సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి గతంలోని నిషేధాలను ఛేదించే ధైర్యం, దృఢవిశ్వాసం ఉందని తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
దాదాపు 2,000 వాడుకలో లేని నిబంధనలను తొలగించేందుకు ప్రధాని రూల్‌బుక్‌ను మించిపోయారు: డాక్టర్ జితేంద్ర సింగ్
‘‘గతంలో ఉన్న నిషేధాలను ఛేదించగల ధైర్యం, దృఢవిశ్వాసం ప్రధానికి ఉంది. దాదాపు 2,000 వాడుకలో లేని నిబంధనలను తొలగించడానికి ప్రధాన మంత్రి రూల్‌బుక్‌ను అధిగమించారు”: డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశం స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలను జరుపుకునేటప్పుడు పెరుగుతున్న అనుభవజ్ఞుల జనాభా విలువైన మద్దతుతో పాటు యువత విక్షిత్ భారత్@2047ను రూపొందిస్తారు: డాక్టర్ జితేంద్ర సింగ్
52వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ (పిఆర్‌సి) వర్క్‌షాప్‌లో ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
20 DEC 2023 7:30PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి గతంలోని నిషేధాలను ఛేదించగల ధైర్యం మరియు దృఢవిశ్వాసం ఉంది. దాదాపు 2,000 వాడుకలో లేని నిబంధనలను తొలగించేందుకు ప్రధాని రూల్‌బుక్‌ను అధిగమించారని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రధాని మోదీ పరిపాలనా సంస్కరణల శ్రేణిని కూడా ప్రారంభించారని ఆయన అన్నారు.
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) ; ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ (పిఆర్‌సి) వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని తెలిపారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గతంలోని నిషేధాలను ఛేదించగల ధైర్యం మరియు దృఢవిశ్వాసం ప్రధానికి ఉందని చెప్పారు. దాదాపు 2,000 వాడుకలో లేని నిబంధనలను తొలగించడానికి ప్రధాన మంత్రి రూల్‌బుక్‌ను అధిగమించారని తెలిపారు.
"ఒక ఉద్యోగి 10 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ అందించినట్లయితే పెన్షన్ తిరస్కరణ, ఏడేళ్లు గడిచే వరకు ఉద్యోగులకు ప్రయోజనాలను నిరాకరించడం, డిపెండెంట్ విడాకులు తీసుకున్న కుమార్తెలకు పెన్షన్ ప్రయోజనాలను మంజూరు చేయకపోవడం వంటి నిబంధనలన్నీ రద్దు చేయబడ్డాయి" అని ఆయన చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..పీఎం మోదీ నేతృత్వంలోని పరిపాలనా కార్యక్రమాలు, రిటైర్‌మెంట్‌కు ముందు కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌లు, అనుభవ్ అవార్డులు మరియు పెన్షన్ అదాలత్ వంటివి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు సకాలంలో పెన్షన్ ప్రయోజనాలను అందజేస్తాయని చెప్పారు.
"పెన్షన్ కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు ఈజ్ ఆఫ్ లివింగ్ సాధ్యమైందని ఇప్పుడు డిఎల్‌సి కోసం ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారని కేంద్రమంత్రి చెప్పారు. భవిష్య పోర్టల్, డిజిలాకర్, పింఛనుదారుల కోసం ప్రత్యేకంగా సిపిఇఎన్‌గ్రామ్స్‌ను ప్రారంభించడం ద్వారా పదవీ విరమణ పొందిన మరియు పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులకు ప్రయోజనం అందించేందుకు ప్రారంభించబడ్డాయి ”అని ఆయన చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..పిఆర్‌సి వర్క్‌షాప్‌లు సమగ్రంగా మరియు పింఛను పంపిణీ చేసే బ్యాంకులు, సిజిహెచ్‌ఎస్ మరియు పింఛనుదారుల సంఘాలతో ఏర్పాటు చేసిన స్కోవా సమావేశాలతో సహా అన్ని సంబంధిత విభాగాలతో ఏకీకృతం చేయబడ్డాయని తెలిపారు. ఇది ‘హోల్ ఆఫ్ గవర్నమెంట్’ విధానాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
ఈ రోజు మూడు కోట్ల మంది పెన్షనర్లు ఉన్నారని, వారి సంఖ్య పని చేసే ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. వారంతా విక్షిత్ భారత్@2047 లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడే రిసోర్స్ పూల్‌గా ఉన్నారుని తెలిపారు.
"భారతదేశం తన స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలను జరుపుకునేటప్పుడు పెరుగుతున్న అనుభవజ్ఞుల జనాభా ద్వారా విలువైన మద్దతుతో పాటు యువత విక్షిత్ భారత్@2047ను రూపొందిస్తారు" అని కేంద్రమంత్రి అన్నారు.
ఈ సందర్భంగా డిఒపి&పిడబ్ల్యూ కార్యదర్శి మరియు డిఏఆర్‌పిజి సెక్రటరీ శ్రీ వి. శ్రీనివాస్; సిజిహెచ్‌ఎస్ డీజీ శ్రీమతి. రోలీ సింగ్; రక్షణమంత్రిత్వశాఖ సిజిడిఏ శ్రీ ఎస్‌జి దస్తిదార్; మరియు ఎస్‌బిఐ సిజీఎం షాలిని కాకర్ కూడా ప్రసంగించారు.
***
(Release ID: 1989003)
Visitor Counter : 72