రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఔషధ ధరలను నిర్ణయించే నిబంధనలు

Posted On: 08 DEC 2023 3:05PM by PIB Hyderabad

డీపీసీవో 2013 ప్రస్తుత నిబంధనల ప్రకారం, ప్రతి షెడ్యూల్డ్ లేదా నాన్-షెడ్యూల్డ్‌ ఔషధాల తయారీ సంస్థ, తాను అమ్మకానికి ఉద్దేశించిన  ఔషధాల పెట్టె మీద, చిల్లర అమ్మకానికి ఉద్దేశించిన ప్యాకెట్‌ మీద ఆ ఔషధం గరిష్ట చిల్లర ధరను చెరిగిపోని విధంగా ముద్రించాలి. దాని కింద 'అన్ని పన్నులతో కలుపుకుని' అనే పదాలు ఉండాలి. డీపీసీవో 2013 ప్రకారం, ప్రతి తయారీ సంస్థ డీలర్లకు ధరల జాబితాను జారీ చేయాలి. డీలర్లు, తమ వ్యాపార ప్రాంగణంలో అందరికీ కనిపించేలా అదే ధరను ప్రదర్శించాలి. ప్రస్తుత ధరల జాబితాలో ఉన్న ధర, లేదా కంటైనర్/ప్యాకెట్‌ లేబుల్‌ మీద సూచించిన ధరలో ఏది తక్కువైతే ఆ ప్రకారం ఔషధం విక్రయించాలి. డీపీసీవో 2013 నిబంధనల ప్రకారం, అధిక ధర వసూలు చేస్తే ఎన్‌పీపీఏ ద్వారా ఆ కేసులను పరిష్కరిస్తారు. ఔషధ దుకాణాల ద్వారా వినియోగదార్లకు ఎంఆర్‌పీపై రాయితీని అందించడంపై మార్గనిర్దేశం అందుతుంది తప్ప అది నియంత్రణ ఆదేశం కిందకు రాదు.

డీపీసీవో 2013 ప్రస్తుత నిబంధనల ప్రకారం, షెడ్యూల్డ్‌ ఔషధాల గరిష్ట ధరను ఎన్‌పీపీఏ నిర్ణయిస్తుంది. షెడ్యూల్డ్‌ ఔషధాల గరిష్ట ధరను ముందుగా రిటైలర్‌కు సాధారణ సగటు ధరను రూపొందించడం ద్వారా నిర్ణయిస్తారు. ఒక శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగిన నిర్దిష్ట ఔషధాల అన్ని బ్రాండెడ్-జనరిక్, జనరిక్ రకాల విషయంలో ఈ పద్ధతి పాటిస్తారు. నిర్దిష్ట ఔషధ గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ), ప్రకటిత గరిష్ట ధర+వర్తించే పన్నులను మించకూడదు. పోటీ లేని ఔషధాల గరిష్ట ధరను, కొత్త ఔషధం చిల్లర ధరను కూడా డీపీసీవో 2013 నిర్ణయిస్తుంది. ఎన్‌పీపీఏ నిర్ణయించిన ధరల వివరాలు ఎన్‌పీపీఏ వెబ్‌సైట్‌ www.nppaindia.nic.inలో అందుబాటులో ఉన్నాయి.

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

***


(Release ID: 1984163) Visitor Counter : 101