సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

మనుషులతో పారిశుధ్య పనులపై నిషేధం

Posted On: 19 DEC 2023 3:05PM by PIB Hyderabad

 

మనుషుల ద్వారా పారిశుధ్య పనుల (మాన్యువల్ స్కావెంజర్లుగా) ఉపాధి అంశం నిషేధించడం మరియు వారి పునరావాస చట్టం, 2013 (ఎంఎస్ చట్టం, 2013) ప్రకారం మాన్యువల్ స్కావెంజింగ్ అనేది 6.12.2013 నుండి దేశంలో నిషేధించబడిందిఅన్ని జిల్లాల యంత్రాంగాలు తమను తాము మాన్యువల్ స్కావెంజింగ్ నుండి విముక్తపు జిల్లాలుగా ప్రకటించుకోవాలని లేదా ఈ అంశంతో సంబంధం ఉన్న మరుగుదొడ్లు మరియు మాన్యువల్ స్కావెంజర్ల డేటాను మొబైల్ యాప్ “స్వచ్ఛతా అభియాన్లో అప్లోడ్ చేయాలని అభ్యర్థించడంమైందిజిల్లాలు తమను తాము మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీగా ప్రకటించుకోవడానికి ఎటువంటి ఆఖరి గడువు లేదు. 10.12.2023 నాటికిదేశంలోని ఆరు రాష్ట్రాల్లోని 38 జిల్లాలు తమను తాము మాన్యువల్ స్కావెంజింగ్ లేని జిల్లాలుగా ప్రకటించలేదువాటి వివరాలు ఇలా ఉన్నాయి-

రాష్ట్రాల వారీగా మాన్యువల్ స్కావెంజింగ్ కార్యక్రమాలు లేని జిల్లాలలుగా నివేదించని వాటి సంఖ్య

 

క్రమ సంఖ్య

రాష్ట్రాలు/యూటీల పేరు

జిల్లాల సంఖ్య

1.

Assam

3

2.

జార్ఖండ్

1

3

మధ్యప్రదేశ్

10

4.

మణిపూర్

9

5

మేఘాలయ

2

6

తెలంగాణ 

13

 

ప్రస్తుతం దేశంలో మాన్యువల్ స్కావెంజింగ్లో నిమగ్నమైన వ్యక్తుల గురించి సమగ్ర నివేదిక అందుబాటులో లేదు.

 

"మాన్యువల్ స్కావెంజర్స్గా ఉపాధిని నిషేధించడం మరియు వారి పునరావాస చట్టం, 2013 (MS చట్టం, 2013)" సెక్షన్ 2 (1) (g) నిర్వచించిన విధంగా మాన్యువల్ స్కావెంజింగ్ ప్రక్రియ చేపట్టడం  6.12.2013 నుండి నిషేధించబడింది వ్యక్తి లేదా ఏజెన్సీ  తేదీ నుండి మాన్యువల్ స్కావెంజింగ్ కోసం  వ్యక్తిని నియమించలేరుసామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో  సమాచారం తెలియజేశారు. 

***



(Release ID: 1988520) Visitor Counter : 70


Read this release in: English , Urdu , Hindi