వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు

Posted On: 05 DEC 2023 5:59PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలా వద్దా అన్న అంశంపై రాష్ట్రాలు, రైతులు  స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవచ్చు.వాటిల్లే అవకాశం ఉన్న నష్టాలు , ఆర్థిక వనరులు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలా వద్దా అన్న అంశంపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి ఉన్నాయి. రైతులు కూడా తమకు  వాటిల్లే అవకాశం ఉన్న నష్టాలు, ఆర్థిక పరిస్థితి ఆధారంగా పథకంలో చేరడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు. అయితే, సదరు పంట, పంట ప్రాంతాన్ని సంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతం గుర్తించి నోటిఫై చేయాల్సి ఉంటుంది. 2016-17 లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులోకి వచ్చింది. ఒకటి లేదా అంతకు మించిన పంట కాలంలో 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేశాయి. . ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్, అస్సాం, అండమాన్  నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర , తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.

రైతుల కోసం ఈ పథకం స్వచ్ఛంద పథకంగా అమలు జరుగుతోంది.అయితే, పథకం అమలు చేస్తున్న రాష్ట్రాలలో   స్థూల పంట ప్రాంతం (GCA)లో 30%కి పైగా రైతులు, రుణాలు పొందని రైతులు ఈ పథకంలో చేరి పథకానికి ఆమోదం తెలిపారు.  

ఈ పథకం కింద స్వచ్ఛందంగా నమోదు చేసుకునేలా రైతులను ప్రోత్సహించడానికి  పథకంపై  అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది,ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం  పట్ల అవగాహన కోసం తగినన్ని నిధులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. 1 అక్టోబర్ 2018 నుంచి అమల్లోకి వచ్చిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం  సవరించిన కార్యాచరణ మార్గదర్శకాలు, ఇన్సూరెన్స్ కంపెనీలు సమాచారం, విద్య, సమాచార వ్యాప్తి కార్యక్రమాల నిర్వహణ కోసం  సేకరించిన మొత్తం స్థూల ప్రీమియంలో కనీసం 0.5% మొత్తాన్ని  బీమా సంస్థలు  తప్పనిసరిగా ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

రైతులు, పంచాయతీ రాజ్ సంస్థల సభ్యులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రాలు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, సాధారణ సేవా కేంద్రాలు అమలు చేస్తున్న కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. 

పథకం పై మరింత అవగాహన కల్పించేందుకు ఖరీఫ్ 2021 పంట కాలం నుంచి ‘పంటల బీమా వారం/ఫసల్ బీమా సప్తా’ పేరుతో  వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్మాణాత్మక అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  పథకం  ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం, వాటాదారులకు అవగాహన కల్పించడం, రైతుల మొత్తం నమోదును పెంచడం, గుర్తించబడిన ఆకాంక్ష/గిరిజన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి పంట బీమా ప్రయోజనాలను పొందడంలో వారికి సహాయం చేయడం లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 

అవగాహన కార్యక్రమాలతో పాటు  పథకం అమలులో వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామ/గ్రామా పంచాయతీ  స్థాయిలో ఫసల్ బీమా పాఠశాలలు కూడా నిర్వహిస్తున్నారు.

పథకం పై  అవగాహన పెంపొందించడానికి పథకం  ముఖ్య లక్షణాలు, ప్రయోజనాలు వివరిస్తూ  ప్రముఖ జాతీయ ,స్థానిక వార్తాపత్రికలలో ప్రకటనల ద్వారా  ప్రచారం, ప్రాంతీయ / స్థానిక ఛానెల్‌లలో ఆడియో-విజువల్ స్పాట్‌లను ప్రసారం చేయడం, స్థానిక భాషలలోఐఈసి పాత్రల  పంపిణీ, వ్యాప్తి ,కిసాన్ / నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్  పోర్టల్ ద్వారా సంక్షిప్త సమాచారం పంపడం, రైతులు, పంచాయతీ సభ్యులు, సంబంధిత వర్గాలకు ఆన్‌లైన్ వర్క్‌షాప్‌ల నిర్వహణ లాంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 

మేరీ పాలసీ మేరే హాత్ కార్యక్రమం కింద ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతు ఇంటికి బీమా పాలసీ/రసీదులు పంపిణీ ని కూడా నిర్వహించింది. పిఎమ్‌ఎఫ్‌బివై కింద నమోదు చేసుకున్న రైతులకు గ్రామ పంచాయతీ/గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాల ద్వారా పంట బీమా పాలసీ రసీదుల హార్డ్ కాపీలు పంపిణీ చేస్తున్నారు. పథకం అమలులో ఉన్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు  సంబంధిత బీమా కంపెనీసహకారంతో  గ్రామ పంచాయతీ స్థాయి మెగా పాలసీ పంపిణీ కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నాయి.

ఈ కార్యక్రమాల ఫలితంగా రైతుల దరఖాస్తుల సంఖ్య 2022-23 మరియు 2021-22 సంవత్సరాల్లో వరుసగా 33.4%, 41% పెరిగింది. ఖరీఫ్ 2022తో పోల్చితే ఖరీఫ్ సీజన్‌లో (నవంబర్ 2023 వరకు) రైతు దరఖాస్తుల సంఖ్య 28.9% పెరిగింది.  బీమా చేయబడిన ప్రాంతంలో 24% పెరిగింది. . రాష్ట్రాల వారీగా బీమా చేయబడిన రైతు  దరఖాస్తుల సంఖ్య,  పథకం పరిధిలోకి వచ్చే విస్తీర్ణం (2021-22, 2022-23)అనుబంధం లో పొందుపరచడం జరిగింది. 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.

 

***

 


(Release ID: 1983032) Visitor Counter : 128
Read this release in: English , Urdu , Bengali