పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

పర్యావరణ పరిరక్షణ కార్యాచరణకు సంబంధించి ఇండియా దేశంలో కార్యకలాపాలపై దృష్టి పెట్టడమే కాక , అంతర్జాతీయంగా చేపట్టవలసిన చర్యలపైనా దృష్టిపెడుతోంది: శ్రీ భూపేంద్ర యాదవ్


“వాతావరణ కార్యాచరణ విషయంలో యువత పాత్ర విలువైనది. వీరికి పర్యావరణ దృష్టి, సాంకేతిక శక్తి కల్పించవలసి ఉంది’’

“గ్రీన్ క్రెడిట్స్ చొరవ స్వచ్ఛందంగా భూమండల అనుకూల కార్యాచరణకు, అంతర్జాతీయ సహకారానికి వీలు కల్పిస్తుంది: కేంద్ర మంత్రి


“గ్రీన్ రైజింగ్ గ్లోబల్ ఇనిషియేటివ్ అనేది వాతావరణ మార్పుకు సంబంధించి దేశ జాతీయ కార్యాచరణకు కనీసం 10
మిలియన్ల మంది పిల్లలు తోడ్పడనున్నారు’’

Posted On: 08 DEC 2023 4:46PM by PIB Hyderabad

ఇండియా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో దేశీయంగా ప్రగతిపై దృష్టిపెట్టడమే కాక,
అంతర్జాతీయంగా ఆయా దేశాలు ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూసేందుకు,తద్వారా సుస్థిర ప్రపంచాన్ని నిర్మించేందుకు కృషి చేస్తోందని కేంద్ర
పర్యావరణ , అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ అన్నారు. ఈ చర్యలు ప్రస్తుత తరానికి , భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
ఈ విలువలు వసుధైవ కుటుంబకం అన్న ఒకే ప్రపంచం– ఒకే కుటుంబం– ఒకే భవష్యత్తు అన్న దానిలో ఇమిడి ఉన్నాయని ఆయన అన్నారు.
వాతావరణ మార్పుల విషయంలో భారత్ తీసుకునే చర్యలు ఈ విలువల ఆధారంగా ఉంటాయన్నారు.
గ్రీన్ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించే సందర్భంలో మాట్లాడుతూ మంత్రి ఈ విషయం చెప్పారు. ఈ కార్యక్రమం, యువత నేతృత్వంలో
వాతావరణ మార్పులపై కార్యాచరణ, పరిష్కారాల సాధనకు నిర్దేశించినది.

పర్యావరణ పరిరక్షణకు సంబంధించి యువత కార్యాచరణ, వాతావరణ మార్పుల సంక్షోభానికి తగిన పరిష్కారాల సాధనకు సంబంధించి
దుబాయ్లో జరిగిన కాప్ 28 సదస్సులో మంత్రి మాట్లాడారు. సుస్థిర ప్రపంచ సాధనలో యువత పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన అన్నారు.
వాతావరణ మార్పుల వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో యువత ఉన్నారని ఆయన అననారు.  ఇప్పుడు ఈ విషయంలో వారు నిర్లిప్తంగా ఉంటే, ముందు ముందు వారు దాని తీవ్ర పరిణామాలను చవిచూడవలసి ఉంటుందని అన్నారు.
ఈ విషయంలో యువత తగిన బాధ్యత తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో యువత పాత్ర అత్యంత కీలకమైనదనడంలో ఎలాంటి సందేహం లేదని శ్రీభూపేంద్ర యాదవ్ అన్నారు.
యువత పారిశ్రామిక వేత్తలుగా, ఆవిష్కర్తలుగా, పర్యావరణ స్పృహ కలిగిన వ్యక్తులుగా సమాజంలో వారు సానుకూల మార్పును తీసుకురాగలరని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు పరిపాలనలో సుస్థిరతను కీలకమైన అంశంగా చేయడంలో యువత ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు.
సరైన పరిజ్ఞానం, సరైన నైపుణ్యాలతో యువత తమను తాము తీర్చిదిద్దుకునేలా చేయడం మన బాధ్యత అని ఆయన అన్నారు.
ఈ సరైన పరిజ్ఞానంలో సాంకేతిక శక్తి, పర్యావరణ స్పృహ ఇమిడి ఉన్నాయన్నారు.

వాతావరణ మార్పుల సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ శ్రీ భూపేంద్ర యాదవ్, ప్రకృతితో మన సంబంధాలు తెగిపోయాయని,
అందువల్లే ఈ సంక్షోభమని అన్నారు. ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టుకోవడం కోసం పర్యావరణ సమతూకం పునరుద్ధరించేందుకు ప్రయత్నించడమంటే,
అది మన ఓటమిని మనమే కొనితెచ్చుకోవడం లాంటిదని అన్నారు.
అందువల్ల ఇండియా , పర్యావరణ పరిరక్షణ ద్వారా ,ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోయే విధానాన్ని అనుసరిస్తున్నదని ఆయన అన్నారు.
ఈ దిశగా అంతర్జాతీయ చర్యలుఉ ప్రారంభమైనట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్ నాయకులుగా యువత సామర్థ్యాల నిర్మాణం,
కోసం తీసుకునే సంయుక్త చర్యలు, వాతావరణ మార్పుల యుగానికి ఒక చోదక శక్తిగా ఉండాలని ఆయన అన్నారు.


పర్యావరణ పరిరక్షణ కు సంబంధించి ఇండియా చేపడుతున్న సంప్రదాయ , సాంస్కృతితో ముడిపడిన చర్యలు, ఆధునిక విధానాలతో కలిసిపోయే విధంగా ఉన్నాయని భూపేంద్ర యాదవ్ అన్నారు. భారతదేశ జాతీయ వాతావరణ మార్పుల కార్యాచరణ, కింద చేపట్టిన వ్యూహాత్మక పరిజ్ఞాన మిషన్ దీనిని స్పష్టం చేస్తున్నదన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను అర్థం చేసుకోవడం, వాటిపై దృష్టిపెట్టడం, ప్రత్యేకించి యువత, విద్యార్థులలో దీనిపై అవగాహన కల్పించడం ఇందులో ముఖ్యాంశాలన్నారు.


వాతావరణ మార్పులపై పోరాటానకి తన వంతు పాత్ర పోషించడంలో ఇండియా నాయకత్వపాత్ర పోషిస్తున్నది.
దీనిని , సంస్థలు, జాతీయ స్థాయికి మాత్రమే పరిమితం చేయకుండా దీనిని వ్యక్తుల స్థాయికి, కమ్యూనిటీ స్థాయికి విస్తరింప చేస్తున్నది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇంతకు ముందు  ప్రారంభించిన గ్రీన్ క్రెడిట్స్,  పర్యావరణ పరిరక్షణకు సానుకూల చర్యలు చేపట్టడంలో,
అంతర్జాతీయంగా పరస్పర సహకారానికి, భాగస్వామ్యాలకు వీలు కల్పిస్తుందని చెప్పారు. ఈ రంగంలో పరస్పరం  విజ్ఞాన బదిలీ,
అనుభవాలు పంచుకోవడం,  ఉత్తమ విధానాలు, ప్రణాళిక, అమలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి న సానుకూల చర్యలను
పర్యవేక్షించడం వంటి వాటిని ఈ విధానాలు మరింత ప్రోత్సహిస్తాయన్నారు.
సుస్థిర జీవన విధానాలు, కార్యాచరణకు సంబంధించిన చర్యల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు చేతులు కలిపేందుకు
మంత్రి ప్రోత్సాం అందజేశారు.
గ్రీన్ రైజింగ్ గ్లోబల్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడుతూ మంత్రిర,  అభివృద్ధి చెందుతున్న దేశాలలోని సుమారు 10 మిలియన్ల మంది యువత, పిల్లలు ప్రత్యేకించి బాలికలు, హరిత నైపుణ్యాలను అందిపుచ్చుకుంటారని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వాములతో కలసి వాతావరణ మార్పులపై పోరాట కార్యాచరణలో పాలుపంచుకుంటారని చెప్పారు. యువత ,దేశం, ప్రపంచం సుస్థిర ప్రగతి సాధించాలన్న భారతదేశ దార్శనికతకు అనుగుణంగా ఇది ఉన్నదని మంత్రి తెలిపారు.
జనరేషన్ అన్ లిమిటెడ్ సంస్థ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , కెవిన్ ఫ్రే మాట్లాడుతూ, “వాతావరణ మార్పులకు సంబంధించి, సవాళ్లను ఎదుర్కోవడంలో మనం
సానుకూల చర్యలు తీసుకోవచ్చు.ఇందుకు వాతావరణ మార్పులకు సంబంధించిన పరిజ్ఞానం అందించడం, హరిత నైపుణ్యాలు అందించడం,
హరిత ఉద్యోగాలు, ఉపాధి కల్పన,  ఈ రంగంలో పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం, పిల్లలు, యువతను వాతావరణ మార్పుల సంక్షోభాన్ని ఎదుర్కొనే కార్యక్రమాలలో భాగస్వాములను
చేయడం ద్వారా సానుకూల ఫలితాలు సాధించవచ్చని అన్నారు.
యునిసెఫ్, జనరేషన్ అన్ లిమిటెడ్, ఇతర భాగస్వాములు దుబాయ్ లో గ్రీన్ రైజింగ్ చొరవను ప్రారంభించారు.ఇది
పిల్లలు, యువత,కు విద్య, నైపుణ్యాలు అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా నాయకులు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో బాలలు,యువతను భాగస్వాములను చేసేలా చేయడంలో కీలక పాత్ర పోషించేలా చేయడానికి దీనిని ప్రారంభించడం జరిగింది. క్షేత్ర స్థాయికి ఈ కార్యక్రమాలను తీసుకువెళతారు.గ్రీన్ రైజింగ్ వివిధ రంగాల నాయకులను ఏకం చేసి, వాతావరణ మార్పుల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన చర్యలపై
ఇందుకు సంబంధించిన చిత్తశుద్ధితో కూడిన చర్యల అమలుకు కృషి చేస్తుంది. అలాగే బాలలు, యువతను ఇందులో భాగస్వామలును చేస్తుంది.
వివిధ సంస్థలు, తమ వనరులు, నైపుణ్యాలను ఇందుకోసం వినియోగించేందుకు ప్రోత్సహిస్తుంది. ప్రముఖ నాయకులు గ్రీన్ రైజింగ్కు తమ మద్దతు నిస్తున్నారు.

ఈ సమావేశంలో ఈజిప్ట్ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి డాక్టర్ రానియా అల్ మస్హత్,రిపబ్లిక్ ఆఫ్ ర్వాండా పర్యావరణ శాఖ మంత్రి,
డాక్టర్ జీనే డి ఆర్క్ ముజావమారియా, జనరేషన్ అన్ లిమిటెడ్ సి.ఇ.ఒ డాక్టర్ కెవిన్ ఫ్రె, యునిసెప్ ప్రతినిధులు ఈ సమావేశంలో మంత్రి వెంట పాల్గొన్నారు.

 

***



(Release ID: 1986131) Visitor Counter : 93


Read this release in: English , Hindi , Marathi