వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతుల నమోదు మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్

Posted On: 08 DEC 2023 5:17PM by PIB Hyderabad

2016ఖరీఫ్  సీజన్ నుండి దేశంలో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) రాష్ట్రాలు మరియు రైతులకు స్వచ్ఛందంగా అమలులో ఉంది పథకం కింద రైతులకు అతి తక్కువ ప్రీమియంతో పంటలను విత్తే ముందు నుండి పంటల పండే తర్వాత దశల వరకు నివారించలేని సహజ ప్రమాదాల నుండి రైతుల పంటలకు సమగ్ర నష్టపు కవరేజీ అందించబడుతుందినమోదు చేసుకున్న రైతు దరఖాస్తుల పరంగా పథకం కింద కవరేజ్ సంవత్సరానికి పెరుగుతోంది. 30.11.2023 నాటికి అందుబాటులో ఉన్న డేటా ప్రకారంరబీ 2022-23 మరియు ఖరీఫ్ 2023 సీజన్లలో వరుసగా 435 లక్షలు మరియు 689 లక్షల మంది రైతు దరఖాస్తులు  పథకం కింద నమోదు చేయబడ్డాయిఅంతేకాకుండా, 2022-23 మరియు 2021-22 సంవత్సరాల్లో రైతుల దరఖాస్తుల సంఖ్య వరుసగా 33.4% మరియు 41% వార్షికంగా వృద్ధి చెందింది. ఖరీఫ్ 2022తో పోల్చితే 2023 సీజన్లో (నవంబర్ 30, 2023 వరకుపథకం కింద బీమా చేసిన రైతులలో 28.9% వృద్ధి కూడా ఉందిరబీ 2022-23 సీజన్ కోసం 7.8 లక్షల మంది రైతుల దరఖాస్తులకు గాను రూ.3,878 కోట్లు చెల్లించారువ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో  సమాచారాన్ని అందించారు.

***



(Release ID: 1984274) Visitor Counter : 69


Read this release in: English , Urdu , Tamil