పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
విమానాశ్రయ ఆపరేటర్ల సలహా బృంద సమావేశానికి అధ్యక్షత వహించిన పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సిథియా
డిజియాత్ర రానున్న పండుగ సీజన్లలో రద్దీని నివారించేందుకు చర్యలు,కాపెక్స్ లక్ష్యాలపై సమావేశంలో చర్చ
Posted On:
20 DEC 2023 12:18PM by PIB Hyderabad
కేంద్ర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింథియా 19 డిసెంబర్ 2023న విమానశ్రయ నిర్వాహకులతో సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. రానున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాలలో రద్దీని నివారించాల్సిన ప్రాముఖ్యతను మంత్రి నొక్కి చెప్పారు. ఈ కాలంలో ప్రయాణీకులు సమయాన్ని ఆదా చేసే ప్రయాణ అనుభవాన్ని, ఎటువంటి ఆటంకాలు లేని ప్రయాణాన్ని సులువు చేసేందుకు సాధ్యమైన చర్యలన్నింటినీ మంత్రిత్వ శాఖ సానుకూలంగా తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఆపరేటర్ల ప్రశ్నలను, సూచనలను విని, ప్రయాణీకుల సౌకర్యం కోసం అభిలషణీయ కార్యకలాపాలను నిర్ధారించవలసిందిగా సమావేశంలో మంత్రి మార్గదర్శనం చేశారు. ప్రధానంగా డిజియాత్ర అనే ముఖ్యమైన అంశంచర్చకు వచ్చింది. ప్రవేశ ద్వార ప్రక్రియలు, చెక్ ఇన్ ప్రక్రియలను మాన్యువల్‌గా కాక డిజిటిల్‌గా చేయడాని్న పెంచి డిజి యాత్రను ప్రోత్సహించడం వల్ల ప్రయాణీకులు ఎటువంటి ఆటంకాలు లేకుండా, వేగంగా కదులుతారు. ప్రస్తుతం ఈ సౌకర్యం దేశంలోని లక్నో, ముంబై, అహ్మదాబాద్, కొచ్చి, జైపూర్, గువాహతి, ఢిల్లీ, బెంగళూరు, వారణాసి, విజయవాడ, పూణె, హైదరాబాద్, కోల్‌కతా విమాశ్రయాలు సహా 13 విమానాశ్రయాలలో అందుబాటులో ఉంది. ఈ చర్చలో అంతర్జాతీయ ప్రయాణీకులు ప్రవేశ, నిష్క్రమణ సమయంలో డిజియాత్ర ఉపయోగించే అవకాశాన్ని జోడించాలన్నసూచన వచ్చింది. ఉత్తమ ఆచరణ ప్రక్రియలను అన్వేషించేందుకు, ఇతర దేశాలలోబయోమెట్రిక్ తోడ్పాటుతో విజయవంతంగా ఉపయోగిస్తున్ననమూనాలను ప్రెజెంట్ చేయాలని విమానాశ్రయ నిర్వాహకులకు పని అప్పచెప్పారు.
ముందకు వెడుతూ, మంత్రి అన్ని విమానాశ్రయ నిర్వహకుల మూలధన వ్యయ లక్ష్యాలను, క్యూ3లో వాస్తవ లక్ష్యాలతో సమలేఖనం చేసి సమీక్షించారు.
ఈ సమావేశానికి జిఎంఆర్ విమానాశ్రయాలు, అదానీ విమానాశ్రయాలు, బిఐఎఎల్, కొచ్చిన విమానాశ్రయం, భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థకు చెందిన విమానాశ్రయ ఆపరేటర్లు అందరూ హాజరయ్యారు. పౌర విమానాయాన శాఖ కార్యదర్శి శ్రీ వుమ్‌లున్మంగ్ వుఆల్నం, డిజి బిసిఎఎస్ శ్రీ జుల్ఫికర్ హసన్, డిజిసిఎ డిజి శ్రీ విక్రమ్ దేవ్‌దత్, ఇతర సంయుక్త కార్యదర్శులు, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1988956)