రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఎన్.హెచ్.ఏ.ఐ. - ఆర్థిక పరిస్థితి
Posted On:
06 DEC 2023 3:18PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం తరఫున జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి ఎన్.హెచ్.ఏ.ఐ. ని ఏర్పాటు చేయడం జరిగింది. రహదారుల అభివృద్ధి కోసం ఎన్.హెచ్.ఏ.ఐ. కి బడ్జెట్ కేటాయింపుల తో పాటు, అంతర్గత, అదనపు బడ్జెట్ వనరుల (ఐ.ఈ.బీ.ఆర్) కింద అప్పు తీసుకునేందుకు ఆమోదం ద్వారా ప్రభుత్వం నిధులు అందిస్తుంది. అదనంగా, ఆస్తులు విక్రయించడం ద్వారా ఎన్.హెచ్.ఏ.ఐ. వనరులను సమీకరిస్తోంది. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఐ.ఈ.బీ.ఆర్. ను నిలిపివేయడం జరిగింది.
గత 5 ఏళ్ల రుణాల వివరాలు ఏడాది వారీగా అనుబంధం లో పొందుపరచడం జరిగింది.
తన రుణాలు తిరిగి చెల్లించడానికి ఎన్.హెచ్.ఏ.ఐ. ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది.
భూసేకరణలో జాప్యం, చెట్ల కోత, వినియోగాల తరలింపు, అకాల వర్షాలు, స్థానిక ఆందోళనలు, అటవీ అనుమతుల అనంతరం కోవిడ్-19 మహమ్మారి వంటి పలు సమస్యల కారణంగా సుమారు 167 ప్రాజెక్టుల్లో జాప్యం జరిగింది. ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆలస్యం కారణంగా ఈ ప్రాజెక్టుల వ్యయం పెరగడం అనేది - ప్రాజెక్టు కొనసాగే సమయంలో ధరల పెరుగుదలతో సహా సైట్ / స్థానిక / ప్రాజెక్టు కు సంబంధించిన నిర్దిష్ట అంశాలకు లోబడి ఉంటుంది. కాగా, ప్రాజెక్టు మొత్తం పూర్తయిన రోజు మాత్రమే వాస్తవ వ్యయపెరుగుదలను నిర్ధారించవచ్చు.
భారత ప్రభుత్వం తరఫున జాతీయ రహదారులను అభివృద్ధి చేసి, నిర్వహించడానికి ఎన్.హెచ్.ఏ.ఐ. చట్టం-1988 కింద ఎన్.హెచ్.ఏ.ఐ. ఏర్పాటు చేయడం జరిగింది. భారత ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే సంస్థ గా ఎన్.హెచ్.ఏ.ఐ., ప్రభుత్వం తరపున యూజర్ చార్జీలు వసూలు చేస్తుంది. అలా ఎన్.హెచ్.ఏ.ఐ. సేకరించిన అన్ని రశీదులను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా (సి.ఎఫ్.ఐ) లో జమ చేస్తుంది.
ఎన్.హెచ్.ఏ.ఐ. తీసుకున్న ఋణాలు:
గత 5 ఏళ్ల కాలంలో చేసిన రుణాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
(రూపాయలు కోట్లలో)
ఆర్ధిక సంవత్సరం
|
మొత్తం (అసలు)
|
2018-19
|
61,217
|
2019-20
|
74,987
|
2020-21
|
65,080
|
2021-22
|
76,150
|
2022-23
|
798*
|
* 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఎన్.హెచ్.ఏ.ఐ. 54 ఈ.సీ. బాండ్ల ద్వారా కేవలం 798 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఐ.ఈ.బి.ఆర్. లేదు.
రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(Release ID: 1983619)