భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
ఉష్ణ కార్యాచరణ ప్రణాళికలు (హెచ్ఎపి -హీట్ యాక్షన్ ప్లాన్)
Posted On:
06 DEC 2023 12:59PM by PIB Hyderabad
వివిధ వాతావరణ విపత్తు ఘటనల గురించి ప్రభావ ఆధారిత ముందస్తు హెచ్చరిక సేవలలో భాగం, భారత వాతావరణ విభాగం (ఐఎండి) ప్రాణ హాని, గాయాలు, ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తుల నష్టం, జీనోపాధి, సేవల నష్టం వంటివి కలిగించే వడగాడ్పులు సహా ప్రమాదకర పదమూడు వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తుగా సిద్ధమయ్యేందుకు భారత వాతావరణ ప్రమాదాలు, దుర్బలత అట్లాస్‌ను తయారు చేసింది. ఈ వెబ్ అట్లాస్ భౌగోళిక సమాచార వ్యవస్థ (జిఐఎస్) పరికరాలను ఉపయోగించి చూసేందుకు వీలుగా, ఐఎండి, పూణె వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు (https://www.imdpune.gov.in/ hazardatlas/ index.html).
ఈ అట్లాసు ఏడాది పొడవునా నెలలవారీగా ప్రమాదకర ఘటనలు, దుర్బలత ఎదుర్కొననున్న జిల్లాల మ్యాప్‌ను కేలండర్ రూపంలో అందిస్తుంది. ఈ విపత్తు మ్యాపులను వాతావరణ డాటా, జనగణన డాటా, గృహనిర్మాణ సాంద్రతను, భిన్న గణాంక, గణిత పద్ధతులను ఉపయోగించి వేసిన అంచనాల ఆధారంగా తయారు చేస్తారు. మరణాలు, ఇతర నష్టాలపరంగా ప్రాణనష్టం కలిగించే వాతావరణ విపత్కర సంఘటనలను సూచించడం కోసం ఐఎండి వార్షికంగా ప్రచురించే వార్షిక విపత్తు వాతావరణ నివేదికలలోని (Annual Disastrous Weather Reports) విపత్తుల ఆధారంగా వాతావరణ దుర్బలత మ్యాపులను తయారు చేస్తారు.
ఇటువంటి విపత్తులో వ్యవసాయ కూలీలు, తీరప్రాంతంలో నివసించేవారు, దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, ఎక్కువగా బహిర్గత ప్రదేశాలలో పని చేసేవారే బాధితులు ఉన్నారు. ఈ పదమూడు వాతావరణ ప్రమాదాలలో పదకొండు ఘటనల కోసం సాధారణీకరించిన దుర్బలత్వ సూచిక ఆధారంగా వివిధ వర్గాల దుర్బలత్వ ప్రమాణాలలో ప్రమాదకర వాతావరణ ఘటనల వల్ల ప్రభావితమైన ప్రజలు, జిల్లాల శాతాన్ని తయారు చేశారు. వడగాడ్పులు (heat waves) కోసం తయారు చేసిన దుర్బలత్వ అట్లాస్ - 13% జిల్లాలను, 15% జనాభా ఒకమాదిరి నుంచి అత్యంతగా ప్రభావవితమయ్యే వారు 4% జిల్లాలు, 7%జనాభాగా ఉన్నారు. రాజస్థాన్ (15 జిల్లాలు), ఆంధ్రప్రదేశ్ (13 జిల్లాలు) వడగాడ్పుల తాకిడి ప్రభావాన్ని అత్యధికంగా ఎదుర్కొననున్నారు.
పర్యవేక్షణను మెరుగుపరిచి, ముందస్తు హెచ్చరికలు చేసేందుకు ఐఎండి చేపట్టిన వివిధ చర్యలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు తోడ్పడ్డాయి. వేడిగాడ్పులు వంటివాటి గురించి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, అటువంటి సందర్భాలలో తీసుకోవలసిన చర్యల గురించి సలహాలను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ), స్థానిక ఆరోగ్య విభాగాల సమన్వయంతో ఐఎండి ఉష్ణ కార్యాచరణ ప్రణాళికలు (హెచ్ఎపి) ను ప్రారంభించింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉష్ణ పరిస్థితులు ఏర్పడే 23 రాష్ట్రాలలో ప్రస్తుతం హెచ్ఎపిలను అమలు చేస్తున్నారు. హీట్ వేవ్ బులిటెనన్‌ను ప్రతిరోజూ ఐఎస్‌టి 1600 గంటలకు జారీ చేస్తూ రానున్న ఐదు రోజులకు వాతావరణ సూచనలను, హెచ్చరికలను చేస్తారు. ఒక ప్రాంతంలో ఉండనున్న హీట్ వేవ్ ప్రభావాన్ని రంగుల కోడ్ (ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్, ఎరుపు)లో చూపడమే కాక, ఎన్‌డిఎంఎ మార్గదర్శకాల ప్రకారం నిర్ధిష్ట ప్రబావాన్ని లిఖితపూర్వకంగా వర్ణిస్తారు. జిల్లా స్థాయిలోని వాతావరణ కేంద్రాలు/ ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు బులిటెన్లు జారీ చేస్తాయి.
ప్రస్తుతమున్న వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఇమెయిల్ సేవలకు అదనంగా తన ముందస్తు సూచనలు, హెచ్చరిక సేవలను అందించేందుకు ఐఎండి వివిధ నూతన వేదికలను, వ్యూహాలను ప్రవేశపెట్టింది. ఐఎండి ప్రస్తుతం హీట్‌వేవ్ సమాచారాన్ని భాగస్వాములందరూ తేలికగా అర్థం చేసుకునేందుకు రోజువారీ, వారాంతపు వీడియో సందేశాల రూపంలో అందిస్తోంది. హెచ్చరిక సందేశాలు ఎక్కువమందిని చేరేలా చూసేందుకు యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇనస్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది. ఉష్ణపరిస్థితి హెచ్చరిక సేవలపై జిల్లాల వారీ, స్థానికీకరించిన సమాచారాన్ని అందించేందుకు అంకితమైన రాష్ట్ర వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. ఆరోగ్య రంగం తదితర రంగాల నిర్దిష్ట రంగాలకు ఉష్ణపరిస్థితులకు సంబంధించిన బులిటెనన్లను తయారు చేస్తున్నారు. ఆ రంగం రోగవాహక వ్యాధుల వ్యాప్తి చెందేందుకు సిద్ధం కావడం కోసం, ఉత్పాదకత నష్టాన్ని నివారించేందుకు అవసరమైన సహాయక చర్యల కోసం వ్యవసాయ రంగానికి సంబంధించిన బులిటెన్లను కూడా తయారు చేస్తున్నారు.
ఉష్ణ కార్యాచరణ ప్రణాళిక అమలు, దాని ప్రభావవంతమైన పర్యవేక్షణ అన్నవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.
ఈ సమాచారాన్ని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి శ్రీ కిరణ్ రిజిజూ బుధవారం లోక్‌సభకు సమర్పించిన లిఖితపూర్వక జవాబు ద్వారా వెల్లడించారు.
***
(Release ID: 1983209)
Visitor Counter : 166