8000 మెగావాట్ల సామర్థ్యంతో గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పది రియాక్టర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వీటితో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన పది రియాక్టర్లకు సంబంధించిన ప్రీ-ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. 2031-32 నాటికి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అమెరికా సహకారంతో 6 x 1208 మెగావాట్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని తెలిపారు.
దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి గత 10 సంవత్సరాల కాలంలో గణనీయంగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. టిఏపిఎస్ 1,2 యూనిట్లు (ప్రస్తుతం ప్రపంచంలోని పురాతన రియాక్టర్‌లు) 50 సంవత్సరాల ఆపరేషన్ పూర్తి అయ్యిందని, కేజీఎస్ -1 నిరంతరాయంగా 962 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడం వంటి మైలురాళ్లు గత 10 సంవత్సరాల కాలంలో నమోదు అయ్యాయని అన్నారు.
లక్ష్యాల మేరకు విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూసేందుకు షెడ్యూల్ ప్రకారం ఆపరేటింగ్ రియాక్టర్ల ప్లాంట్ షట్‌డౌన్‌ను పూర్తి చేయడానికి , కొత్త యూనిట్ల నుంచి ఉత్పత్తి త్వరగా ప్రారంభించేలా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పిఎఫ్బీఆర్ ఇంటిగ్రేటెడ్ కమీషనింగ్‌లోఉందని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్ భారతీయ నాభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భవినీ) నిర్ణీత సమయం కంటే ముందుగానే లక్ష్యాన్ని చేరుకుందని తెలిపారు. అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణ అంశాలకు సంబంధించి అన్ని దశలలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
పర్యావరణ హిత ఇంధన వనరుగా గుర్తింపు పొందిన అణు విద్యుత్ ఉత్పత్తి 24X7 ఉత్పత్తి అవుతుందని అన్నారు. భారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న అణు విద్యుత్ రంగం దేశానికి స్థిరమైన పద్ధతిలో దీర్ఘకాలిక ఇంధన భద్రత అందించి 2070 నాటికి శూన్య కర్బన ఉద్గారాల విడుదల స్థాయికి చేరుకోవడానికి ఉపయోగపడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
***
(Release ID: 1989013)
Visitor Counter : 488