రైల్వే మంత్రిత్వ శాఖ
రైళ్లలో పరిశుభ్రతను పాటించేందుకు,ప్రయాణికులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు పలు చర్యలు తీసుకున్న భారతీయ రైల్వే.
Posted On:
06 DEC 2023 4:09PM by PIB Hyderabad
రైలు బోగీలు పరిశుభ్రంగా ఉంచేందుకు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్‌న అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా,ప్రయాణికులకు నాణ్యమైన,మంచి ఆహారాన్ని అందించేందుకు భారతీయ రైల్వే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. దీని ప్రకారం భారతీయ రైల్వే రైళ్లలో పరిశుభ్రత పాటించేందుకు , క్యాటరింగ్ సేవలలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చేందుకు తీసుకున్న చర్యలు కింది విధంగా ఉన్నాయి. అవి.
1. రైళ్లనుంచి మానవ వ్యర్థాలు నేరుగా ట్రాక్‌ల పక్కన విడుదల కాకుండా, ప్రయాణికుల ప్రతి కోచ్‌లో బయోటాయిలెట్‌ను ఏర్పాటు.
2.రైలు కోచ్‌లను , టాయిలెట్‌లను యాంత్ర పరికరాలతో పరిశుభ్రం చేయడం.
3. ఎంపిక చేసిన దూరప్రాంత మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని కోచ్‌లలో టాయిలెట్‌లను శుభ్రంగా ఉంచేందుకు, కిటికీల వద్ద, తలుపుల వద్ద శుభ్రంచేసేందుకు, కంపార్టమెంట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు రైలులోనే హౌస్ కీపింగ్ సేవలు అందుబాటులో ఉంచడం.
4. పరిశుభ్రమైన ట్రైన్ స్టేషన్ (సిటిఎస్) పథకం కింద, ఎంపికచేసిన రైళ్లకు యంత్రాల ద్వారా క్లీనింగ్ సేవలు అందించడం. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగినపుడు మార్గ మధ్యంలో వీటిలో క్లీనింగ్ సేవలు చేపట్టడం.
5. స్వచ్ఛభారత్ అభియాన్ కింద, ప్రత్యేక పరిశుభ్రతా ప్రచారం క్రమం తప్పకుండా నిర్వహించి పరిశుభ్రతా లక్ష్యాలను చేరుకోవడం, రైల్వే స్టేషన్లు, రైళ్లలో మెరుగైన పరిశుభ్రతను సాధించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం, అత్యధునాతన యంత్ర పరికరాల సాయంతో టాయిలెట్లు, వాష్‌రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడం.
6. బేస్ కిచెన్, కిచెన్‌యూనిట్ల స్థాయి పెంపు.
8. బేస్ కిచెన్, కిచెన్ యూనిట్లలో ఆహార పదార్థాల తయారీని నిరంతరం పర్యవేక్షించేందుకు , వాటి స్థాయి పెంచేందుకు సిసిటివి కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు. ఎప్పటికప్పుడు రైల్వే అధికారులు , ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించడం. ఆన్ బోర్డ్ ఐఆర్‌సిటిసి సూపర్‌వైజర్లను రైలులో ఏర్పాటు చేయడం వంటి చర్యలను చేపట్టడం జరుగుతోంది.
8. రైళ్లలో కేటరింగ్ సేవలను మెరుగుపరిచేందుకు , ఐఆర్‌సిటిసి, మెనూ విషయంలో ప్రయాణికులకు వెసులుబాటు కల్పించి, స్థానిక రుచులకు అనుగుణంగా ప్రయాణికులు ఎంపికచేసుకున్న వంటకాలను అందిస్తోంది. డయాబిటిక్ పేషెంట్లు, చిన్న పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తగినట్టుగా ఆహారాన్ని అందించడంతోపాటు , పోషకాలతో కూడిన చిరుధాన్యాల వంటకాలు అందిస్తోంది.
9. ఫుడ్ పాకెట్లపై క్యుఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల ఇది తయారైన కిచెన్ పేరు, పాకింగ్ తేది వంటివి ఇందులో ఉంటాయి.
10. ప్యాంట్రీకార్‌లో పరిశుభ్రత,కిచెన్ యూనిట్లలో పరిశుభ్రత, కస్టమర్ల సంతృప్తి వంటి విషయాలపై తృతీయ పక్షం చేత ఆడిట్ నిర్వహింపచేస్తారు.
11. ఫుడ్ సేఫ్టీ నియమావళిని పాటించేందుకు, ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్‌న అథారిటీ ఆఫ్ ఇండియా (ఎప్.ఎస్.ఎస్.ఎ.ఐ) సర్టిఫికేషన్‌ను నిఆర్దేశిత ఫుడ్‌సేప్టీ అధికారులలనుంచి ప్రతి క్యాటరింగ్ విభాగం పొందడం తప్పనిసరిచేస్తూ నిబంధనల రూపకల్పన,
12. ప్రత్యేక రైల్ మదద్‌పోర్టల్‌ను రూపొందించి, దానిద్వారా ప్రయాణికుల ఫిర్యాదులు, సూచనలు, సలహాలను ప్రాధాన్యత ప్రాతిపదికన స్వీకరించేందుకు ఏర్పాటు. ట్విట్టర్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఐఆర్ క్యాటరింగ్ సిపిగ్రామ్స్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఎస్.ఎం.ఎస్‌ల ద్వారా అందుకునే ఫిర్యాదులపై వెంటనే స్పందించడం.
13. టాయిలెట్లు, వాష్‌రూమ్‌ల విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం, ఆకస్మిక తనిఖీల నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యతా పర్యవేక్షణకు చర్యలు తీసుకోవడం, ఆఫీసర్లు, సూపర్‌వైజర్ల స్థాయిలో తనిఖీలు నిర్వహించి లోపాలు ఉన్నచోట తగినచర్యలు తీసుకోవడం చేస్తున్నారు.
ఈ సమాచారాన్ని, రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శాఖమంత్రి, శ్రీ అశ్విని వైష్ణవ్ లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1983612)
Visitor Counter : 80