రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారుల (ఎన్హెచ్ లు)పై దేశవ్యాప్తంగా 34 సొరంగ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి, వాటిలో 26 సొరంగం ప్రాజెక్టులు హిమాలయ ప్రాంతంలో ఉన్నాయి.
అన్ని ప్రాజెక్టులు భద్రతను పరిగణనలోకి తీసుకుని నిర్మించడం జరుగుతోంది: శ్రీ నితిన్ గడ్కరీ
प्रविष्टि तिथि:
20 DEC 2023 1:07PM by PIB Hyderabad
ఐఆర్సి ప్రకారం: ఎస్పి:91-2019 (రహదారి సొరంగాల కోసం మార్గదర్శకాలు) ప్రత్యేక సర్వీస్ టన్నెల్, ట్రాఫిక్ సొరంగాలకు ఆనుకుని డిజైన్ దశలో భూమి లభ్యత, ట్రాఫిక్ పరిమాణం, సొరంగం పొడవు, అదనపు ఖర్చు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ అదనపు సొరంగం టన్నెల్ మూసివేత అవసరం లేకుండా నిర్వహణ కోసం మార్గం ఇస్తుంది. ఈ సర్వీస్ టన్నెల్‌ను అత్యవసర సమయంలో తప్పించుకునే మార్గంగా ఉపయోగించవచ్చు. ధరాసు - యుమునోత్రి హైవే (ఎన్హెచ్-134)లోని సిల్క్యారా ద్వి-దిశాత్మక సొరంగంలో, క్యారేజ్‌వే మధ్యలో సెపరేషన్ వాల్‌తో పాటు ఎగ్రెస్ ఓపెనింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాహన క్రాస్‌ఓవర్ కోసం సగటు విరామం 565 మీ, అత్యవసర సమయాల్లో తప్పించుకునే ప్రయోజనాల కోసం పాదచారుల క్రాస్ పాసేజ్ కోసం సగటున 300 మీ నిడివిలో తగు నిర్మాణాలు చేయడం జరుగుతోంది.
ప్రస్తుతం, జాతీయ రహదారులపై ( ఎన్హెచ్ లు) దేశవ్యాప్తంగా 34 సొరంగ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి, వీటిలో 26 సొరంగం ప్రాజెక్టులు హిమాలయ ప్రాంతంలో ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్‌లు భద్రతను పరిగణనలోకి తీసుకుని రూపొందించబడ్డాయి. ఈ ప్రాజెక్ట్‌లు సైట్-నిర్దిష్ట అవసరాలు, స్థాపించబడిన కోడ్‌లు, ఎస్కేప్ టన్నెల్స్, క్రాస్ పాసేజ్‌లతో కూడిన జంట ట్యూబ్‌లు, ఎమర్జెన్సీ ఓపెనింగ్‌లతో కూడిన సెపరేషన్ వాల్, లే-బైలు, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ మరియు సప్రెషన్ సిస్టమ్‌లు మొదలైన అత్యవసర పరిస్థితులతో సహా అవసరమైన భద్రతా చర్యలను కలిగి ఉంటాయి. .
చిక్కుకున్న కార్మికులకు వైద్య సహాయం అందించారు. మంచి మానసిక, శారీరక ఆరోగ్యంతో ఉన్నారు. ఆర్థిక సహాయంగా, ప్రతి కార్మికుడికి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ద్వారా ఒక నెల వేతనంతో కూడిన సెలవుతో పాటు రూ. 2.00 లక్షలు చెల్లించారు. పైన పేర్కొన్న వాటికి అదనంగా, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చిక్కుకున్న కార్మికులందరికీ ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించింది.
ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. నేడు. today.
***
(रिलीज़ आईडी: 1989006)
आगंतुक पटल : 100