ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
జిపిఎఐ సదస్సు 2023లో జిఎఐ (వైయువిఎఐ)తో ఉన్నతి, వికాస్ కోసం యువత ప్రదర్శన
అగ్ర 10 వైయువిఎఐ కార్యక్రమ ఫైనలిస్టుల ప్రకటన
జిపిఎఐ సదస్సులో ఎఐ ఆధారిత సామాజిక ప్రభావ ప్రాజెక్టులను ప్రదర్శించనున్న వైయువిఎఐ ఫైనలిస్టు విద్యార్ధులు
Posted On:
10 DEC 2023 6:46PM by PIB Hyderabad
జాఇతీయ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఇజిడి), కేంద్ర ఎలక్రటానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఇఐటివై) మంత్రిత్వ శాఖ, ఇంటెల్ ఇండియాల సహకార చొరవ యువ (వైయువిఎఐ) - యూత్ ఫర్ ఉన్నతి అండ్ వికాస్ విత్ ఎఐ త్వరలోనే జరుగనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అంతర్జాతీయ భాగస్వామ్య (జిపిఎఐ) సదస్సులో ప్రముఖంగా ప్రదర్శితం కానుంది. అత్యవసర ఎఐ నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేయడానికి రూపకల్పన చేసిన ఈ కార్యక్రమం దాని వినూత్న పద్ధతికి, భవిష్యత్ సంసిద్ధత కోసం శ్రామికశక్తిని సన్నధ్ధం చేయాలన్న నిబద్ధత అందరి దృష్టిని ఆకర్షించింది.
ఎఐలో లోతైన అవగాహనను వృద్ధి చేసేందుకు, దేశవ్యాప్తంగా 8 నుంచి 12వ తరగతి పాఠశాల విద్యార్ధులను ఎఐ నైపుణ్యాలతో సన్నద్ధం చేసేందుకు, వారిని ఎఐ మానవ కేంద్రిత డిజైనర్లు, వినియోగదారులుగా మార్చడాన్ని వైయువిఎఐ లక్ష్యంగా పెట్టుకున్నది. ఎఐ క్షేత్రంలో నాయకులను, విధాన కర్తలను, నిపుణులను ఒక చోటికి చేర్చే వేదిక అయిన జిపిఎఐ సదస్సు డిసెంబర్ 12-14, 2023 వరకు ఇక్కడ జరుగనుంది. తన ప్రాముఖ్యతను, ప్రభావాన్ని ప్రదర్శించేందుకు వైయువిఎఐకి ఆదర్శనీయమైన వేదికను ఇది అందిస్తుంది. ప్రపంచం ఎఐ పరివర్తనాత్మక శక్తిని వీక్షిస్తున్నప్పుడు, వివిధ సామాజిక సవాళ్ళను బాధ్యతాయుతంగా ఎఐను ఉపయోగించడం ద్వారా పరిష్కరించేందుకు తర్వాతి తరాలకు మార్గదర్శకంగా, ప్రోత్సాహక వెలుగుగా వైయువిఎఐ ఉండనుంది.
వైయువిఎఐ లక్షణాలు, కీలక నవీకరణలుః
గరిష్ట సంఖ్యలో విద్యార్ధులు భవిష్యత్ సంసిద్ధతను కలిగి ఉండేలా చూసేందుకు వైయువిఎఐ కార్యక్రమాలను బహుళ బృందాలుగా అమలు అవుతూ మూడు దశలలో పురోగమిస్తున్నది. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే దిశగా తమ ఎఐ జ్ఞానాన్ని ఉపయోగించేలా విద్యర్ధులకు సామాజిక ఇతివృత్తాలను పరిచయం చేస్తుంది.
మొదటి బ్యాచ్‌లో, 8,500కి పైగా విద్యార్ధులు నమోదు చేసుకోగా, తర్వాత వారు ఎఐ మౌలిక భావనలను నేర్చుకునేందుకు ఆన్‌లైన్ ఓరియంటేషన్ సెషన్లకు హాజరయ్యారు.
ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమానికి నమోదు చేసుకొని, ఓరియంటేషన్ సెషన్లకు హాజరయ్యారు. తర్వాత విద్యార్ధులు ఈ కార్యక్రమంలోని ఎనిమిది కీలక ఇతివృత్తాలలో ఒకదానిలో వినూత్న ఎఐ ఆధారిత ఐడియాలను సమర్పించారు.
ఈ కార్యక్రమానికి అనూహ్య రీతిలో 750 విద్యర్ధులు మొదటి దశలో ఎఐ ఆధారిత ఐడియాలను సమర్పించారు. రెండవ దశలో అగ్ర 200 ఎఐ ఆధారిత ఐడియాలను షార్ట్‌లిస్ట్ చేశారు. ఇలా ఎంపిక అయిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో లోతైన ఎఐ శిక్షణను, సర్టిఫై చేసిన ఇంటెల్ ఎఐ కోచ్‌లు, నిపుణులతో మార్గదర్శకత్వ సెషన్లకు హాజరయ్యారు. వీరు విద్యార్ధులు తమ పరిష్కారాలకు మరింత పదను పెట్టుకునేందుకు తోడ్పడ్డారు. తర్వాత విద్యార్ధులు 3దశ మూల్యాంకనం కోసం తమ ఎఐ ప్రాజెక్టులను సమర్పించారు.
మూడవ దశలో అగ్ర 50 విద్యార్ధులను షార్ట్‌లిస్ట్ చేసి, నాలుగురోజుల ముఖాముఖి వేగవంతమైన మోడలింగ్ వర్క్‌షాప్‌కు - తమ ప్రాజెక్టులకు మరింత పదను పెట్టుకొని, వాటిని తమ నమూనాలుగా అభివృద్ధి చేసేందుకు పారిశ్రామిక నిపుణుల నుంచి ముఖాముఖి మార్గదర్శకత్వం, అప్రెంటీస్‌షిప్, మార్గదర్శకత్వాన్ని పొందేందుకు ఆహ్వానాన్ని అందుకున్నారు. అగ్ర 10 విద్యార్ధులను షార్ట్ లిస్ట్ చేసేందుకు బహుళ జ్యూరీ ప్యానెల్ అక్కడికక్కడ ప్రాజెక్టు ప్రెజెంటేషన్‌ను నిర్వహించింది.
తమ ఎఐ ఆధారిత సామాజిక ప్రభావ ప్రాజెక్టులను ప్రదర్శించే అగ్ర 10 పైనలిస్టులు జిపిఎఐ సదస్సులో వైయుఎవిఐకి ప్రాతినిధ్యం వహిస్తారు. జిపిఎఐ ఆవిష్కృతమవుతుండగా, ఎఐ అనేది కేవలం ఒక సాధనం లేక పరికరం మాత్రమే కాదని, సానుకూల మార్పు కోసం ఉపయోగించగల ఒక శక్తిగా పరిగణించే భవిష్యత్తును సృష్టించడంలో సహకరించేందుకు విధానకర్తలను, విద్యావేత్తలను, అగ్ర పారిశ్రామిక నాయకులకు స్ఫూర్తినివ్వాలన్నది వైయువిఎఐ లక్ష్యం.
***
(Release ID: 1986120)
Visitor Counter : 113