రక్షణ మంత్రిత్వ శాఖ
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ జపాన్ పర్యటన
Posted On:
10 DEC 2023 7:40PM by PIB Hyderabad
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్ జపాన్ కు అధికారిక పర్యటన కోసం 10 డిసెంబర్ రాత్రి బయలుదేరారు. ఇరు దేశాల మధ్య గల బలమైన రక్షణ సంబంధాలను మరింత శక్తిమంతం చేయడం ఈ పర్యటన లక్ష్యం. ఈ పర్యటన భారత్- జపాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది.
తన పర్యటన సందర్భంగా, జనరల్ అనిల్ చౌహాన్ జపాన్‌లోని సీనియర్ మిలిటరీ నాయకత్వంతో సమావేశం కావడమే కాక, రక్షణ ఏర్పాట్లను, సంస్థలను కూడా సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి శ్రీమినొరు కిహారాను కలుసుకోవడం, జపాన్ ఆత్మరక్షణ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్, జాయింట్ స్టాఫ్ జనరల్ యోషిదా యొషిహిదెతో సమావేశం, అక్విజిషన్ టెక్నాలజీ & లాజిస్టిక్స్ ఏజెన్సీ (ఎటిఎల్ఎ) కమిషనర్ శ్రీ ఫుకసావా మసాకీ, జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ (ఎన్ఐడిఎస్) ఉపాధ్యక్షడు మేజర్ జనరల్ అదాచీ యొషికిని కలుసుకొని ముచ్చటించడం కీలక అంశాలుగా ఉన్నాయి.
ఇందుకు అదనంగా, ఎన్ఐడిఎస్‌లో అధ్యాపక సిబ్బంది, రీసెర్చ్ స్కాలర్లతో ముచ్చటించి, సైనిక స్ఠావరాలను కూడా సిడిఎస్ సందర్శిస్తారు. ఈ సమావేశాలు, సంభాషణలు ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు తోడ్పాటుతో పాటు రక్షణ పరికరాలు, సాంకేతికతలలో సహకారం అన్నవి ఈ పర్యటన లక్ష్యాలుగా ఉన్నాయి.
జపాన్ మారిటైం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డిఫి- తీర ఆత్మరక్షణ దళాల) యూనిట్లను సందర్శించడమే కాక ఫునకొషి జెంఎఎస్‌డిఎఫ్ స్థావరం సెల్ఫ్ డిఫెన్స్ దళం కమాండర్ ఇన్ చీఫ్ తో కూడా సిడిఎస్ సంభాషించనున్నారు. జనరల్ అనిల్ చౌహాన్ హిరోషిమా పీస్ పార్క్‌ను కూడా సందర్శించి హిరోషిమా బాధితుల సంస్మరణార్ధం అక్కడ పుష్పగుచ్ఛాన్ని ఉంచనున్నారు. ఈ ప్రాంతంలో శాంతి, ప్రశాంతతలను పెంచే దిశగా హిరోషిమాలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన ప్రత్యేక నివాళులు అర్పించనున్నారు.
భారత్, జపాన్‌లు 2023లో 71ఏళ్ళ దౌత్యసంబంధాలను వేడుకగా జరుపుకోనున్నాయి. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్న విషయాన్ని ఈ పర్యటన నొక్కి చెప్తుంది. భారత్, జపాన్‌ల మధ్య గత 70 ఏళ్ళుగా వర్ధిల్లుతున్న శాశ్వత స్నేహబంధాన్ని ప్రదర్శిస్తూ, ఈ పర్యటన రక్షణ సహకారంతో సహా పలు వ్యూహాత్మక అంశాలపై ద్వైపాక్షిక సహకారాన్ని ఈ పర్యటన మరింత వృద్ధి చేస్తుంది.
***
(Release ID: 1986118)
Visitor Counter : 72