పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాజమండ్రి విమానాశ్రయం నూతన టెర్మినల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా


● రూ.350 కోట్లతో రాజమండ్రి విమానాశ్రయం విస్తరణ

● 17,029 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం అభివృద్ధి ఇది ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనం కంటే 400 రెట్లు ఎక్కువ.

● విస్తరణ తర్వాత 2100 మంది ప్రయాణికులకు సేవలు అందించనున్న నూతన టెర్మినల్ భవనం ఇది ప్రస్తుత సామర్థ్యం కంటే 10 రెట్లు ఎక్కువ.

Posted On: 10 DEC 2023 4:39PM by PIB Hyderabad

రాజమండ్రి విమానాశ్రయం నూతన టెర్మినల్ భవన నిర్మాణానికి  పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ఈరోజు శంకుస్థాపన చేశారు.నూతన జీఆర్ఐహెచ్ఏ ప్రమాణాలకు అనుగుణంగా 5 స్టార్ రేటింగ్ పొందే విధంగా భవనాన్ని నిర్మిస్తారు. స్థానిక కళ, సంస్కృతి ఉట్టిపడేలే  స్థిరమైన డిజైన్‌తో పర్యావరణహితంగా నిర్మాణం జరుగుతుంది. 

నూతన టెర్మినల్ భవనం ముఖ్య అంశాలు: 

* ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి  టెర్మినల్ లో థర్మల్ ఇన్సులేషన్ సౌకర్యం కల్పిస్తారు. 

* పర్యావరణ సమస్యలు లేకుండా ఎక్కువ వెలుతురూ ప్రసరించడానికి ఎల్ఈడ్ వ్యస్థ ఏర్పాటు. 

* భూగర్భ జలాలు పెరిగేలా చూసి బాహ్య నీటి వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం వర్షం నీరు నిల్వ చేయడానికి వ్యవస్థ 

* మొక్కల పెంపకానికి నీరు  అందించడానికి మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు 

* సహజ వెలుతురు ప్రసరించేలా చూసి ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు సౌకర్యాలు 

టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన  శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక అభివృద్ధి కోసం కాకుండా సమూల  మార్పుల కోసం కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా రాజమండ్రి విమానాశ్రయం నూతన టెర్మినల్ భవన నిర్మాణం జరుగుతుందన్నారు. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని టెర్మినల్ భవనాన్ని 17,029 చదరపు మీటర్ల విస్తీర్ణంలో  అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు.  ఇది ప్రస్తుత టెర్మినల్ భవనం కంటే 400 రెట్లు ఎక్కువ. విస్తరణ తర్వాత  21,094 చ.మీ వైశాల్యం స్థలంలో భవనం  2100 మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.  ఇది ప్రస్తుత సామర్థ్యం కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ కొత్త టెర్మినల్ భవనాన్ని అభివృద్ధి చేసిన తర్వాత డిమాండ్ ఉంటే కేంద్ర ప్రభుత్వం కొత్త కార్గో టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తుందని శ్రీ సింధియా వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పౌర విమానయాన రంగం సాధించిన అభివృద్ధిని వివరించిన  శ్రీ సింధియా మాట్లాడుతూ 2014కి ముందు ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 4 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు వీటి సంఖ్య  6కి చేరిందన్నారు. 2014 సంవత్సరంలో 388 వరకు ఉన్న 1162 కి పెరిగిందని మంత్రి తెలిపారు. 

రాష్ట్రంలో భోగాపురం, నెల్లూరు లో  నిర్మిస్తున్న రెండు కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, ప్రకాశం వాటర్ బ్యారేజీ త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని శ్రీ సింధియా తెలియజేశారు.

దేశంలో పౌర విమానయాన రంగం అభివృద్ధి పధంలో నడుస్తోందని శ్రీ సింధియా తెలిపారు. 2030 నాటికి దేశంలో 200 కి పైగా విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తాయన్నారు.  ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో విమానాశ్రయాలు ఉంటాయని చెప్పారు.  40 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు విమాన సేవలు ఉపయోగించుకుంటారని శ్రీ సింధియా వివరించారు. దీనివల్ల అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారతదేశం గుర్తింపు పొందుతుందన్నారు. 

ప్రస్తుతం రాజమండ్రి నుంచి  మూడు  హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వారానికి 126 విమాన సర్వీసులు నడుస్తున్నాయి.పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని  350 కోట్ల వ్యయంతో 17,029 చదరపు మీటర్ల అదనపు విస్తీర్ణంలో టెర్మినల్ భవనం విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విస్తరణ తర్వాత టెర్మినల్ భవనం  మొత్తం వైశాల్యం 21,094 చ.మీ.గా ఉంటుంది.  రద్దీ సమయాల్లో 2100 మంది ప్రయాణికులకు,ఏటా 30 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందించడానికి సహాయపడుతుంది.

విమానాశ్రయం క్రింది ప్రయాణీకుల సౌకర్యాలు కలిగి ఉంటుంది: 

*28 చెక్-ఇన్-కౌంటర్లు

* విమానాశ్రంలోకి రావడానికి  నాలుగు కన్వేయర్ బెల్ట్‌లు (ఇప్పటికే ఉన్న టెర్మినల్‌ను అరైవల్‌గా టెర్మినల్ గా  మారుస్తారు)

*ఎనిమిది X-Bis యంత్రాలు

* మూడు ఏరోబ్రిడ్జిలు

* తగిన సంఖ్యలో ఆహార, పానీయ కేంద్రాలు, రిటైల్ అవుట్‌లెట్‌లు

* సుగమ్య భారత్ అభియాన్ నిబంధనల ప్రకారం దివ్యాంగుల కోసం  సౌకర్యాలు 

* 600 (సుమారు) కార్ల కోసం పార్కింగ్ స్థలం 

కొత్తగా విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఆధునిక టెర్మినల్ భవనం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.వారసత్వం, సాంస్కృతిక ఉట్టిపడేలా రూపుదిద్దుకునే  కొత్త టెర్మినల్ భవనం   రాజమండ్రి ని పర్యాటకులకు ప్రసిద్ధ గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుంది. 

కార్యక్రమంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు  వాణిజ్యం, ఐటీ, చేనేత  జౌళి శాఖల మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ శ్రీ జక్కంపూడి రాజా శాసనసభ సభ్యుడు  శ్రీ మార్గాని భరత్ రామ్,  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వుమ్‌లున్‌మాంగ్ వుల్నామ్ మరియు ఏఏఐ  చైర్మన్ శ్రీ సనిజ్వ్ కుమార్  పాల్గొన్నారు.

 

***


(Release ID: 1986119) Visitor Counter : 94


Read this release in: English , Urdu , Hindi