హోం మంత్రిత్వ శాఖ
జమ్మూ-కశ్మీర్‌లో ఉపాధి అవకాశాలు
Posted On:
06 DEC 2023 4:14PM by PIB Hyderabad
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు:
i. నిరుద్యోగ యువతకు స్థిరమైన ఆదాయాన్ని అందించేందుకు వివిధ రంగాలలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడం. 2021-22 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం 7.4 లక్షల స్వయం ఉపాధి/జీవనోపాధి అవకాశాలు కల్పించింది/ బలోపేతం చేసింది.
ii. రవాణా రంగం తో సహా వ్యాపార యూనిట్లు, స్థిరమైన జీవనోపాధి ప్రాజెక్టుల స్థాపనకు మిషన్ యూత్ కింద ముమ్కిన్, తేజస్వాని, స్పర్రింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి కొత్త పథకాలను ప్రారంభించింది.
iii. ఉద్యోగ నియామక అవకాశాలను మెరుగు పరచడం కోసం నిరుద్యోగ యువత, ఉపాధి అందించే వారి కోసం డివిజన్ జిల్లా స్థాయిలలో ఉద్యోగ మేళాలు నిర్వహణ.. గత రెండు సంవత్సరాల కాలంలో నిర్వహించిన 151 ఉద్యోగ జాబ్ మేళాలు జరిగాయి. వీటిలో మొత్తం 1631 సంస్థలు పాల్గొన్నాయి.
iv. యువతలో నైపుణ్య అంతరాలు తగ్గించడానికి 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ.
v. 2020 నుంచి 2023 వరకు (అక్టోబర్ వరకు) మొత్తం 4,74,464 మంది అభ్యర్థులు కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెరీర్ గైడెన్స్ కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మొత్తం 2,12,109 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.
vi. పునర్వ్యవస్థీకరణ తర్వాత నియామకాల కోసం పారదర్శకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు జరిగాయి. ప్రభుత్వ రంగ నియామకాలను పర్యవేక్షించేందుకు 2020లో యాక్సిలరేటెడ్ రిక్రూట్‌మెంట్ కమిటీని ఏర్పాటుఅయ్యింది.
vii. "యోగ్యత సే రోజ్గార్" కార్యక్రమం కింద పారదర్శకంగా, సమానమైన, న్యాయమైన పద్ధతిలో అర్హత -ఆధారిత ఎంపికలకు ప్రాధాన్యత ఇవ్వబడింది.
viii. పారదర్శకంగా వేగంగా నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి పే లెవెల్ 5, పే లెవెల్ 6లోని కొన్నింటితో సహా అన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు నిలిపివేయబడ్డాయి.
ix. ఆగస్టు 2019 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో మొత్తం 31,830 ఖాళీలు (జేకే బ్యాంక్‌తో సహా) భర్తీ చేయబడ్డాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ పారిశ్రామిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 19.02.2021 న రూ 28,400 కోట్ల వ్యయంతో నూతన పథకాన్ని ప్రకటించింది. .
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వివిధ విధాన కార్యక్రమాలు అమలు చేసి కేంద్రపాలిత ప్రాంతంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన అవకాశాలు అందుబాటులోకి తీసుకు రావడానికి క్రింది విధానాలు అమలు చేయడం ప్రారంభించింది.
i. జమ్మూ కాశ్మీర్ పారిశ్రామిక విధానం, 2021-30
ii. జమ్మూ కాశ్మీర్ పారిశ్రామిక భూమి కేటాయింపు విధానం, 2021-30
iii. జమ్మూ కాశ్మీర్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ పాలసీ, 2021-30.
iv. పారిశ్రామిక రంగంలో విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించడానికి ప్రోత్సహించే జమ్మూ కాశ్మీర్ విధానం 2022
v. జమ్మూ కాశ్మీర్ సింగిల్ విండో నియమాలు, 2021.
vi. టర్నోవర్ ప్రోత్సాహక పథకం, 2021.
vii. జమ్మూ కాశ్మీర్ ఉన్ని ప్రాసెసింగ్ హస్తకళలు, చేనేత విధానం, 2020.
viii. సహకార సంఘాలు /స్వయం సహాయక బృందాల కోసం ఆర్థిక సహాయ పథకం, 2020.
ix. చేతి వృత్తిదారులు, నేత కార్మికుల కోసం క్రెడిట్ కార్డు పథకం.
x. జమ్మూ కాశ్మీర్ క్రాఫ్ట్ రంగం అభివృద్ధి కోసం కర్ఖండర్ పథకం.
xi. హస్తకళలు/ చేనేత రంగాలకు చెందిన కళాకారులు/నేత కార్మికుల కోసం సవరించిన విద్యా పథకం 2022.
xii. ఎగుమతి సబ్సిడీ పథకం.
ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు రాష్ట్రానికి రూ. 88,915 కోట్లు. విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు అందాయి. దీనివల్ల . 3.98 లక్షలకు మించి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
2019 -20 నుంచి (అక్టోబర్, 2023 వరకు) రూ.5,319 కోట్ల పెట్టుబడితో పనులు ప్రారంభమయ్యాయి. పెట్టుబడి వల్ల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సాధించింది. ఉపాధి అవకాశాలను పెంచింది.
రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక యించిన సమాధానంలో హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ఈ వివరాలు తెలిపారు.
***
(Release ID: 1983610)
Visitor Counter : 68