మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఉపాధి అవకాశాలు
Posted On:
05 DEC 2023 2:54PM by PIB Hyderabad
కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర మత్స్య విభాగం ద్వారా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) అమలవుతోంది. సుమారు 55 లక్షల మంది మత్స్యకారులు, మత్స్య రైతులు, మత్స్య కార్మికులు, చేపల వ్యాపారులు, చేపల వేట & అనుబంధ కార్యకలాపాల్లో ఉన్న గ్రామీణ/పట్టణ ప్రజలు, ఇతర వ్యక్తులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించడాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. 2020-21 నుంచి 2024-25 వరకు, 5 సంవత్సరాల పథకం అమలు కాలంలో ఈ లక్ష్యాన్ని సాధించలన్నది పథకం ఉద్దేశం. చేపల పెంపకం, ఉత్పాదకత, నాణ్యమైన పెట్టుబడులు, విలువ జోడింపు, వ్యాధుల నిర్వహణ, జాతుల వైవిధ్య సాంకేతికత ఏర్పాటు, చేపలు & మత్స్య ఉత్పత్తులకు భరోసా కాలాన్ని సృష్టించడం, సమర్థవంతమైన చేపల రవాణా, మార్కెటింగ్ సౌకర్యాల పెంచడం, మెరుగైన దేశీయ & విదేశీ వ్యూహాల ద్వారా చేపల పెంపకందార్ల ఆదాయాన్ని పెంచడం కూడా పీఎంఎంఎస్‌వై లక్ష్యం. మహారాష్ట్రలో మొత్తం 3,351 మంది పీఎంఎంఎస్‌వై లబ్ధిదార్లు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారని, 1,04,790 మంది పరోక్షంగా చేపల వేట, అనుబంధ కార్యకలాపాల్లో ఉపాధి పొందుతున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దీంతోపాటు, పీఎంఎంఎస్‌వై కింద ఇప్పటివరకు ప్రత్యక్షంగా 11.46 లక్షలు, పరోక్షంగా 34.13 లక్షల ఉద్యోగ అవకాశాలు కలిపి మొత్తం 45.59 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించినట్లు అంచనా వేయడం జరిగింది.
కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1983033)
Visitor Counter : 73