వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి టాడ్ మెక్‌క్లే తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.


సహకార విధానంలో ఇరు దేశాల మధ్య సంబందాలు పెరగాల్సిన అవసరం ఉందని మంత్రులు తెలిపారు

Posted On: 20 DEC 2023 11:55AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో గౌరవనీయులైన న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి టాడ్ మెక్‌క్లేతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారతదేశం మరియు న్యూజిలాండ్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం మరియు పరస్పర వృద్ధి మరియు సహకారానికి అవకాశాలను అన్వేషించడం ఈ సమావేశం లక్ష్యం.

 

మంత్రి గోయల్ మరియు మంత్రి మెక్‌క్లే వాణిజ్య సులభతరం యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు మరియు వాణిజ్య ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, వాణిజ్య అడ్డంకులను తగ్గించడానికి మరియు రెండు దేశాల నుండి వ్యాపారాలు మరియు పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహించడానికి చర్యలను చర్చించారు. ఈ సందర్భంలో, కలపను భారతదేశానికి ఎగుమతి చేయడానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి భారతదేశం చేసిన ప్రయత్నాలను న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి అభినందించారు. భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీని మరియు దాని ఫలితాలను కూడా ఆయన ప్రశంసించారు, ఇది అందరి ప్రయోజనం కోసం ఆచరణాత్మక ప్రపంచ పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నందున ఇది ముఖ్యమైన మైలురాయని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం మరియు గౌరవం పునాదిపై నిర్మించబడిన సుదీర్ఘ స్నేహ సంబంధాలను మంత్రులు ఇద్దరూ గుర్తించారు మరియు ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు మరియు ఆర్థిక సహకారాన్ని మరింత పెంపొందించడానికి తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. వ్యవసాయం, అటవీ, ఔషధాలు, కనెక్టివిటీ, విద్య మరియు పర్యాటక రంగం వంటి రంగాలలో నిమగ్నమవ్వాల్సిన అవసరాన్ని వారు హైలైట్ చేశారు.

 

రెండు దేశాల్లోని వ్యాపారాల మధ్య సంబంధాలలో బలమైన ముందడుగు వేయడాన్ని మంత్రులు గుర్తించారు మరియు ప్రభుత్వం-ప్రభుత్వం మధ్య సంభాషణకు ఇది ఊపునిచ్చింది.  భారతదేశం-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందం 1986 ప్రకారం ఏర్పాటైన జాయింట్ ట్రేడ్ కమిటీ యొక్క వార్షిక సమావేశం మరియు సీనియర్ స్థాయిలో నిరంతర చర్చల యొక్క ప్రాముఖ్యత కూడా గుర్తించారు. వాణిజ్యం మరియు పెట్టుబడి సమస్యలు మరియు సహకార కార్యకలాపాలపై ద్వైపాక్షిక చర్చల కోసం ఇరుపక్షాలకు అనువైన సమయం లో తరచూ సమావేశం కావాలని మంత్రులు అంగీకరించారు.

ఇంకా, మంత్రులు ప్రపంచ వాణిజ్య పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు మరియు నియమాల ఆధారిత, పారదర్శక మరియు సమగ్రమైన బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థకు తమ మద్దతును పునరుద్ఘాటించారు. వారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్(ఎం సీ) కి సంబంధించిన సమస్యలను కూడా క్లుప్తంగా చర్చించారు మరియు ఎం సీ 13 సమయంలో పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ దీర్ఘకాలిక సమస్యపై నిర్ణయం తీసుకోవడానికి సానుకూల విధానం కోసం పరస్పర సహకారం మరియు పరస్పర అవగాహనకు హామీ ఇచ్చారు. 

 

ఇద్దరు మంత్రులూ లోతైన సహకారం ద్వారా భవిష్య సంభావ్యతలపై  ఆశావాదాన్ని వ్యక్తం చేశారు మరియు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి నిర్మాణాత్మక చర్చలను కొనసాగించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు పరస్పర అవగాహనతో సన్నిహితంగా పని చేయడం కొనసాగించాలానే సానుకూల సంకేతాలతో సమావేశం ముగిసింది.

 

***



(Release ID: 1988958) Visitor Counter : 60


Read this release in: English , Urdu , Hindi , Tamil