సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
దేశంలోని ప్రతి వ్యక్తికీ జీవిత భద్రత కల్పించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికత ఫలితంగా సామాన్య మానవుడి ఆకాంక్షలను ఇంటింటికీ చేరవేసే సాధనమే వికాస్ భారత్ సంకల్ప యాత్ర (విబిఎస్‌వై) అని అభివర్ణిస్తూ, గతంలో పౌరులు ప్రభుత్వం వద్దకు వెళ్ళేవారని, ఇప్పుడు వారి గడపవద్దకు ప్రభుత్వం వెళ్తోందన్న మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
16 DEC 2023 7:05PM by PIB Hyderabad
దేశంలోని ప్రతి వ్యక్తికీ జీవిత భద్రత కల్పించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికత ఫలితంగా సామాన్య మానవుడి ఆకాంక్షలను ఇంటింటికీ చేరవేసే సాధనమే వికాస్ భారత్ సంకల్ప యాత్ర (విబిఎస్‌వై) అని కేంద్ర శాస్త్ర & సాంకేతిక వ్యవహారాలు (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయమంత్రి, పిఎంఒ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శనివారం పేర్కొన్నారు.
తొలిసారి చేపట్టిన ప్రత్యేక చొరవగా వికాస్ భారత్ సంకల్ప యాత్రను అభివర్ణిస్తూ, ఇంతకు ముందు పౌరులు ప్రభుత్వం వద్దకు వెళ్ళేవారని, ఇప్పుడు ప్రభుత్వమే వారి గడపల వద్దకు వస్తోందని ఆయన వర్ణించారు.
సామాన్య మానవుడి పట్ల సద్భావన సున్నితత్వం, ఇంకా నెరవేర్చవలసిన వారి ఆకాంక్షలను నెరవేర్చాలనే ప్రధానమంత్రి నిబద్ధత నుంచి విబిఎస్ఐ జన్మించిందని ఆయన అన్నారు కథువా జిల్లాలోని హీరానగర్ బ్లాకులోని గుర్హా ముండియన్. పంచాయతీలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో నిర్వహించిన విబిఎస్‌వై కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
ఎన్నికలతో విబిఎస్‌వైకి ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం జమ్ము& కాశ్మీర్‌లో ఎన్నికలకు ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటుందన్నారు. కేంద్రంలో మే 2014లో అధికారాన్ని చేపట్టిన వెంటనే పలు పథకాలను ప్రధాన మంత్రి అమలు చేయడం ప్రారంభించారన్నారు. అటువంటి తొలి పథకాలలో జన్‌థన్ యోజన ఒకటని, అప్పుడు ఎటువంటి ఎన్నికల సమయం కాదని ఆయన తెలిపారు. కొవిడ్ మహమ్మారి కాలంలో సమాజంలోని పేద, బలహీనవర్గాల అకౌంట్లకు ప్రత్యక్షంగా ప్రభుత్వం ధనాన్ని బదిలీ చేయడం వల్ల ఎవరూ సమస్యల్లో చిక్కుకోలేదన్నారు. పౌరుల జీవితాలకు భద్రత కల్పించాలన్న ప్రధానమంత్రి దార్శనికతలో ఇది ఒక భాగమని అన్నారు.
సమాజంలోని పేద, బడుగు వర్గాలకు పథకాల లాభాలను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్నసేవలకు, ప్రచారానికి కొనసాగింపే విబిఎస్ఐ అని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు.
ఇంతకు ముందు ప్రభుత్వం ప్రజల అవసరాలను నెరవేర్చిందని, ఇప్పుడు అది వారి ఆకాంక్షలను నెరవేరుస్తోందని ఆయన తెలిపారు. కుల లేదా మత ఆధారంగా ఎటువంటి వివక్ష లేకుండా మారుమూల ఉన్న పంచాయితీ, గ్రామం, ప్రతి వ్యక్తికీ ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని మంత్రి అన్నారు.
పారిశుద్ధ్యం, వ్యవసాయానికి సంబంధించిన వాటితో సహా పలు ప్రభుత్వ పథకాలలో తన లోక్‌సభ నియోజకవర్గం సంతృప్త స్థాయిని చేరుకున్న ప్రత్యేకతను పొందిందని మంత్రి పట్టి చూపారు.
ఈ సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన వివిధ చొరవలను, పథకాలను అమలు చేయడంలో అద్భుతమైన పనితీరు కనబరిచిన కొందరు సర్పంచిలకు అభినందన పత్రాలను మంత్రి అందచేశారు.
విబిఎస్ఐ కార్యక్రమంలో భాగంగా, ఆరోగ్య పరీక్షల వంటి సేవలను అక్కడికక్కడ అందించేందుకు ఏర్పాటు చేసిన పలు స్టాళ్ళను డాక్టర్ సింగ్ సందర్శించారు.
***
(Release ID: 1987317)
Visitor Counter : 63