పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 ప్రకారం పర్యావరణ అనుకూల వ్యర్థాల నిర్వహణ కోసం అనేక వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమాలు నోటిఫై చేయబడ్డాయి
Posted On:
14 DEC 2023 3:22PM by PIB Hyderabad
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 కింద వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమాలను పర్యావరణ అనుకూల నిర్వహణ కోసం నోటిఫై చేసింది:
(i) సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2016,
(ii) ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2016 ,
(iii) బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2016,
(iv) నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2016,
(v) ప్రమాదకర మరియు ఇతర వ్యర్థాల (నిర్వహణ మరియు సరిహద్దుల తరలింపు) నియమాలు, 2016,
(vi) ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్ నియమాలు , 2022,
(vii) బ్యాటరీ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2022.
మొత్తం వ్యర్థాలలో.. అంటే పట్టణ ప్రాంతాల్లో దాదాపు 1.5 లక్షల ఎం టీ/డీ ఉత్పత్తి చేయబడుతుంది, దాదాపు 76 % ప్రాసెస్ చేయబడింది.
2022 సంవత్సరంలో, సంబంధిత వ్యర్థాల నిర్వహణ నియమాల ప్రకారం, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాలు, ఇ-వ్యర్థాలు, వేస్ట్ టైర్, బ్యాటరీ వ్యర్థాలు, వినియోగించిన ఆయిల్ వంటి పదార్థాల పర్యావరణ అనుకూల నిర్వహణ కోసం మార్కెట్ మెకానిజం ఆధారంగా విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత (ఈపీఆర్) కూడా అమలు చేయబడింది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాలు, ఈ-వ్యర్థాలు, వేస్ట్ టైర్, బ్యాటరీ వ్యర్థాలు మరియు వినియోగించిన ఆయిల్ కోసం ఈపీఆర్ వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగం అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
అలాగే, స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) కింద గత ఎనిమిదేళ్లలో దేశంలో ఘన వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలు, బయో-మెడికల్ వ్యర్థాలు, ఇ-వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల ప్రాసెసింగ్ సామర్థ్యం 2014 నుండి పెరిగింది. ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ సామర్థ్యం సుమారు 1,05,876 టీపీడీలకు పెరిగింది.
విడిగా ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్రమాదకర మరియు ఇతర వ్యర్థాలు, బయోమెడికల్ వ్యర్థాలు, ఈ-వ్యర్థాలు మరియు సీ అండ్ డీ వ్యర్థాల పర్యావరణ అనుకూల నిర్వహణపై కూడా మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 ప్రకారం వ్యర్థాల నిర్వహణ నియమాల అమలు కోసం ఆదేశాలు కూడా జారీ చేయబడ్డాయి. అలాగే, ప్రమాదకర వ్యర్థాలు, ఇ-వ్యర్థాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాల కోసం కాలుష్యం కారక సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టాలు / పర్యావరణ పరిహార ఛార్జీలు విధించడానికి మార్గదర్శకాలు అభివృద్ధి చేయబడ్డాయి.
పథకం మార్గదర్శకాల ప్రకారం పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణతో సహా ఘన వ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్రం అదనపు సహాయం అందిస్తుంది. ఐదేళ్లలో దేశంలోని స్వచ్ఛనగరాలుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 (ఎస్బీఎం-యూ 2.0)ని అక్టోబర్ 2021లో ప్రారంభించింది. ఐదేళ్లలో అన్ని పట్టణ స్థానిక సంస్థలు పట్టణాలను, నగరాలను చెత్త రహిత నగరాలుగా మారే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కనీసం 3-స్టార్ సర్టిఫైడ్ (చెత్త రహిత నగరాల కోసం స్టార్ రేటింగ్ ప్రోటోకాల్ ప్రకారం) ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, తడి, పొడి చెత్తను వేరుచేయడం, పురపాలక సంఘాలు ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు.
2021 నుంచి 2026 వరకు.. అంటే 5 సంవత్సరాల వ్యవధిలో మొత్తం ఆర్థిక వ్యయం రూ.1,41,678 కోట్లు అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద, చెత్త మూలాల విభజన, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తగ్గించడం, బయో-రిమెడియేషన్, నిర్మాణ వ్యర్థాలు, కూల్చివేత వ్యర్థాల సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి వాటిపై దృష్టి సారించింది. స్వచ్ఛ భారత్ మిషన్ - గ్రామీణ దశ II కింద, తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కార్యాచరణ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో గ్రామ స్థాయిలో ఘన వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలు ఉన్నాయి.
కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1986625)
Visitor Counter : 279