వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఎం గతి శక్తి 62వ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ సమావేశం
రూ. 15,000 కోట్ల విలువైన నాలుగు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించిన సమావేశం
Posted On:
08 DEC 2023 3:16PM by PIB Hyderabad
పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ 62వ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్పీజీ ) సమావేశం పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) శ్రీమతి సుమితా దావ్రా అధ్యక్షతన నిన్న జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన సమావేశానికి రోడ్డు రవాణా ,రహదారుల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఓడరేవులు,నౌకా నిర్మాణం , జలమార్గాల మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ శాఖ, పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ కు చెందిన దాదాపు 60 మంది అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో రెండు రైల్వే లైన్ ప్రాజెక్టులపై చర్చలు జరిగాయి. జార్ఖండ్ రాష్ట్రంలో 127 కి.మీ పొడవున నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్టుపై చర్చ జరిగింది. బొగ్గు బ్లాకులకు పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యం కల్పించి, ప్రయాణ దూరం, సమయం తగ్గించడం లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది.
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో నిర్మిస్తున్న బ్రౌన్‌ఫీల్డ్ రైల్వే లైన్ ప్రాజెక్టును సమావేశంలో సమీక్షించారు. బర్న్‌పూర్, దుర్గాపూర్ అసన్‌సోల్ పారిశ్రామిక ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగు పరచడానికి ఈ రైల్వే లైన్ నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ పై ఒత్తిడి తగ్గించి, అదనపు ట్రాఫిక్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చి దూరాన్ని తగ్గించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందడం లక్ష్యంగా ప్రాజెక్ట్ ప్రణాళిక సిద్ధం అయ్యింది.
పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ఉత్పత్తి ప్రాంతాలు,వాణిజ్య ప్రాంతాల మధ్య బహుళ రవాణా వ్యవస్థ అభివృద్ధి చేసి మెరుగైన రవాణా వ్యవస్థ ద్వారా ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది.ఈ కోణంలో రెండు ప్రాజెక్టులను నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ సమావేశం పరిశీలించింది.
ఈ రెండు ప్రాజెక్టులతో పాటు 300 కిలోమీటర్లకు పైగా నిర్మించనున్నరెండు రోడ్డు ప్రాజెక్టులు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి.ఛత్తీస్‌గఢ్ జార్ఖండ్‌లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ప్రయాణ దూరం 11% ( 153.45 నుంచి 136.62 కిలోమీటర్లకు), ప్రయాణ సమయం 56% (5 గంటల నుంచి 2.5 గంటల వరకు).తగ్గుతుంది.
అస్సాం, మిజోరం లో ప్రతిపాదించిన రహదారి నిర్మాణ ప్రాజెక్టును సమావేశం పరిశీలించింది. ప్రత్యామ్న్యాయ రహదారిగా దీనిని నిర్మించడం వల్ల దూరం 20% (215 నుంచి 172 కిలోమీటర్లకు) ప్రయాణ సమయం 50% ( 5 నుంచి 2.5 గంటలకు) తగ్గుతుంది. పారిశ్రామిక పార్కులు, వెదురు టెక్నాలజీ పార్కుకు ఈ రహదారి వల్ల ప్రయోజనం కలుగుతుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన రైల్ సాగర్ కారిడార్ నిర్మాణం కూడా చర్చకు వచ్చింది. 2031 నాటికి రైలు, ఓడరేవుల ఆధారిత కార్గో వాటాను పెంచడం, రైల్వేలకు మోడల్ మార్పును మెరుగుపరచడం , సరుకు రవాణాలో కాలుష్యాన్ని తగ్గించడానికి రైల్ సాగర్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది.
దేశాభివృద్ధిలో బహుళ రవాణా వ్యవస్థ కీలకంగా ఉంటుందని శ్రీమతి సుమితా దావ్రా పేర్కొన్నారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల అభివృద్ధికి బహుళ రవాణా వ్యవస్థ దోహదపడుతుందన్నారు.
వెనుకబడిన, గిరిజన ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయడం, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టులు ప్రాంత అభివృద్ధి, సాధికారత, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి దోహదపడతాయన్నారు. వస్తువులు, సేవల తరలింపును సులభతరం చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధికి అనువైన పరిస్థితి కల్పించడానికి వీలవుతుందని సభ్యులు పేర్కొన్నారు. సమర్థవంతమైన ప్రాజెక్టుల రూపకల్పనలో పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కీలకంగా ఉంటుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పరిసరాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంత అభివృద్ధి ప్రణాళిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించడానికి ప్రాజెక్టులు సహకరిస్తాయి.
***
(Release ID: 1984166)
Visitor Counter : 108