వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

30.06.2024 వరకు షిప్‌మెంట్‌కు ముందు తర్వాత రూపాయి ఎగుమతి రుణా వడ్డీ ఈక్వలైజేషన్ స్కీమ్‌ను కొనసాగించడానికి రూ. 2500 కోట్ల అదనపు కేటాయింపులను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం

Posted On: 08 DEC 2023 8:35PM by PIB Hyderabad

 వడ్డీ సమీకరణ పధకాన్ని 2024 జూన్ 30 వరకు కొనసాగించడానికి   రూ. 2500 కోట్ల అదనపు కేటాయింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన  కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుర్తించిన రంగాలకు చెందిన ఎగుమతిదారులకు,అన్ని ఎంఎస్ఎంఈ   తయారీదారు ఎగుమతిదారులకు  షిప్‌మెంట్‌ ముందు, తర్వాత  పోటీ రేట్ల వద్ద రూపాయి ఎగుమతి క్రెడిట్. పొందేందుకు పథకం  సహాయపడుతుంది.

 వివరాలు:

 గుర్తించబడిన 410 టారిఫ్ లైన్ల తయారీదారులు, వ్యాపారుల ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈ రంగాల  తయారీదారుల ఎగుమతిదారుల అందరికీ దిగువ పేర్కొన్న ధరల ప్రకారం ప్రయోజనం కొనసాగుతుంది: 

 

క్ర. స 

ఎగుమతిదారుల వర్గం

వడ్డీ రేటు సమీకరణ

1

410 టారిఫ్ లైన్లలో జాబితాలో ఉన్న   ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న తయారీదారులు,  వ్యాపార ఎగుమతిదారులు

2%

2

అన్ని టారిఫ్ లైన్ల  ఎంఎస్ఎంఈ   ఎగుమతిదారులు

3%

 

అమలు వ్యూహం మరియు లక్ష్యాలు:

ఎగుమతిదారులకు రవాణాకు ముందు ,తర్వాత రుణ పరపతి అందిస్తున్న  వివిధ ప్రభుత్వ, ప్రైవేటు  నారంగ  బ్యాంకుల ద్వారా ఈ పథకాన్ని ఆర్బీఐ  అమలు చేస్తుంది. ఈ పథకాన్ని    సంప్రదింపుల యంత్రాంగం ద్వారా సంయుక్తంగా డిజీఎఫ్టీ,  ఆర్బీఐ పర్యవేక్షిస్తాయి.

 

 ప్రభావం:

అంతర్జాతీయంగా పోటీ పడేందుకు ఎగుమతుల రంగానికి పోటీ ధరలకు రవాణాకు ముందు ,తర్వాత రుణ లభ్యత ముఖ్యం. ఐఐఎం  కాశీపూర్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం వడ్డీ సమీకరణ పథకం దేశ ఎగుమతులకు రంగానికి ప్రయోజనం కలిగిస్తుంది.  ఉపాధి కల్పనకు  ఎంఎస్ఎంఈ   రంగం కీలకం. ఈ పథకం ప్రధానంగా కార్మికులు ఎక్కువగా పనిచేసే రంగాలు, కోసం ఉద్దేశించబడింది. ఈ ఉపాధి కల్పన రంగాల నుంచి ఎక్కువగా ఎగుమతులు జరగడం వల్ల  దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  

 

 ఆర్థికపరమైన అంశాలు: 

ప్రస్తుతం ఈ పథకం రూ. 9538 కోట్ల అంచనాలతో అమలు జరుగుతోంది. 30.06.2024 వరకు పథకాన్ని  కొనసాగించడానికి రూ. 2500 కోట్లు అదనంగా అవసరం ఉంటాయి. పథకం కింద అంచనా వేసిన వార్షిక వ్యయం సుమారు రూ. 2500 కోట్లు.

 

 లాభాలు:

ఉద్దేశించిన లక్ష్య లబ్ధిదారులలో నాలుగు అంకెల స్థాయిలో 410 టారిఫ్ లైన్‌లకు చెందిన కొన్ని గుర్తించచిన రంగాలకు చెందిన తయారీదారు ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈ లు కాని  ఎగుమతిదారులు ఉన్నారు.

 ఇప్పటికే అమలులో ఉన్న పథకం, వివరాలు , పురోగతి :

గత సంవత్సరాల కాలంలో పథకం కింద మొత్తం చెల్లింపుల వివరాలు  క్రింది విధంగా ఉన్నాయి 

స.నెం.

ఆర్థిక సంవత్సరం

బడ్జెట్ కేటాయింపులు 

(కోట్ల లో)

వాస్తవ వ్యయం

(కోట్ల లో)

1

2021-22

3488

3488 (బకాయిలతో సహా)

2

2022-23

3118

3118

3

2023-24

2932

2641.28(30.11.2023 నాటికి)

 

నేపథ్యం: :

 అర్హత కలిగిన ఎగుమతిదారులకు ఎగుమతిదారులకు  షిప్‌మెంట్‌ ముందు, తర్వాత  పోటీ రేట్ల వద్ద   రూపాయి ఎగుమతి క్రెడిట్‌పై వడ్డీ సమీకరణ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ఏప్రిల్ 1, 2015న ప్రారంభమయ్యింది.  31.3.2020 వరకు సంవత్సరాల పాటు అమలు చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. కోవిడ్ సమయంలో ఒక సంవత్సరం పాటు పథకాన్ని  ప్రభుత్వం పొడిగించింది.  తర్వాత అదనపు కేటాయింపులతో పధకాన్ని పొడిగించింది. ప్రస్తుతం ఈ పథకం 4 అంకెల స్థాయిలో గుర్తించిన  410 టారిఫ్ లైన్‌ల వ్యాపారి, తయారీదారు ఎగుమతిదారులకు 2% చొప్పున,   ఎంఎస్ఎంఈ తయారీదారుల ఎగుమతిదారులందరికీ 3% చొప్పున  షిప్‌మెంట్‌కు ముందు మరియు పోస్ట్ షిప్‌మెంట్ రూపాయి ఎగుమతి క్రెడిట్‌పై  వడ్డీ సమీకరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ పథకంలో  నిధుల పరిమితం లేదు ఎగుమతిదారులందరికీ ఎటువంటి పరిమితి లేకుండా ప్రయోజనాన్ని అందిస్తుంది. . ఐఈసి (దిగుమతి ఎగుమతి కోడ్) కింద   వ్యక్తిగత ఎగుమతిదారులకు  రూ. 10 కోట్లకు ప్రయోజనం  పరిమితం చేయబడింది. అదనంగారెపో + 4% కంటే ఎక్కువ సగటు రేటుతో ఎగుమతిదారులకు రుణాలు ఇచ్చే  బ్యాంకులను  పథకం నుంచి తొలగిస్తారు. 

 

***


(Release ID: 1984266) Visitor Counter : 131