రక్షణ మంత్రిత్వ శాఖ
ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఐఎన్‌ఎస్ కద్మాట్ పర్యటన
प्रविष्टि तिथि:
14 DEC 2023 9:48AM by PIB Hyderabad
ప్రస్తుతం కొనసాగుతున్న దీర్ఘకాలిక మోహరింపు ఆపరేషన్‌లో భాగంగా, ఐఎన్‌ఎస్ కద్మాట్ ఈ నెల 12న ఫిలిప్పీన్స్‌లోని మనీలా తీరానికి చేరుకుంది. భారత్-ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర రంగ సహకారాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటన లక్ష్యం.
ఐఎన్‌ఎస్ కద్మాట్ మనీలా పోర్టులో ఉన్న సమయంలో రెండు నౌకాదళ బృందాల మధ్య కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. వృత్తిపరమైన పరస్పర సమావేశాలు, నైపుణ్యాలపై అభిప్రాయాల మార్పిడి, నౌకల పరస్పర సందర్శన, సహకారం పెంపొందించుకోవడం, ఉత్తమ అభ్యాసాలను పరస్పరం మార్పుకోవడం వంటివి ఈ కార్యక్రమాల్లో ఉన్నాయి. నౌకల సందర్శన కోసం పాఠశాల విద్యార్థులను కూడా అనుమతిస్తారు. నౌకదళ సిబ్బంది సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మనీలా నుంచి బయలుదేరిన తర్వాత, ఫిలిప్పీన్ నౌకాదళంలోని తీర గస్తీ నౌక బీఆర్‌పీ రామన్ అల్కరాజ్ - ఐఎన్‌ఎస్ కద్మాట్ కలిసి దక్షిణ చైనా సముద్రంలో ఉమ్మడి విన్యాసాలు చేపడతాయి.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన, జలాంతర్గామి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ కద్మాట్. అత్యాధునిక జలాంతర్గామి విధ్వంసక ఆయుధ సామగ్రి దీనిలో ఉన్నాయి.
INSKADMATTARRIVEDATMANILA,PHILIPPINESJW6Q.jpeg)
INSKADMATTARRIVEDATMANILA,PHILIPPINESM81R.jpeg)
***
(रिलीज़ आईडी: 1986168)
आगंतुक पटल : 133