సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ర్యాంప్ కార్యక్రమం కింద కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణే మూడు ఉప పథకాలను ప్రారంభించారు. అవి ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్సింగ్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్కీమ్ (ఎంఎస్ఈ గిఫ్ట్ పథకం), ఎంఎస్ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ సర్క్యులర్ ఎకానమీ (ఎంఎస్ఈ స్పైస్ పథకం) ఆలస్యమైన చెల్లింపుల కోసం ఎంఎస్ఈ ఆన్‌లైన్ వివాద పరిష్కారాల పథకం


జెడ్ పథకం మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలకు పూర్తిగా ఉచితం

Posted On: 20 DEC 2023 5:50PM by PIB Hyderabad

ఎంఎస్ఎంఈ కోసం కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈరోజు ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా మూడు ఉప పథకాలను ప్రారంభించారు. అవి ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ మరియు ఫైనాన్సింగ్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్ పథకం (ఎంఎస్ఈ గిఫ్ట్ స్కీమ్), ఎంఎస్ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ సర్క్యులర్ ఎకానమీ (ఎంఎస్ఈ స్పైస్ స్కీమ్) ఆలస్యమైన చెల్లింపుల కోసం ఎంఎస్ఈ  ఆన్‌లైన్ వివాద పరిష్కారాల పథకం .

మొదటి పథకం - ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్సింగ్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్ పథకం (ఎంఎస్ఎంఈ గిఫ్ట్ స్కీమ్) వడ్డీ రాయితీ మరియు క్రెడిట్ గ్యారెంటీ మద్దతుతో ఎంఎస్ఎంఈలు గ్రీన్ టెక్నాలజీని అవలంబించడంలో సహాయపడటానికి ఉద్దేశించబడింది.

ఎంఎస్ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ సర్క్యులర్ ఎకానమీ (ఎంఎస్ఈ స్పైస్ స్కీమ్) అనేది సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్ట్‌లకు మద్దతునిచ్చే మొట్టమొదటి పథకం. ఇది క్రెడిట్ సబ్సిడీ ద్వారా చేయబడుతుంది.  2070 నాటికి సున్నా ఉద్గారాల దిశగా ఎంఎస్ఎంఈ రంగం యొక్క కలను సాకారం చేస్తుంది.

ఆలస్యమైన చెల్లింపుల కోసం ఆన్‌లైన్ వివాద పరిష్కారాల కోసం ఎస్ఎస్ఈ పథకం అనేది సూక్ష్మ మరియు చిన్న వ్యాపారాల కోసం ఉద్దేశించబడింది.  ఆలస్యంగా చెల్లింపులు జరిగే సంఘటనలను పరిష్కరించడానికి ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాధనాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చట్టపరమైన మద్దతును సమీకృతం చేసే మొట్టమొదటి పథకం ఇది.

ఎంఎస్ఎంఈలకు మెరుగైన మద్దతును అందించడానికి మంత్రిత్వ శాఖ ప్రస్తుత పథకాల కింద కొత్త కార్యక్రమాలను కూడా తీసుకుంటోంది. ఐపీ ప్రోగ్రామ్ యొక్క వాణిజ్యీకరణకు మద్దతు (ఎంఎస్ఎంఈ ఎస్సీఐపీ ప్రోగ్రామ్) ఎంఎస్ఎంఈ రంగంలోని ఆవిష్కర్తలు వారి ఐపీఆర్ని వాణిజ్యీకరించడానికి వీలు కల్పిస్తుంది. అదనంగా, మంత్రిత్వ శాఖ యొక్క జెడ్ పథకం ఇప్పుడు మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలకు పూర్తిగా ఉచితం. సర్టిఫికేషన్ ఖర్చు కోసం 100 శాతం ఆర్థిక మద్దతు చెల్లింపుకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఈ రెండింటిని కూడా కేంద్ర మంత్రిశ్రీ నారాయణ్ రాణే ప్రారంభించారు.

ఎన్ఐసీఎస్ఐ కోసం,  ఎంఎస్ఈ ఓడీఆర్ పథకం కోసం అమలు చేసే ఏజెన్సీలైన  ఎస్ఐడీబీఐ (ఎంఎస్ఎంఈ గిఫ్ట్ మరియు ఎంఎస్ఎంఈ స్పైస్ స్కీమ్‌ల కోసం) మరియు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఐఎన్సీతో మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూలు) మార్చుకుంది.

జాతీయ ఎంఎస్ఎంఈ కౌన్సిల్ యొక్క 2వ సమావేశం కూడా శ్రీ నారాయణ్ రాణే అధ్యక్షతన జరిగింది. పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయన అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు ఎంఎస్ఎంఈ రంగం యొక్క ప్రచారం  మరియు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.  తద్వారా వారి ప్రయత్నాలు ఈ రంగంలో ఆదాయం మరియు ఉపాధిని పెంచుతాయి. అంతేకాకుండా దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి.

జాతీయ ఎంఎస్ఎంఈ కౌన్సిల్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎంఎస్ఎంఈ  కేంద్ర సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీగా మారడంలో ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించిన ఆయన, కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి కార్యక్రమాల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్ఈఎల్ దాస్ మాట్లాడుతూ..  రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు ఇతర వాటాదారులు ఎంఎస్ఎంఈల మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మరియు పథకాల ప్రయోజనాలను ఎంఎస్ఎంఈలు పొందేలా మరియు సహకారం అందించాలని కోరారు. ర్యాంప్ కార్యక్రమం విజయవంతం కావడానికి మరియు దేశంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి యొక్క జాతీయ ఎంఎస్ఎంఈ ఎజెండాను సాధించడంలో దోహదపడుతుంది.

ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు / శాఖల కార్యదర్శులు మరియు రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు మరియు నోడల్ అధికారులు, ఎస్ఐడీబీఐ మరియు ఓఎన్డీసీ యొక్క చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్లు, ఎన్ఐసీఎస్ఐ యొక్క సీఈవోలు ఇతర ప్రముఖులతో పాటు హాజరయ్యారు.

ఎంఎస్ఎంఈ రంగంలో డిపార్ట్‌మెంటల్ కో-ఆర్డినేషన్, సెంటర్ స్టేట్ సినర్జీలను పర్యవేక్షించడానికి మరియు తప్పనిసరి చేసిన సంస్కరణలపై పురోగతిని సలహా / పర్యవేక్షించడానికి ప్రపంచ బ్యాంక్ మద్దతు ఉన్న ర్యాంప్ ప్రోగ్రామ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫంక్షనల్ బాడీగా పని చేయడానికి జాతీయ ఎంఎస్ఎంఈ కౌన్సిల్‌ను మంత్రిత్వ శాఖ  ఏర్పాటు చేసింది.  ర్యాంప్ ప్రోగ్రామ్ మార్కెట్ మరియు క్రెడిట్‌కు ప్రాప్యతను మెరుగుపరచడం, కేంద్రం మరియు రాష్ట్రంలో సంస్థలు మరియు పాలనను బలోపేతం చేయడం, కేంద్ర-రాష్ట్ర అనుసంధానాలు మరియు భాగస్వామ్యాలను మెరుగుపరచడం, ఆలస్య చెల్లింపులు మరియు ఎంఎస్ఎంఈల హరితీకరణ సమస్యలను పరిష్కరిస్తుంది.

 

***(Release ID: 1989010) Visitor Counter : 81


Read this release in: English , Urdu , Marathi