సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీనియ‌ర్ సిటిజెన్ల‌కు ప్ర‌ధాన సేవ‌లు

प्रविष्टि तिथि: 19 DEC 2023 3:04PM by PIB Hyderabad

సామాజిక న్యాయం, సాధికార‌త విభాగం నిర్వ‌హించే అట‌ల్ వ‌యో అభ్యుద‌య యోజ‌న (ఎవివైఎవై) అనే  ప‌థ‌కం కింద సీనియ‌ర్ సిటిజెన్ల‌కు  ఆర్ధిక భ‌ద్ర‌త‌, ఆరోగ్యం, పౌష్టికాహారం, ఆశ్ర‌యం, సంక్షేమం త‌దిత‌రాల‌ను అందిస్తున్నారు. అటువంటి ఒక ఉప‌క‌ర‌ణం, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఫ‌ర్ సీనియ‌ర్ సిటిజెన్స్ (ఐపిఎస్ఆర్‌సి - సీనియ‌ర్ సిటిజెన్ల‌కు స‌మ‌గ్ర కార్య‌క్ర‌మం) కింద‌, నిరుపేద వృద్ధుల‌కు ఆశ్ర‌యం, ఆహారం, వైద్యం, వినోద అవ‌కాశాలు మొద‌లైన ప్రాథ‌మిక సౌక‌ర్యాలు ఉచితంగా అందించే సీనియ‌ర్ సిటిజెన్ హోమ్‌ల నిర్వ‌హ‌ణ, న‌డ‌ప‌డం కోసం అమ‌లు ఏజెన్సీల‌కు ఆర్ధిక స‌హాయం అందిస్తారు. రాష్ట్రీయ వ‌యోశ్రీ యోజ‌న (ఆర్‌వివై) కింద దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న నివ‌సిస్తున్న లేదా నెల‌కు రూ. 15000 ఆదాయం ఉండి, వ‌య‌సుకు సంబంధించిన వైక‌ల్యాల‌తో బాధ‌ప‌డుతున్న సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు శిబిరాలు నిర్వ‌హించి జీవ‌న స‌హాయ‌క ప‌రిక‌రాల‌ను ఉచితంగా పంపిణీ చేస్తారు. 
ఎల్డ‌ర్‌లైన్ః  సీనియ‌ర్ సిటిజ‌న్ల జీవ‌న నాణ్య‌త‌ను మెరుగుప‌ర‌చేందుకు సీనియ‌ర్ సిటిజెన్ల కోసం జాతీయ హెల్ప్‌లైన్ (ఎన్‌హెచ్ఎస్‌సి) (టాల్ ఫ్రీ నెం. 14567) అన్న‌వి ఉచిత స‌మాచారం, మార్గ‌ద‌ర్శ‌నం, ఉద్వేగ‌ప‌ర‌మైన మ‌ద్ద‌తుతో పాటుగా అత్యాచారాలు జ‌రుగుతున్న కేసుల్లో జోక్యం చేసుకుని,కాపాడ‌తారు. సీనియ‌ర్ -కేర్‌- ఏజియింగ్ గ్రోత్ ఇంజిన్ (ఎస్ఎజిఇ ) అన్న‌ది వృద్ధుల స‌మ‌స్య‌ల గురించి ఆలోచించి, వారి సంర‌క్ష‌ణ కోసం వినూత్న భావ‌న‌ల‌ను ఆవిష్క‌రించమ‌ని యువ‌త‌ను ప్రోత్స‌హించ‌డ‌మే కాక ఈక్విటీ స‌పోర్ట్‌ను అందించ‌డం ద్వారా వాటిని స్టార్ట‌ప్‌లుగా ఎదిగేందుకు ప్రోత్స‌హిస్తారు. 
కేంద్ర గ్రామీణాభివృద్ధి విభాగం కింద కేంద్ర ప్రాయోజిత ప‌థ‌క‌మైన జాతీయ సామాజిక స‌హాయ కార్య‌క్ర‌మం (ఎన్ఎస్ఎపి)కి చెందిన ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓల్డ్ ఏజ్ పెన్ష‌న్ స్కీం (ఐజిఎన్ఒఎపిఎస్‌) కింద, దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న (బిపిఎల్‌)గ‌ల కుటుంబాల‌కు చెందిన 60-79 సంవ‌త్స‌రాలు వ‌య‌స్సు గ‌ల వృద్ధుల‌లో ప్ర‌తి ల‌బ్ధిదారునికి నెల‌కు రూ. 200/- చొప్పున నెల‌వారీ పింఛ‌ను చెల్లిస్తున్నారు. వారి వ‌య‌సు 80 ఏళ్ళ‌కు చేరుకున్న త‌ర్వాత ల‌బ్ధిదారులకు నెల‌కు రూ. 500/- కు పింఛ‌ను రేటును పెంచుతారు. ల‌బ్ధిదారులు గౌర‌వ‌నీయ స్థాయిలో స‌హాయాన్ని పొందేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన మొత్తానికి స‌మాన‌మైన టాప్ అప్ మొత్తాన్ని అందించ‌వ‌ల‌సిందిగా రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ను ప్రోత్స‌హిస్తారు. ప్ర‌స్తుతం రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాలు ఎన్ఎస్ఎపి ప‌రిధిలోని ఐజిఎన్ఒఎపిఎస్ కింద ఒక్కో ల‌బ్దిదారుకు నెల‌కు రూ. 50 నుంచి రూ. 3000వ‌ర‌కు టాప్ అప్ మొత్తాల‌ను జోడిస్తున్నాయి. 
ఎన్ఎస్ఎపి పింఛ‌ను ప‌థ‌కాల కింద తోడ్పాటును ప‌థ‌కాల వారీ, రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాల వారీగా ల‌బ్ధిదారుల‌కు మంజూరు చేస్తారు. ప్ర‌స్తుతం దేశంలో ఐజిఎన్ఒఎపిఎస్ కింద ఉన్న ల‌బ్ధిదారుల సంఖ్య 2.21 కో్ట్లు, అన్ని రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో ఈ ప‌థ‌కం దాదాపు 100% సంతృప్త స్థాయిని సాధించింది.   ఎన్ఎస్ఎపి పింఛ‌ను ప‌థ‌కాలు కింద రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు విధించిన క్యాప్‌ను మించి అర్హులైన ల‌బ్ధిదారులు ఉంటే, రాష్ట్రాలు/  కేంద్ర‌ప్ర‌భుత్వాలు త‌మ స్వంత నిధుల నుంచి పింఛ‌న్ల‌ను అందించే ప్ర‌త్యామ్నాయం ఉంది. 
రాష్ట్ర ఆరోగ్య సేవ‌ల బ‌ట్వాడా వ్య‌వ‌స్థ అంటే, ఔట్‌రీచ్ సేవ‌లు స‌హా ప్రాథ‌మిక‌, ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు సంబంధించిన వివిధ స్థాయిలో్ల సీనియ‌ర్ సిటిజెన్ల‌కు ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను అందించే ఉద్దేశంతో అంకిత‌మైన ఆరోగ్య సేవ‌ల‌ను అందించేందుకు 2010-11లో ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వృద్ధుల ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం జాతీయ కార్య‌క్ర‌మం (ఎన్‌పిహెచ్‌సిఇ)ని ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో రెండు భాగాలు ఉన్నాయి, ఒక‌టి జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) అంటే ప్రాథ‌మిక‌, ద్వితీయ శ్రేణి సేవ‌ల‌ను జిల్లా ఆసుప‌త్రులు (డిహెచ్‌), క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్లు (సిహెచ్‌సి) ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి)లు, స‌బ్‌-సెంట‌ర్‌/  హెల్త్ & వెల్‌నెస్ సెంట‌ర్లు, ఇక మూడ‌వ ఉప‌క‌ర‌ణంలో సేవ‌ల‌ను  భార‌త‌దేశంలోని 18 రాష్ట్రాల‌లో గ‌ల 19 వైద్య క‌ళాశాల‌ల్లో గ‌ల జాతీయ జీరియాట్రిక్ సెంట‌ర్లు (ఆర్‌జిసిలు), ఒక‌టి న్యూఢిల్లీలోని అన్సారీ న‌గ‌ర్‌లోని ఎఐఐఎంఎస్‌, మ‌రొక‌టి మ‌ద్రాస్ మెడిక‌ల్ కాలేజీలో  రెండు నేష‌న‌ల్ సెంట‌ర్స్ ఆఫ్ ఏజియింగ్ (ఎన్‌సిఎ) సెంట‌ర్లు ఉన్నాయి. సీనియ‌ర్ సిటిజెన్ల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన ప‌రిశోధ‌న కూడా ఇందులో ఉంది. 
అంతేకాక‌, 10 కోట్ల మంది (సుమారు 50 కోట్ల మంది లబ్ధిదారు)నిరుపేద‌, బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల కుటుంబాల‌ను క‌వ‌ర్ చేసేందుకు  ప్ర‌భుత్వం ఆయుష్మాన్ భార‌త్ - ప్ర‌ధాన మంత్రి జ‌న ఆరోగ్య యోజ‌న (పిఎంజెఎవై)ను ప్రారంభించారు. ద్వితీయ‌, తృతీయ ఆసుప‌త్రుల‌లో చికిత్స కోసం చేరేందుకు ప్ర‌తి కుటుంబానికి సంవ‌త్స‌రానికి రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు క‌వ‌రేజ్‌ను ఇది అందిస్తుంది. ఆయుష్మాన్ భార‌త్‌- పిఎంజెఎవై ప్రారంభంతో, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజ‌న (ఆర్ఎస్‌బివై) , సీనియ‌ర్ సిటిజెన్ ఆరోగ్య బీమా ప‌థ‌కం (ఎస్‌సిహెచ్ఐఎస్‌)ను అందులో క‌లిపివేశారు. ఆర్ఎస్‌బివై,ఎస్‌సిహెచ్ఐఎస్ ప‌థ‌కాల కింద న‌మోదు చేసుకున్న ల‌బ్ధిదారు కుటుంబాల‌న్నీ కూడా ఆయుష్మాన్ భార‌త్‌- పిఎంజెఎవై కింద లాభం పొంద‌వ‌చ్చు. 
ఈ స‌మాచారాన్ని కేంద్ర సామాజిఇక న్యాయం, సాధికార‌త శాఖ స‌హాయ మంత్రి కుమారి ప్ర‌తిమా భౌమిక్ లోక్‌స‌భ‌లో మంగ‌ళ‌వారం అడిగిన ఒక ప్ర‌శ్న‌కు లిఖిత‌పూర్వ‌క రూపంలో స‌మాధాన‌మిచ్చారు. 

 

***

 


(रिलीज़ आईडी: 1988514) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil