రక్షణ మంత్రిత్వ శాఖ
డిజిటల్ కోస్ట్ గార్డ్ ప్రాజెక్టు కోసం టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌తో రూ. 588.68 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ
Posted On:
08 DEC 2023 3:46PM by PIB Hyderabad
డిజిటల్ సైనిక దళాల కోసం భారత ప్రభుత్వ వ్యూహాత్మక దార్శనికతకు అనుకూలంగా మొత్తం రూ. 588.68 కోట్ల విలువతో బయ్ (ఇండియన్) వర్గం కింద డిజిటల్ కోస్ట్ గార్డ్ (డిసిజి) ప్రాజెక్టును కొనుగోలు చేసేందుకు 8 డిసెంబర్ 202న రక్షణ మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టిసిఐఎల్)తో ఒప్పందంపై సంతకం చేసింది.
భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసిజి) కోసం కీలకమైన చొరవ అయిన డిసిజి ప్రాజెక్టు , ఆధునిక డేటా కేంద్ర నిర్మాణం, బలమైన విపత్తు పునరుద్ధరణ డేటా కేంద్రం ఏర్పాటు, ఐసిజి ప్రదేశాల వ్యాప్తంగా అనుసంధానత పెంచడం, ఇఆర్‌పి వ్యవస్థను అభివృద్ధి చేయడం వంటి వాటిని ఆవరించిన సమగ్ర సాంకేతికత పురోగతి ఇతివృత్తాన్ని విశిదం చేస్తుంది. అత్యాధునిక రక్షణ సాంకేతికతలో ముందువరుసలోకి దూసుకువెడుతూ ఈ ప్రాజెక్టు సురక్షిత ఎంపిఎల్ఎస్/ విఎస్ఎటి అనుసంధానత సామర్ధ్యాన్ని పెంచి అగ్రగామిగా నిలుపుతుంది.
మూలంలో డిసిజి ప్రాజెక్టు అత్యాధునిక సాంకేతిక సామర్ధ్యాలు గల టైర్- 3 స్టాండర్డ్ డాటా సెంటర్ స్థాపనను సూచిస్తుంది.
నాడీ కేంద్రంగా పని చేస్తూ, ఐసిజి మోహరించిన అప్లికేషన్ల కేంద్రీకృత పర్యవేక్షణ, నిర్వహిణకు తోడ్పడుతూ, ఐసిజి కీలక ఐటి ఆస్తులపై అప్రమత్తమైన పర్యవేక్షణను నిర్ధారిస్తుంది.
ఈ ప్రాజెక్టు ఐదేళ్ళ కాలంలో ఒకటిన్నర లక్షల పనిదినాలను ఉత్పత్తి చేస్తుందని అంచనా, వివిధ రంగాల భారతీయ పరిశ్రమల నుంచి చురకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, తద్వారా రక్షణరంగంలో ఆత్మనిర్భరతను సాధించాలన్న ప్రభుత్వ యత్నాలకు గణనీయంగా దోహదం చేస్తుంది.
***
(Release ID: 1984276)
Visitor Counter : 97