భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ స్కీమ్‌లో పోటీతత్వాన్ని పెంపొందించడంలో భాగంగా ఫేజ్ 2 కింద కొత్త అడ్వాన్స్‌డ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈలు) ఏర్పాటు, ఇప్పటికే ఉన్న సీఓఈని పెంచడం కోసం తొమ్మిది ప్రాజెక్టులను మంజూరు చేసిన ఎంహెచ్ఐ.
కామన్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు,ఇప్పటికే ఉన్న సీఈఎఫ్సీల పెంపుదల కోసం ఐదు ప్రాజెక్టులు కూడా ఇప్పటివరకు మంజూరు
Posted On:
19 DEC 2023 2:46PM by PIB Hyderabad
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) 2014 సంవత్సరంలో "భారత కాపిటల్ గూడ్స్ రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడం" అనే పథకాన్ని ప్రారంభించింది, దీని మొత్తం వ్యయం రూ. 995.96 కోట్లు. బడ్జెట్ మద్దతు రూ. 631.22 కోట్లు. క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక అవసరాలను తీర్చడానికి ఉద్దేశించినది ఈ పథకం.
ఈ పథకం కింద, సాంకేతిక అభివృద్ధి కోసం ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈలు), నాలుగు ఇండస్ట్రీ 4.0 సమర్థ్ కేంద్రాలు, ఆరు టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా పదిహేను కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్‌లు (సీఈఎఫ్సీలు) స్థాపించారు.
జనవరి 25, 2022న, ఎంహెచ్ఐ రూ. 1207 కోట్ల ఆర్థిక వ్యయంతో పథకం 2వ దశను నోటిఫై చేసింది. దీనిలో బడ్జెట్ మద్దతు రూ.975 కోట్లు కాగా పరిశ్రమ సహకారం రూ.232 కోట్లు. కొత్త అడ్వాన్స్‌డ్ సీఓఈని ఏర్పాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న సీఓఈని పెంచడానికి మొత్తం తొమ్మిది ప్రాజెక్ట్‌లు, సీఈఎఫ్సీల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న సీఈఎఫ్సీల పెంపుదల కోసం ఐదు ప్రాజెక్ట్‌లు స్కీమ్ 2వ దశ కింద ఇప్పటివరకు మంజూరు అయ్యాయి.
కాంపోనెంట్, టెక్నాలజీ అక్విజిషన్ ఫండ్ ప్రోగ్రామ్ (టీఏఎఫ్పీ) క్రింద, భారత క్యాపిటల్ గూడ్స్ సెక్టార్-ఫేజ్1లో పోటీతత్వాన్ని పెంపొందించే స్కీమ్ వివరాల ప్రకారం ఐదు విదేశీ తయారీ సాంకేతికతలు సమీకరణ జరిగాయి.
(రూ.లు కోట్లలో)
ప్రాజెక్ట్ అథారిటీ
|
సమీకరించిన సాంకేతికత
|
మొత్తం ప్రాజెక్ట్ వ్యయం
|
మొత్తం విడుదలైన ఎంహెచ్ఐ గ్రాంట్
|
హెచ్ఎంటీ మెషిన్ టూల్స్ లిమిటెడ్, బెంగళూరు
|
ఫోర్ గైడ్ వే సీఎన్సి లాత్ అభివృద్ధి
|
4.40
|
1.10
|
హెచ్ఎంటీ మెషిన్ టూల్స్ లిమిటెడ్, బెంగళూరు
|
వై-యాక్సిస్ SB CNC30TMYతో టర్న్ మిల్ సెంటర్ అభివృద్ధి మరియు మెయిన్ స్పిండిల్‌పై హై ప్రెసిషన్ సీ-యాక్సిస్‌ను ఏకీకృతం చేయడం
|
1.5280
|
0.2292
|
అలైడ్ ఇంజనీరింగ్ ప్రై. లిమిటెడ్, ఢిల్లీ
|
హెవీ డ్యూటీ ఎలక్ట్రికల్ స్పెషలైజ్డ్ పవర్ కేబుల్స్ తయారీ
|
14.33
|
3.58375
|
పీటీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లక్నో
|
భారతదేశంలో మొట్టమొదటి టైటానియం కాస్టింగ్ సౌకర్యం అభివృద్ధి
|
51.02
|
10.00
|
ఐపీఎం ప్రైవేట్. లిమిటెడ్, ఢిల్లీ
|
టంగ్‌స్టన్ కార్బైడ్ పౌడర్ ఉపయోగించి హైడ్రో టర్బైన్‌ల కోసం రోబోటిక్ లేజర్ క్లాడింగ్ టెక్నాలజీ అభివృద్ధి
|
4.975
|
1.2425
|
భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1988516)
Visitor Counter : 67