సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దక్షిణ ఢిల్లీలో వికసిత భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విదేశాంగ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి


“భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని, భారతదేశం పురోగమించాలని, భారతదేశం ముందుకు సాగాలని, మన పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉండాలని సంకల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది”

Posted On: 05 DEC 2023 5:51PM by PIB Hyderabad

దక్షిణ ఢిల్లీలోని షాపూర్ జాట్ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు. సందర్భంగా ఆమె వికసిత్  భారత్ ప్రతిజ్ఞ చేయించి  వివిధ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడి కోసం గత 70-75 ఏళ్లుగా దేశం ఎదురు చూసిందనిఅది 2014లో జరిగిందన్నారు. 2014కు ముందు దేనికీ గ్యారంటీ ఉండేది కాదని, నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దొంగతనాలు జరగవన్న గ్యారంటీ ఉందన్నారు. ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్ కింద, ప్రధాన మంత్రి మొత్తం కుటుంబానికి రూ .5 లక్షల వరకు ఆరోగ్య హామీ ఇచ్చారని,  55 కోట్లకు పైగా ప్రజలు పథకం పరిధిలోకి వచ్చారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ యోజనను ఢిల్లీలో అమలు చేయడం లేదని, ఢిల్లీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా లేదని లేఖి అన్నారు. పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అలా చేయడంలో మనం విజయం సాధిస్తే మన జీవితం కూడా విజయవంత మవుతుంది. భారత ప్రభుత్వం ఇంటింటికీ వెళ్లి వ్యాధులను గుర్తించి , వాటిని అరికట్టేందుకు ఇళ్ల చుట్టూ ఆరోగ్య bశిబిరాలు ఏర్పాటు చేస్తోందన్నారు. మోదీ హామీ ఫలాలు అందని వారందరినీ చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు.

గతంలో 44 రకాల పన్నులు ఉండేవని, కానీ ఇప్పుడు ఒకే ఒక్క జీఎస్టీ ఉందని, దాని వల్ల ప్రభుత్వ పన్నుల వసూళ్లు పెరుగుతున్నాయని, దెబ్బతిన్న రోడ్లను సరిచేసి, ప్రజలను ఆరోగ్యంగా ఉంచడం ద్వారా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందన్నారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని, భారతదేశం పురోగమించాలని, భారతదేశం ముందుకు సాగాలని, మన పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉండాలని సంకల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మంచి డాక్టర్లు, ఇంజినీర్లు ఉండాలని, ప్రతిచోటా పరిశుభ్రత ఉండాలని, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రయత్నం వల్ల మన దేశానికి అంతర్జాతీయ వేదిక పై ఖ్యాతి వచ్చిందని లేఖి అన్నారు.

భారత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను సాకారం చేసేందుకు ఔట్ రీచ్ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించేందుకు దేశ వ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించారు. నవంబర్ 28 ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వి కె సక్సేనా అర్బన్ సి వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు.

ప్రచారంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ఐదు సి  (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) వ్యాన్లు ఢిల్లీలోని 11 జిల్లాల్లో 600కు పైగా ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నాయిపీఎం స్వనిధి, ముద్రా లోన్స్, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్ విప్లవం, పీఎం -బస్ సేవ, ఆయుష్మాన్ భారత్, పి ఎం ఆవాస్ (అర్బన్) పి ఎం ఉజ్వల యోజన వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, సంతృప్తతను సాధించడం పట్టణ ప్రచారం లక్ష్యం.

పీఎం స్వనిధి క్యాంప్, హెల్త్ క్యాంప్, ఆయుష్మాన్ కార్డ్ క్యాంప్, ఆధార్ అప్డేట్ క్యాంప్, పీఎం ఉజ్వల క్యాంప్ వంటి అప్పటికప్పుడు అందించే  సేవలను ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా యంత్రాంగం వ్యాన్ల ద్వారా నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రజలు ముఖ్యంగా మహిళలు వికసిత భారత్ సంకల్ప్ యాత్ర లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

 

***


(Release ID: 1983042) Visitor Counter : 127
Read this release in: English , Urdu , Hindi , Bengali-TR