సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలో ఊపందుకున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర


న్యూ ఢిల్లీలోని ఎన్ డిఎంసి సివిక్ సెంటర్ లో విబిఎస్ వై కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, శ్రీ పీయూష్ గోయల్

దక్షిణ ఢిల్లీలో విబిఎస్ వై కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

చాణక్యపురిలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రకు నేతృత్వం వహించిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి

Posted On: 16 DEC 2023 8:02PM by PIB Hyderabad

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార,  ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ , మాజీ ఎంపి శ్రీ బైజయంత్ జయ్ పాండా ఈ రోజు న్యూఢిల్లీలోని ఎన్ డిఎంసి సివిక్ సెంటర్ లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర పౌరవిమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎంపీ రమేశ్ భిదురి దక్షిణ ఢిల్లీలో జరిగిన విబిఎస్ వై  కార్యక్రమంలో, కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి చాణక్యపురిలో జరిగిన వి బి ఎస్ వై కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్ డిఎంసి సివిక్ సెంటర్ లో శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ను నిర్వహించారు. అనంతరం గోయల్ మీడియాతో మాట్లాడుతూ,  వి బి ఎస్ వై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన హామీలను సామాన్యుల వద్దకు తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేశారన్నారు.

ముద్రా యోజన, పీఎం స్వనిధి, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన వంటి సంక్షేమ పథకాలను సాకారం చేయడమే ఈ యాత్ర లక్ష్యమని, 'మోదీ కీ గ్యారంటీ' వ్యాన్లు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాయని, సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల ముంగిటకే చేరవేస్తున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యాత్ర ఉద్దేశం, లక్ష్యం గురించి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఈ యాత్ర సాహసోపేతమైన ముందడుగు అని అన్నారు.

జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, సామాన్యుల సంక్షేమం కోసం రూపొందించిన పథకాలు సరైన చేతికి అందేలా ఐ ఇ సి  వ్యాన్ కృషి చేస్తుందన్నారు. పథకాలను నూటికి నూరు శాతం పూర్తి చేయడమే ఈ యాత్ర లక్ష్యమని, పథకాల ఫలాలు దేశంలోని ప్రతి లబ్ధిదారుడికి అందేలా చూడాలన్నారు.

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర గురించి మంత్రి మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను ఇంకా సద్వినియోగం చేసుకోని వారికి తెలియజేయడం, సహాయం చేయడం ప్రభుత్వ కర్తవ్యమని నొక్కి చెప్పారు. దేశంలోని పేదలకు వనరులపై మొదటి హక్కు ఉందన్నారు. పీఎంజీకేఏవై కింద 80 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ పొందుతున్నారని, 4 కోట్ల మందికి పైగా పక్కా ఇళ్లు పొందారని, జల్ జీవన్ మిషన్ కింద కుళాయి ద్వారా 13 కోట్లకు పైగా ఇళ్లకు ఉచిత నీటి కనెక్షన్ లభించిందని వివరించారు.

చాణక్యపురిలో జరిగిన విబిఎస్ వై కార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి భారత ప్రభుత్వ విభిన్న సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన పెంచడానికి ఉద్దేశించిన జాతీయ మిషన్ ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెఎవై), పోషణ్ అభియాన్, పిఎం ఉజ్వల యోజన వంటి కీలక కార్యక్రమాలను గురించి శ్రీమతి లేఖి అచంచలమైన ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో వివరించారు. ఈ సమిష్టి ప్రయత్నం సమ్మిళిత వృద్ధి , పౌర సాధికారత పట్ల స్థిరమైన అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుంది, ఉజ్వలమైన సమిష్టి భవిష్యత్తు కోసం ఈ పరివర్తన కార్యక్రమాల విస్తృత భాగస్వామ్యం, అవగాహనను నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది.

***

 


(Release ID: 1987383) Visitor Counter : 104


Read this release in: English , Urdu , Hindi , Kannada