పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

సూరత్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం గా ప్రకటించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

Posted On: 15 DEC 2023 7:35PM by PIB Hyderabad

సూరత్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించే ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర  మంత్రివర్గ సమావేశం  ఆమోదం తెలిపింది.

సూరత్ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం వల్ల సూరత్ కు వచ్చే అంతర్జాతీయ  ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుంది.  వజ్రాలు, వస్త్ర పరిశ్రమల  ఎగుమతి-దిగుమతి కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ వ్యూహాత్మక చర్య వల్ల  ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుంది.  వాగ్దానం చేస్తుంది, అంతర్జాతీయ విమానయాన రంగంలో  సూరత్‌ గుర్తింపు పొందుతుంది.సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి.  

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా సూరత్ గుర్తింపు పొందింది.  పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అవసరమైన వనరులు సూరత్ లో ఉన్నాయి. సూరత్ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం వల్ల  ఆర్థిక వృద్ధిని మరింత  పెంపొందించడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, దౌత్య సంబంధాలను పెంపొందించడానికి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.   సూరత్ విమానాశ్రయానికి  అంతర్జాతీయ హోదా కల్పించడం వల్ల ప్రయాణీకుల సంఖ్య, సరుకుల పెరిగి    ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుంది. 

 

***



(Release ID: 1986999) Visitor Counter : 95