వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

"పీఎం గతిశక్తి సమగ్ర నివేదిక II”ని విడుదల చేసిన శ్రీ పీయూష్ గోయల్


“ప్రధాన మంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అమలు, బాధ్యతలు ” , “జిల్లా కలెక్టర్ల కోసం పీఎం గతిశక్తికరదీపిక"

" ప్రాంతీయ అభివృద్ధి కోసం జాతీయ మాస్టర్ ప్లాన్”

Posted On: 19 DEC 2023 2:26PM by PIB Hyderabad

పీఎం గతిశక్తి పై రూపొందించిన మూడు పత్రాలను కేంద్ర వాణిజ్యం ,పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,  ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ  పీయూష్ గోయల్ మూడు పత్రాలను విడుదల చేశారు,  "పీఎం గతిశక్తి సమగ్ర నివేదిక  II” “ప్రధాన మంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అమలు, బాధ్యతలు ” , “జిల్లా కలెక్టర్ల కోసం పీఎం  గతిశక్తికరదీపిక" " ప్రాంతీయ అభివృద్ధి కోసం జాతీయ  మాస్టర్ ప్లాన్”ను   న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లోనిన్న జరిగిన కార్యక్రమంలో మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యం,పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్, పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) శ్రీమతి. సుమితా దావ్రా, BISAG-N డైరెక్టర్ జనరల్ శ్రీ  T.P సింగ్, నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ గోయల్  గత రెండేళ్లలో పీఎం గతిశక్తి అమలు ద్వారా  సాధించిన ఫలితాలు,ప్రగతి పట్ల అధికారులను అభినందించారు. సమీకృత డేటా ఆధారిత వ్యవస్థ  ద్వారా ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో, ప్రాజెక్ట్ రూపకల్పన, వ్యయ ప్రభావానికి హామీ ఇవ్వడం, సమయానుకూలంగా అమలు చేయడం, త్వరితగతిన నిరభ్యంతర   అనుమతులు జారీ చేయడం,  భూసేకరణ వంటి అంశాలలో పీఎం గతిశక్తి వల్ల  ప్రయోజనాలు కలుగుతాయని  ఆయన అన్నారు. 

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ  సోమ్ ప్రకాష్ మాట్లాడుతూ పీఎం గతిశక్తి ని ఉపయోగించి   ప్రాంతాల అభివృద్ధి కోసం రూపొందించిన  సమగ్ర ప్రణాళిక కింద  మౌలిక సదుపాయాలు, ఆర్థిక, సామాజిక మంత్రిత్వ శాఖలు/విభాగాలు కార్యక్రమాలు/పథకాలు చేపట్టాలని సూచించారు.  . ఈ మూడు పత్రాలు విడుదల చేయడం వల్ల మన దేశ మౌలిక సదుపాయాల ప్రణాళిక మరింత సమర్థంగా అమలు జరిగి  భారతదేశ రవాణా  సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది అని  మంత్రి అన్నారు. 

మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం  జిల్లా/స్థానిక స్థాయిలో కార్యక్రమాలు అమలు చేసిన సాధించిన  అభివృద్ధిని   పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ వివరించారు.  ఈ పత్రాలు అన్ని వాటాదారులకు ప్రయోజనం కలిగిస్తాయని, సమీకృత ప్రణాళిక, తాత్కాలిక సమస్యల పరిష్కారం,   కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక స్థాయిలో సంబంధిత వర్గాల  మధ్య సమన్వయాన్ని సాధించటానికి వీలు కల్పిస్తామని అన్నారు.  

డేటా యాజమాన్యం మరియు నాణ్యత నిర్వహణ,నివేదికల  వినియోగానికి సంబంధించి సమిష్టి ప్రయత్నాలు అమలు జరుగుతున్నాయని  శ్రీమతి. సుమితా దావ్రా తెలిపారు.  (i) "భారతదేశంలో రవాణా  ఖర్చు:మదింపు దీర్ఘకాలిక వ్యవస్థ "(ii) "వివిధ రాష్ట్రాల్లో సులభతరం రవాణా - 2023" విడుదల చేసిన  పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం  (iii) న్యూఢిల్లీలో BISAG-N ఆఫీస్-కమ్-ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించింది. శ్రీ గోయల్ . విడుదల చేసిన మూడు పత్రాలు పీఎం  గతిశక్తి అమలులో  వాటాదారుల పాత్రలు, బాధ్యతలను నిర్దేశిస్తాయి.  జిల్లా/స్థానిక స్థాయిలో ప్రాంత అభివృద్ధి ప్రణాళికను సులువుగా అమలు చేసేందుకు అవకాశం కల్పించి, సంబంధిత వర్గాలు సమన్వయంతో పని చేయడానికి అవకాశం కల్పిస్తామని ఆమె వివరించారు. 

 

“పీఎం గతిశక్తి సంగ్రహం: వాల్యూమ్ II”

పీఎం  గతిశక్తిని ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా  పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం , అక్టోబర్ 13, 2023న“పీఎం గతిశక్తి సంగ్రహం: వాల్యూమ్ I”   విడుదల చేసింది. దీనికి  కొనసాగింపుగా పీఎం గతిశక్తి కింద సాధించిన ప్రగతి వివరిస్తూ “పీఎం గతిశక్తి సంగ్రహం: వాల్యూమ్ II”నరూపొందించి విడుదల చేసింది. 

పీఎం గతిశక్తి ఆధారంగా బరేలీ, గోరఖ్‌పూర్, సిలిగురిని కలుపుతూ నిర్మించిన  హై-స్పీడ్ హైవే నిర్మాణం  సహా అనేక రకాల ప్రాజెక్టుల వివరాలను నివేదికలో పొందుపరిచారు.  బెంగళూరు లో పట్టణ రద్దీని పరిష్కరించడం, అరుణాచల్ ప్రదేశ్‌లో రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి  పర్యాటక రంగం అభివృద్ధికి అమలు చేసిన కార్యక్రమాలను నివేదికలో పేర్కొన్నారు. 

పీఎం గతిశక్తిని అమలు చేయడం వల్ల  వేగవంతమైన నిర్ణయం తీసుకోవడం,సమగ్ర ప్రణాళిక రూపకల్పన, సమయం వ్యయాన్ని తగ్గించడం, డిజిటల్ సాధనాల వినియోగం లాంటి  ప్రయోజనాలను నివేదికలో వివరించారు. సులభతరం వ్యాపార నిర్వహణ, జీవం సౌలభ్యం కల్పించడానికి అమలు చేయాల్సిన చర్యలను నివేదికలో పొందుపరిచారు.

"జిల్లా కలెక్టర్ల కోసం కరదీపిక : " ప్రాంతీయ అభివృద్ధి కోసం పీఎం గతిశక్తి  జాతీయ  మాస్టర్ ప్లాన్”

సమగ్ర ప్రాంత-ఆధారిత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి పీఎం గతిశక్తి ప్రాధాన్యత ఇస్తుంది. దీనిని సాధించడానికి  జిల్లా/స్థానిక స్థాయి ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుంది.  జిల్లా స్థాయి అధికారుల పాత్ర తెలియజేసే విధంగా  "జిల్లా కలెక్టర్ల కోసం కరదీపిక : " ప్రాంతీయ అభివృద్ధి కోసం పీఎం గతిశక్తి  జాతీయ  మాస్టర్ ప్లాన్”  రూపొందించారు. ఈ కరపత్రం ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక  సూత్రాల వివరణాత్మక అవలోకనాన్ని అందిస్తుంది. లక్ష్యాల సాధనలో  జిల్లా/స్థానిక స్థాయి పరిపాలన వ్యవస్థ పాత్రను తెలియజేస్తుంది. అవాంతరాలు లేకుండా పీఎం  గతిశక్తిని జిల్లా స్థాయిలో అమలు చేయడం,   సామాజిక  ఆర్థిక మౌలిక సదుపాయాల ప్రణాళిక, అమలులో పాల్గొనే  జిల్లా/స్థానిక స్థాయిలో వాటాదారుల పాత్రలు, బాధ్యతలపై పూర్తి అవగాహన ను అందిస్తుంది

"పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌పై పాత్రలు, బాధ్యతల సంగ్రహం"

వివిధ  మంత్రిత్వ శాఖలు/రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం రూపొందించిన  “పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌పై పాత్రలు, బాధ్యతల సంగ్రహం” కూడా విడుదల అయ్యింది. వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు, రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు  BISAG-N, లాజిస్టిక్స్ డివిజన్‌తో సహా వాటాదారుల పాత్రలు, బాధ్యతలను దీనిలో వివరించారు.  

 నాణ్యత, నవీకరణ యంత్రాంగం, డేటా సవరణ, డేటా నిర్వహణ ప్రమాణాలను తనిఖీ చేయడానికి  చెక్‌లిస్ట్ సిద్ధం చేసి స్పష్టత, సహకారం, సమర్థంగా పని చేయడానికి  ప్రతి మంత్రిత్వ శాఖ/విభాగం /రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతానికి ఉపయోగపడుతుంది. 

***



(Release ID: 1988517) Visitor Counter : 74


Read this release in: English , Urdu , Hindi